Table of Contents
iphone 16 Pro Max Features In Telugu
ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఈ ఐఫోన్ అంటే ఎవ్వరికీ పెద్దగా తెలిసేది కాదు, కానీ ప్రస్తుతం చాలా మంది ఈ మొబైల్ నే వాడుతున్నారు. అంతేకాకుండా మనలో చాలా మంది ఐఫోన్ అంటే చాలా ఇష్టపడుతుంటారు.
యూత్ కూడా ఎప్పుడెప్పుడు ఈ ఫోన్ కొందామా అని తెగ ఎదురుచూస్తుంటారు. వీరితో పాటు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, స్పోర్ట్స్ స్టార్లు కూడా లక్షల రూపాయలు పెట్టి మరీ ఐఫోన్లను కొంటూ ఉంటారు. ఎందుకంటే మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఇందులో సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఐఫోన్ iphone15, iphone16,iphone16pro,iphone16 pro max అని చాలా రకాలు వచ్చాయి.అయితే వీటిలో మనం iphone16 pro max గురించి క్లియర్ గా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
iphone 16 pro max: ప్రముఖ టెక్ కంపెని అయిన ఆపిల్ కొత్త ఐఫోన్లు ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను మన దేశంతో పాటు ఇతర దేశాల మార్కెట్లలో కూడా లాంచ్ చేసింది. వీటిలో iphone 16 pro max సెప్టెంబర్ 20 నుంచి మనకి అందుబాటులోకి వచ్చింది.ఇప్పుడు మనం ఈ ఐఫోన్ లో ఏఏ ఫీచర్స్ ఉన్నాయో క్రింద వివరంగా తెలుసుకుందాం.
iphone 16 pro max Features
ఫ్రెండ్స్ ఈ ఐఫోన్ 16 ప్రో మాక్స్ లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటో క్రింద వివరంగా తెలుసుకుందాం.
1.డిస్‌ప్లే:
ఐఫోన్ 16 ప్రో మాక్స్లో ఫీచర్స్ లో బెస్ట్ ఫీచర్ గా డిస్‌ప్లే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఫోన్ 16 సిరిస్ లో డిస్‌ప్లే సైజు 6.3 అంగుళాలు ఉంటె ఈ 16 ప్రో మాక్స్ లో 6.9 ఇంచులతో పెద్ద డిస్‍ప్లేతో వచ్చింది. దీనితోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది.
2.ప్రాసెసర్:
ఫ్రెండ్స్ ఈ ఐఫోన్ 16 మాక్స్ A18 Pro chip ప్రాసెసర్ తో వచ్చింది.ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు,అంతేకాకుండా మొబైల్ ఓవర్ హీట్ కాకుండా కొత్త థర్మల్ డిజైన్ తో దీనిని రెడి చేశారు. దీనివలన మొబైల్ హిట్ ప్రాబ్లెమ్ ఉండదు. ఇది కూడా ఒక బెస్ట్ ఫీచర్.
3.కెమెరాలు:
ఈ మొబైల్ లో మనకి బాగా నచ్చేవి కెమరాలు ఎందుకంటే సెకండ్-జెన్ క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కొత్త 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాను ఇది కలిగి ఉన్నది. ఈ 48ఎంపీ ఫోటోలలో 0 షట్టర్ లాగ్ యాక్సస్ అందిస్తుంది. వీటితో మనం 4K120 వీడియోలను కూడా తీసుకోవచ్చు.
4.బ్యాటరీ:
ఫ్రెండ్స్ మనం ఒక మొబైల్ ని కొనుకోవాలి అని అనుకున్నపుడు మొదట చెక్ చేసుకునేది బ్యాటరి. ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ 4685 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. గత మోడల్ కంటే ఇది కాస్త అప్‍గ్రేడ్‍గా ఉంది. అలాగే ఫాస్ట్ గా చార్జింగ్ అవుతుంది.
5.స్టోరేజ్
ఈ ఐఫోన్ 16 ప్రో మాక్స్ మనకి వివిధ రకాల స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అంటే 256GB, 512GB, 1TB లతో మనకి అందుబాటులో ఉంది. మన అవసరాన్ని బట్టి మనం ఈ స్టోరేజి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్తోరేజిని బట్టే వీటి కాస్ట్ కూడా మారితుంది.
6.ఆడియో అప్‌గ్రేడ్‌లు :
ఫ్రెండ్స్ ఈ ఐఫోన్ 16 ప్రో సిరీస్ వీడియో రికార్డింగ్ సమయంలో స్పేషియల్ ఆడియో క్యాప్చర్ వంటి కొత్త ఆడియో ఫీచర్‌లను తీసుకొచ్చింది. ఆడియో మిక్స్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను స్పీచ్ నుంచి సపరేట్ చేసే మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగిస్తుంది. “ఇన్-ఫ్రేమ్ మిక్స్” కెమెరాలోమన వాయిస్‌ని వేరు చేస్తుంది. రికార్డింగ్ స్టూడియో వంటి సౌండ్ ఎఫెక్ట్ కూడా అందిస్తుంది.
7.కలర్స్:
ఈ ఐఫోన్ 16 ప్రో మాక్స్ మనకి బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, డిజర్ట్ టైటానియం వంటి కలర్స్ తో మనకి అందుబాటులో ఉంది.
8.కనెక్టివిటీ:
ఫ్రెండ్స్ ఈ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 5Gతో వచ్చింది. అలాగే WIFI, బ్లూటూత్ తో కనెక్ట్ అవుతుంది.
9. ప్రైవసీ:
మనలో చాలా మంది ఇందులోని ప్రైవసీ నచ్చే ఈ ఐఫోన్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఉండే సేఫ్టీ ఏ మొబైల్ కూడా ఉండదు. ఇందులో పేస్ ఐడి, తంబ్ ఐడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఐఫోన్ ఎప్పటికప్పుడు సేక్యూరిటీ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది దీని ద్వారా మన ఫోన్ సురక్షితంగా ఉంటుంది.