ఇంటింటి గృహలక్ష్మి టుడే ఎపిసోడ్ | Intinti Gruhalakshmi Serial Today Episode In Telugu
ప్రోమో: దివ్య కల్లేజ్ ఫీజు కట్టాలని నందుకి కాల్ చేస్తుంది వాళ్ళ ప్రిన్సిపాల్. తులసి మొబైల్ కి మెస్సజ్ పోతుంది, తులసికి చెప్తాడు వాళ్ళ మామయ్యా ఫీజు కట్టాలని.
ఇంటింటి గృహలక్ష్మి ఈరోజు ఎపిసోడ్ : తులసి అండ్ ప్రవల్లిక జానకి వాళ్ళ ఇంటి దగ్గరకి వస్తారు .జానకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కార్ లో లాంగ్ డ్రైవ్ వెల్లదానికి రెడి అవ్తుంటుంది.జానకి వయసు చాల ఎక్కువగా ఉండటం తో ఒక్కదానివే లాంగ్ డ్రైవ్ చేస్కొని ఎలా వెళ్తారు అని తులసి అడుగుతుంది.
అప్పుడు ప్రవల్లిక కాశ్మీర్ తో కన్యాకుమారి లాంగ్డ్రైవ్ వెళ్ళటం తన డ్రీం అని చెప్తుంది. ”తను ఎప్పటినుండో వెళ్దాం అని అనుకుంటుంది కాని కుటుంబ సమస్యలు, పిల్లలు, భర్త, భాధ్యతలు ఇలాంటి చాల కారణాల వల్ల తను వెళ్ళలేకపోయింది” అని చెప్తుంది.
”సంకల్ప బలం ఉంటె దేన్నైనా సాధించ్చచ్చు” అనేది జానకిగారి పాలసి అని చెప్తుంది ప్రవల్లిక, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు కదా అందుకే వెళ్తోంది అని చెప్తుంది. చూసావా తులసి ఇది అని అంటుంది. సరే కల్లెక్టర్ గారు నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్పి వెళ్తుంది.
అప్పుడు ప్రవల్లిక ‘రేపటినుండి నిన్ను నాల విసిగించేవాళ్ళు ఉండరులే తులసి అని అంటుంది ,అప్పుడు తులసి ఎందుకు అని అడిగితే ‘ప్రవల్లిక నాకు డిల్లి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్తుంది.
తులసి ఏడుస్తుంది ,అప్పుడు ప్రవల్లిక దగ్గర లేకపోతే ఏమి నేను మాత్రం నిన్ను వదలను ఫోన్ లో కూడా నిన్ను సాదిస్తను అని నవ్వుకుంటూ అంటుంది. అప్పుడు తులసి ”నిన్ను నాకోసమే ఆ దేవుడు ఇక్కడికి పంపించాడు అని చెప్తుంది. అంత ఒక కలలా ఉంది అని అంటుంది.అప్పుడు ప్రవల్లిక నీజీవితం లో సంతోషం మాత్రం కల లా మారకూడదు అని చెప్తుంది.ఇద్దరు భాధ పాడుతారు.
సీన్ కట్ చేస్తే…
శృతి వాళ్ళ వోనెర్ తో పాటు సరుకులు కొనడానికి షాప్ కి వచ్చింటుంది, ప్రేమ్ రోడ్ లో అద్దె ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ శృతి ఎన్ని కష్టలు పడుతోందో అని నడుక్చుకుంటూ వెళ్తుంటాడు. శ్రుతి ప్రేమ్ని చూస్తుంది,తనని ప్రేమ్ చూడకూడదు అని అనుకుంటుంది.
శ్రుతి ఉన్న షాప్ దగ్గరకి టీ పౌడర్ కొనడానికి వస్తాడు.అది శ్రుతి కోసం.టీ పౌడర్ కొనకుండానే శ్రుతి ని చూడకుండా వెళ్ళిపోతాడు. శ్రుతి ని వాళ్ళ వోనెర్ తిడుతుంది. వెళ్దాం పద అని అక్కడనుండి వెళ్ళిపోతారు.
సీన్ కట్ చేస్తే…
అంకిత తన రూమ్ లో బట్టలు మదతపెడుతూ ఉంటుంది. అభి తన దగ్గరకి వచ్చి మీద చేయి వేస్తాడు, అప్పుడు అంకిత చిరాకుగా ఉంది అభి చేయి తీ అంటుంది. అప్పుడు అభి ఈ చిరాకు ఎప్పుడు పోతుంది అని అడుగుతాడు. అప్పుడు అది నాకు ఎలా తెలుస్తుంది? నీ అంతరాత్మను అడుగు అని అంటుంది. ఏం జరిగిన అన్ని మన అన్ని మనమంచికే అనుకో అంకిత అని అంటాడు అభి.
అభి అంకిత కోసం చీర తెచ్చింటాడు.గుడికి ఈ చీర కట్టుకో అని చెప్తాడు.సెలక్షన్ నాదె అని అంటాడు, అప్పుడు అంకిత డబ్బులు నీవి కాదు కదా అని అంటుంది. అవి మా మమ్మీ డబ్బులు కదా అని అంటుంది.
మా మమ్మీ డబ్బులతో కొన్న ఏ వస్తువు నాకు అవసారం లేదు అని అంటుంది అంకితా. మనసుని చంపుకొని మనిషిల బతుకుతున్నాను, నన్ను ఇంత కన్నా దిగాజారనివ్వకు అని అంటుంది. అభి తో నన్ను ఇలా వదిలేయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
సీన్ కట్ చేస్తే…!
తులసి బియ్యం బస్తాని స్కూటీ తిస్కోని వస్తుంది,దాన్ని ఎత్తలేక చాల కష్టాలు పడుతుంటారు. వాళ్ళ అత మామయ్యని అరుస్తుంది మీరు ఎత్తచ్చు కదా అని అంటుంది. తులసి కూతురు వద్దులే తాతయ్య మీకు ఇప్పుడే హార్ట్ ప్రాబ్లం కదా అని అంటుంది. ఇంతలో అక్కడికి లాస్య , నందు వస్తారు వాళ్ళని ఏవేవో మాటలు అంటారు.
ఒక బియ్యం బస్తని కూడా మోయలేరు, సంసారాని ఎలా చేస్తారు అని, అప్పుడు నందు మాటలు చెప్పడానికి ఛాలెంజ్ చేయడానికి నోరు ఉంటె సరిపోతుంది,కాని ఆ ఛాలెంజ్ నిలపెట్టుకోవడానికి సత్తా ఉండాలని అంటాడు”.
అప్పుడు నందు ని వాళ్ళ అమ్మ తిడుతుంది. నీకు చేతన అయితే బస్తా లోపలపెట్టు అంటుంది. అది నీ మాజీ కోడలుని అడగమను అని అంటాడు. నందు అప్పుడు తులసి అడగదు. మీ మనసులని తులసి చేదిపెస్తుంది అని నందు అంటాడు. వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు నందుని తిడతారు.
ఇవి కూడా చదవండి : –
- కార్తిక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ – 14 May, 2022 విశేషాలు
- వసుధార ని ప్రేమిస్తున్నా అని చెప్పేసిన రిషి ! ఈరోజు 14 May విశేషాలు!