ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 17-05-2022 టుడే ఎపిసోడ్ !

0
intinti gruhalakshmi serial today episode 17 మే

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టుడే ఎపిసోడ్ |Intinti gruhalakshmi serial today episode :

సీన్ లోకి ఎంటర్ అయితే…

దివ్య చాలా కోపంతో ఇంటికి వస్తుంది కాలేజీ లో జరిగిన విషయం అంతా వాళ్ళ అమ్మ తో చెప్తుంది. అప్పుడు తులసి చాలా కూల్  గా తండ్రి అనే బాధ్యతతో వచ్చి ఉంటాడులే దివ్య అని చెప్తుంది అప్పుడు దివ్య చాలా కోపంతో అదెలా జరుగుతుంది నీ బాధ్యత వదిలేసినప్పుడు నా బాధ్యత ఎలా తీసుకోగలరు అని అంటుంది. నేను ఫీజు కట్టొద్దు అని చెప్పాను అని చెప్తుంది.

ఆయన ఎందుకు బాధ పెట్టావు దివ్య అని తులసి అంటుంది దివ్య దివ్య ఆయన నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆయన మీద జాలి చూపిస్తున్నావు అని అరుస్తుంది. మీ నాన్న మీద నువ్వు అయిష్టాన్ని పెంచుకోకూడదు దివ్య అని అంటుంది.

తులసి నేను నా గతాన్ని ఎప్పుడో మరిచిపోయాను దివ్య నువ్వు కూడా మర్చిపో అని చెప్తుంది అప్పుడు ఎలా మర్చిపోగలం అని అంటుంది. డాడ్ అంటే నాకు కూడా ఇష్టం ఏమో కానీ నిన్ను ఇష్టపడని డాడీ అంటే నాకు ఇష్టం లేదు నాకు నిన్ను ఇష్టపడ్డాను అంటే ఇష్టం అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు తులసి వాళ్ళ మామయ్య తో నా పిల్లలు తండ్రి లేని వాళ్ళ లాగా ఉండకూడదు మావయ్య నేను వాళ్ళకి తండ్రి ప్రేమ ఎప్పటికి దూరం చేయలేను అని చెప్పి తులసి కూడా వెళ్ళిపోతుంది.

సీన్ కట్ చేస్తే…..

నందు కాలేజ్ లో దివ్య మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. దివ్య నన్ను డాడీ అని పిలవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి లాస్య కొడుకు వస్తాడు నన్ను చూసి చాల భయపడతాడు. లాస్య కొడుకు తో నువ్వు నన్ను అంకుల్ అని పిలవకు డాడీ అని పిలుచు అని అంటాడు.

అప్పుడు వాడు నేను పిలవను అని చెప్తాడు. నవ్వు తులసి ఆంటీ ని వదిలేసి మా మమ్మీ తో ఎన్నుకుంటున్నారు అని అంటాడు. నువ్వు మా మమ్మీ ని వదిలేసి వెళ్ళిపో అని అంటాడు. నాకేం కావాలో నేను మా మమ్మీ తో చెప్పుకుంటాను నా సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు మీరు నాకు ఎప్పటికీ అంకుల్ డాడీ అవ్వ లేరు అని చెప్పి వెళ్ళిపోతాడు.

సీన్ కట్ చేస్తే……

ప్రేమ్ ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇంటి ఓనర్ వస్తాడు. సరదాగా పేకాట ఆడదామా అని అడుగుతాడు ఓనర్, అప్పుడు ప్రేమ్ ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తారా అని గట్టిగా ఓనర్ మీద అరుస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. శృతి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఓనర్ గారు మా ఆవిడ తో చెప్తానుండు మీ గురించి  అద్దె అడిగితే గొడవ కు వచ్చారు అని చెప్పి వెళ్ళిపోతాడు, ప్రేమ్ శ్రుతి మీద కూడా అరిచి వెళ్ళిపోతాడు.

సీన్ కట్ చేస్తే….

తులసి పార్క్ లో యోగా చేస్తూ ఉంటుంది. అక్కడ ఇద్దరు పిల్లలు సంగీతం పాడుతూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలు నువ్వు తప్పు పడుతున్నావ్ అంటే నువ్వు తప్పు పడుతున్నావ్ అని ఇద్దరూ గొడవ పడతారు అది చూసి తులసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆ పిల్లలు సరిగమలు తప్పు పడుతూ ఉంటారు, అప్పుడు తులసి వారితో పాటు సంగీతం పాడుతూ ఉంటుంది. తులసి చాలా బాగా సరిగమ పాలు సంగీతం పాడుతుంది. అది చూసిన ఆ పిల్లల

తల్లి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడు తులసి దగ్గరికి వచ్చి ఆ పిల్లల వాళ్ళ అమ్మ మీకు సంగీతం వచ్చా అని అడిగితే నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను అని చెప్తుంది తులసి తో మీకు ఇబ్బంది లేకపోతే నా పిల్లలకు సంగీతం నేర్పించండి అని అడుగుతుంది.

ఆ పిల్లలు తులసితో ప్లీజ్ ఆంటీ మా ఇద్దరికీ మ్యూజిక్ నేర్పించరా అని అడుగుతారు. అప్పుడు తులసికి ప్రవళిక చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అప్పుడు పిల్లల వాళ్ళ అమ్మ మా పిల్లల ముఖ్యమైన చూసి ఒప్పుకోండి మా పిల్లలకు సంగీతం నేర్పించండి అని అడుగుతుంది అప్పుడు తులసి ఓకే అని చెప్తుంది.

సీన్ కట్ చేస్తే……

దివ్య వాళ్ళ తాతయ్య తో కలసి చదరంగం ఆడుతూ ఉంటుంది.నా పావుల్ని ముట్టుకో లేవని వాళ్ళ తాతయ్య తో దివ్య అంటే వాళ్ల తాతయ్య నా పావుల్ని తట్టుకోలేవు అంటూ ఒకరితో ఒకరు చాలెంజ్ చేసుకుంటూ ఆడుతూ ఉంటారు.

వాళ్ల తాతయ్య నానమ్మ కలిసి దివ్య ని ఓడించే ప్రయత్నంలో ఉంటారు. ఇది చీటింగ్ అనే దివ్య అంటుంది. దివ్య తో పాటు ఆడటానికి వాళ్ళ అమ్మ తులసి వస్తుంది. మీరు మోసం చేయకుండా ఆడాలి ఎత్తుకు పైఎత్తు వేసి ఆడాలి అని అంటాడు వాళ్ల తాతయ్య. తులసి వాళ్ల తాతయ్య కు పెట్టేస్తుంది .

రేపటి ఎపిసోడ్ ప్రోమో:  తులసి ఆ పిల్లలకు సంగీతం నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది సంగీతం నేర్పిస్తూ ఉంటుంది అక్కడికి వస్తుంది సంగీతం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తులసి ఉంటుంది షాక్ అవుతుంది. లాస్య తో నందు నా జాబ్ కూడా పోయింది అని చెప్తాడు.

ఇవి కూడా చదవండి 

  • గుప్పెడంత మనసు సీరియల్17-05-2022 టుడే ఎపిసోడ్ !