శర్వానంద్ హీరోగా గతంలో విడుదలైన రణరంగం సినిమా తీవ్రంగా నిరాశపరిచిన విషయం అందరికీ తెలిసినదే! రణరంగం కంటే ముందే విడుదలైన పడి పడి లేచె మనసు కూడా ఫ్లాప్ అయిన విషయం తెలుసు కదా!! అయితే ప్రస్తుతం శర్వానంద్, సమంత జంటగా తమిళ మూల చిత్రమైన “96” తెలుగులో రీమేక్ చేసి దిల్ రాజు దర్శకత్వంలో జాను పేరుతో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
మరి ఈ కొత్త చిత్రం జాను గురించి వివరాలు తెలుసుకుందామా!
జాను చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. అయితే వాటికి పెద్దగా స్పందన రావడం లేదు. ఇది ఎలా తెలిసింది అంటే యూట్యూబ్లో ఈ టీజర్ పాటల యొక్క వ్యూస్ కౌంట్ ను గమనిస్తే ఈ సినిమా పై స్పందన అంత ఎక్కువగా లేదు అని తెలుస్తున్నది.
తమిళంలో విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించిన “96” స్లోగా సాగే సినిమా ఇది. అయితే ఈ చిత్రంలో వీరిద్దరు తమ నటనతో మంచి స్థాయికి తీసుకువెళ్లారు. అంతేకాక ఈ సినిమా కథకు తగ్గట్లుగా విజయ్ మరియు త్రిష వయసు కూడా చక్కగా సరిపోయింది. తమిళ్ “96 “నువ్వు బాగా ఆదరించారు.
కానీ మన తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా తేడాగా ఉంటుంది, ఎందుకంటే ఈ చిత్రంలో శర్వానంద్ వయసు తక్కువ కావడంతో టీజర్ పెద్దగా ప్రభావం చూపలేదని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా జాను చిత్రం టీమ్ కూడా సినిమా ప్రచారం పైన చాలా కేర్ లెస్ గా ఉండడం ఒక కారణం.
ఇక సినిమా ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం హైప్ రావడం లేదు! ముఖ్యంగా తెలుగులో రీమేక్ సినిమాలు తీయడం అనేది విజయానికి చాలా సులువైన దారి అని చాలామంది నమ్ముతుంటారు. అయితే కల్ట్ ఫీలింగ్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలను రీమేక్ చేయడం మాత్రం ఎప్పుడూ కష్టంతో కూడుకున్న పని.
ఇక శర్వానంద్ హీరో, హీరోయిన్లుగా జాను అనే ఒక లవ్ స్టోరీ తెరకెక్కుతుందని ఇప్పటికి చాలా మందికి తెలియదు.
అయితే ఇప్పటికీ సినిమా బజ్ ఏమాత్రం లేదని తెలుస్తోంది. కాబట్టి ఇకనైనా జాను చిత్రం టీమ్ ప్రచారం మొదలు పెట్టి సినిమా విజయం సాధించాలని కోరుకుందాం