Table of Contents
Jabardasth Anchor Anasuya Biography In Telugu 2021
Jabardasth Anchor Anasuya Biography 2021 : తెలుగు యాంకర్లు అంటే టక్కున గుర్తు వచ్చే పేర్లు సుమ, ఝాన్సీ ,ఉదయ భాను తర్వాత టాప్ లో దూసుకెళ్ళిన యాంకర్ అనసూయ. అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అయినా చక్కటి రూపము అందంతో ఇతరుల మతి పోగొడుతోంది.
కేవలం అనసూయ కోసమే షో చూసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. జబర్దస్త్ తో మంచి పాపులర్ అయింది. ఎంతమంది ఎన్ని పంచులు వేసినా స్పోర్టివ్ గా తీసుకుంటూ ఆమె ముందుకు వెళుతూనే ఉంది. మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్లీ జబర్దస్త్కు ఎంటర్ అయింది.
హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన ఈ అందమైన అనసూయ నార్త్ ఇండియన్ ను పెళ్లి చేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకోవడానికి పెద్ద యుద్ధమే చేసింది.
కేవలం యాంకర్గానే కాకుండా సినీ నటి గా మారి సోగ్గాడే చిన్నినాయసినిమాలో మరదలుగా, రంగస్థలం సినిమా లో రంగమ్మ అత్తగా, యాత్ర సినిమాలో గౌరు చరిత గా మంచి పేరు తెచ్చుకుంది. మరి ఈ రంగమ్మత్త పుట్టుపూర్వోత్తరాలు చూద్దాం.
Anasuya bharadwaj family background
అనసూయ నాన్న సుదర్శన్ రావు, అమ్మ అనురాధ వీరికి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. వీరిది నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం. పెద్ద భూస్వాముల కుటుంబం. వీళ్లు ఇంటికి నూట ఒక్క వాకిళ్ళు ఉండేవట!
నాన్నగారు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అమ్మ అనురాధ ది ఘట్కేసర్, అయితే అమ్మ స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ప్రాంతం. వీరి బంధువులు మొత్తం బీదర్ మరియు రాయచూరు ప్రాంతంలోనే ఉండేవారు.
1985 మే 15వ తేదీన అనసూయ వీరిద్దరికీ జన్మించింది. తన నానమ్మ అయిన అనసూయమ్మ గారి పేరే తనకు అనసూయ గా పేరు పెట్టారు.
ఈమెకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు అంబికా ,వైష్ణవి. చిన్న చెల్లెలు వైష్ణవి అప్పుడప్పుడు అనసూయతో కనిపిస్తూ ఉంటుంది. వైష్ణవి ఆగాన్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నది.
Anasuya educational qualifications
ఇక అనసూయ విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది.తను విద్యార్థిగా ఉన్నప్పుడే తండ్రి సుదర్శన్రావు ఆర్మీ లోకి పంపాలని కోరుతూ NCC లో కి చేర్చడం జరిగింది.
తండ్రి కోరిక మేరకు అనసూయ కూడా ఎన్సిసి పెరేడ్ కమాండర్ గా రెండుసార్లు వెళ్ళింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2008వ సంవత్సరంలో భద్రుక కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది.
అనసూయ ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఐడిబిఐ బ్యాంకు లో కొద్ది రోజుల పాటు పని చేసింది. తర్వాత ఫిక్స్ లాయిడ్అనే విజువల్ ఎఫెక్ట్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసింది.
పేపర్లో సాక్షిలో న్యూస్ రీడర్ జాబ్స్ ఉన్నాయ్ అని తెలుసు వెళ్లి సాక్షి ఛానల్ లో వ్యాఖ్యాతగా సెలెక్ట్ అయింది. సాక్షి ఛానల్ లో రామ్ గోపాల్ వర్మ తో కలిసి ఒక టాక్ షో చేసింది.
ఈ టాక్ షో చాలా పాపులారిటీ తెచ్చింది. సాక్షిలో చేస్తూ ఉన్నప్పుడే అందంగా ఉంటావు మోడలింగ్లో ప్రయత్నించమని చాలామంది చెబుతుంటే మోడల్ గా అడుగు మోపింది. అంతేకాక ఇతర చానల్లో ఫ్రీలాన్సర్ గా మా టీవీ మ్యూజిక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పని చేసింది.
Anasuya bharadwaj marriage
అనసూయ లవ్ స్టోరీ తను ఇంటర్ సెకండియర్ లోనే స్టార్ట్ అయింది. తను ఎన్సిసి క్యాంపు కి వెళ్ళినప్పుడు అక్కడ Susank bharadwaj పరిచయమయ్యాడు.
వారిది బీహార్ అయితే చాలా కాలం క్రితం హైదరాబాద్ కు వచ్చేశారు. ఆరు నెలల ప్రేమ తర్వాత అనసూయ శుశాంక్ కు ఓకే చెప్పింది. 2009వ సంవత్సరంలో నాన్న తనకు సంబంధాలు చూస్తున్నాడని తండ్రికి నిజం చెప్పేసింది.
అయితే వాళ్ల నాన్న చాలా స్ట్రిక్ట్ ఒప్పుకోలేదు కానీ తను బతిమాలి నాన్నను ఒప్పించి చివరికి 2010లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం శుశాంక్ ఓ ఫైనాన్సియర్ మరియు ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పెద్దబ్బాయి సౌర్య భరద్వాజ్ చిన్నబ్బాయి అయాన్స్ భరద్వాజ్.
Anasuya jabardasth comedy show
2013లో ఈటీవీ లో నాగబాబు రోజా న్యాయనిర్ణేతలు గా శ్యాంప్రసాద్రెడ్డి నిర్మాణంలో jabardasth comedy show telugu lo స్టార్ట్ అయింది. ఈ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకు వచ్చింది. 13 ఎపిసోడ్ల తర్వాత అనసూయ conceive కావడంతో మానేసింది.
అప్పుడు రష్మీ జబర్దస్త్ లో కి ఎంటర్ అయింది. తర్వాత అనసూయ రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం దూసుకుపోతోంది.ప్రస్తుతం జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ అని రెండు రోజుల ప్రసారంగా ప్రదర్శించబడుతుంది.
ఇది కూడా చదవండి :- Sudigali Sudheer biography
ఎంతోమంది పెద్ద కమెడియన్లు వచ్చి వెళుతున్నా అప్పటినుంచి అనసూయ నిరాటంకంగా చేస్తూనే ఉంది. జబర్దస్త్ వల్లే ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు వారు ఎక్కడున్నా గుర్తుపట్టేలా మారిపోయింది.
జబర్దస్త్ తో పాటు ఎన్నో షోస్ చేసింది. వాటిలో 2013లో జీతెలుగు లో బిందాస్, స్టార్ మా లో మోడ్రన్ మహాలక్ష్మి 2014లో ఈటీవీలో తడాఖా షో తర్వాత జీ తెలుగులో వన్ షో, 2016లో టీవీ9 లో ఏ డేట్ విత్ అనసూయ షో, 2017లో స్టార్ మా పరివార్ అవార్డ్స్, జెమినీలో జాక్ పాట్ అనే షోకు హోస్ట్ గాచేసింది.
2018లో రంగస్థలం అనేడ్యాన్స్ షో కూడా చేసింది. ఈ విధంగా సమయం కుదిరినప్పుడల్లా వేరే షోలు చేస్తూనే ఉంది. ఇవే కాక ఆమె జీ తెలుగులో ఒకరికొకరు అవార్డ్స్ షో చేసింది. దుబాయ్ లో అప్సర అవార్డ్స్ ఫంక్షన్ లో డాన్స్, గామా అవార్డులలో ప్రదర్శనలు చేసింది. దేవిశ్రీప్రసాద్ అమెరికా లో నిర్వహించిన కచేరీ షోలో పాల్గొంది.
Anasuya cinema Entry & Movies List
అనసూయ చాలా సినిమాలు లో నటిస్తూనే ఉంది. 2003 లో అనసూయ నాగా సినిమాలో గెస్ట్ ఓరియెంటెడ్ పాత్ర చేసింది. 2016లో నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమా లో మరదలు గా నటించింది.
తర్వాత క్షణం సినిమాలో నటించింది,2017లో విన్నర్ సినిమాలో ఒక సాంగ్ చేసింది. మోహన్ బాబు తీసిన గాయత్రి సినిమాలో కూడా కనిపించింది.
తర్వాత 2018 సంవత్సరంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా సుకుమార్ దర్శకత్వంలో నటించింది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ గా వచ్చిన యాత్ర సినిమాలో ఎమ్మెల్యే గౌరు చరిత గా కూడా నటించింది.
చిన్న పాత్రలైనా తనకు పేరు వచ్చేలా ఉంటే తప్పకుండా చేస్తానని అనసూయ పేర్కొంటుంది.
Anasuya controversy
అనసూయ ఇంత పేరు తెచ్చుకున్నా కొన్ని వివాదాలు ఎదుర్కొంది . ముఖ్యంగా తన డ్రెస్సింగ్ గురించి ఎన్నో నెగెటివ్ కామెంట్లను వినాల్సి వచ్చింది. కానీ జబర్దస్త్ కి ముందు అంత మంచి పేరు వచ్చింది కనుక మోడ్రన్ గా ఉంటే తప్పేంటని వారికి సమాధానం ఇచ్చింది.
తనకు ఎప్పటికీ ఫిట్గా మోడ్రన్ డ్రస్సులు వేసుకోవడం అంటే ఇష్టమని చెప్పేసింది. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ మీద కామెంట్ చేసింది.ఆ సినిమాలో అల్లు అర్జున్ ముఖం గురించి కామెంట్ చేసి విమర్శలకు గురి అయింది .
ఆ తర్వాత దానికి క్లారిటీ ఇచ్చింది.తనకు బన్నీ అంటే చాలా ఇష్టమని గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ఫేస్ ఎలా ఉన్నా తర్వాత తర్వాత సినిమా సినిమాకి చాలా అందంగా మారాడని పేర్కొంది. కానీ విమర్శకులు అనసూయను ఆడేసుకున్నారు.
ఈ మధ్యనే ఓ బాబు సెల్ఫీ తీసుకుంటే ఆ ఫోన్ కింద పడేసింది. అప్పుడు కూడా ఫోటో ఇవ్వడం కూడా కష్టమే అని విమర్శకులు చెవులు విరి చేశారు.
ప్రస్తుతం సుమ తర్వాత ఆ స్థాయి యాంకర్ అని అనసూయ పేరు తెచ్చుకుంది. తన మొదటి బాబు పుట్టిన నెలలోనే చోట ఛాంపియన్ షో చేసి తన డెడికేషన్ నిరూపించుకుంది. తనకు చిన్నప్పటి నుంచి ఎయిర్హోస్టెస్ అవ్వాలని ఉండేదట కానీ, యాంకరింగ్ లో ఉన్నత స్థానాన్ని సంపాదించింది.
కానీ ఎన్ని షోలు చేస్తున్నా పిల్లలు చిన్న వారైనప్పటికీ కుటుంబం యొక్క మద్దతుతో ఇవన్నీ చేస్తున్నానని చెబుతుంది.
లేకపోతే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాను అని అంటుంది. చిన్న పాత్ర చేసినా అందరూ ప్రశంసించే విధంగా నటిస్తున్నది. కేవలం అందమే గాక యాంకరింగ్ లో సమయానికి తగ్గట్టుగా మాట్లాడటం, పాత్రలో లీనమై నటించడం చేస్తోంది.
Jabardasth anchor anasuya salary
ఒక్కో సినిమాకు, నలభై నుండి యాభై లక్షల దాకా తీసుకుంటుంది. ఒక్కో జబర్దస్త్ షో కు లక్ష దాకా తీసుకుంటుంది.
ఈ విధంగా అనసూయ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని బాగా వెనక్కి వేసుకుంటున్నది. ఈ భామ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నా మరిన్ని షోలు చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.
ఇవి కూడా తెలుసుకోండి :-