Rashmi Gautam రియల్ స్టొరీ చూస్తే నిజంగా ఇంత కష్టపడిందా అంటారు

0
Jabardast Anchor Rashmi Gautam Biography

Jabardasth Anchor Rashmi Gautam Biography In Telugu

Jabardasth Anchor Rashmi Gautam Biography: ఈమె ఒక ఆధునిక యువతి. నిజజీవితంలో నటించలేని నటి. కష్టాలు మనుషులకు కాక పోతే మానులకు వస్తాయా అని చెప్పే ధైర్యవంతురాలు. సినీ రంగంలో ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుని బ్రతకాలనే అమ్మాయి rashmi gautam గురించి, ఆమె జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం.

పుట్టుక:- rashmi gautam born and brought up

7 ఏప్రిల్  1988 లో జన్మించినది రష్మీ గౌతమ్. అంటే ఇప్పటికి rashmi gautam age 31 సంవత్సరాలు. ఈమె అమ్మది ఒరిస్సాలోని బరంపురం గ్రామం. నాన్నది మధ్యప్రదేశ్. ఈమె చదువు అయిదవ తరగతి వరకు బరంపురం లోనే సాగింది.

ట్విస్ట్: రష్మికి పదకొండేళ్ల వయసులో అమ్మ నాన్న విడిపోవడంతో అమ్మ రష్మీ ని తీసుకుని వైజాగ్ లో ఉంటున్న ఆమె తాతగారింటికి అంటే అమ్మమ్మగారింటికి వచ్చేశారు. వైజాగ్ లో ఉన్న సీబీఎస్ఈ స్కూల్ లో ఆరో తరగతి నుంచి అక్కడే చదువుకున్నారు అప్పటినుండి ఆమెకు ఇంగ్లీష్ మీడియంలోనే చదవడం వల్ల తెలుగు రాకపోవడంతో తాతయ్య అమ్మమ్మ పిన్ని వారి పిల్లలతో తెలుగులో చిన్న చిన్నగా మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నది.

రేష్మి స్కూల్ నుండి నేరుగా ఇంటికి వచ్చేస్తున్న డంతో ఆమెకు బయట స్నేహితులెవరూ ఏర్పడలేదు. అందుకే ఆమె తెలుగు మాట్లాడితే ఇప్పటికీ దోషాలు బయటపడతాయి. ఇక ఇంట్లో ఏ చిన్న కార్యం బర్తడే లు లాంటివి జరిగితే వాటిని రష్మీ నిర్వహించేది.

హాబీలు:- rashmi gautam hobby

లక్ష్మీ చిన్నప్పట్నుంచి స్పోర్ట్స్ లో చురుగ్గా ఉండేది. స్విమ్మింగ్ చేసేది rashmi మొదటి నుంచి కూడా మోడరన్ గా ఉండేది. ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. అంతేగాక తాత గారు చాలా అల్లారుముద్దుగా చూసుకునేవారు. రష్మీ 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి కి కిస్ పెట్టింది. అయితే కావాలని పెట్టలేదు కానీ తన ఫ్రెండ్స్ తో పందెం కాసి పెట్టింది! ఈమెకు శ్రీదేవి అంటే ఇష్టం ఉండటం వల్ల ప్రతి రోజు అద్దం ముందు శ్రీదేవిలాగానే అనుకరణ చేసేవారు
ఫుడ్ ఇన్ న్యూట్రిషన్ లో డిగ్రీ పూర్తి చేశారు.

Rashmi Gautam Movies List In Telugu

rashmi gautam movies
rashmi gautam movies list in telugu

కొన్ని cultural program చేసేటప్పుడు అమ్మాయి అందంగా ఉందని డైరెక్టర్ శివ పిలిచి అడిగాడు. సినిమాలో నటించడానికి అవకాశం ఇస్తాము అని అడిగాడు. ఆమె వెంటనే, సార్ నేను చేస్తాను అని చెప్పింది. అప్పటికి వాళ్ళు సవ్వడి అనే సినిమా చేస్తున్నారు ఆ సినిమాకి తీసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో వారందరికీ తెలిపింది
అందరూ ఈమెకే ఇష్టాన్ని వదిలేశారు. ఆ సినిమా కోసం రష్మీ హైదరాబాద్ వచ్చింది కానీ ఆ సినిమా విడుదల అవ్వలేదు.

అయితే తన ఆశ నెరవేరక పోవడంతో ఇంటికి వెళ్ళలేక ఇక్కడే ఉండి సినిమా చాన్సుల కోసం అన్వేషించింది. చాలా ప్రయత్నాల తర్వాత ఎస్ వి ప్రసాద్ ఉదయ్ కిరణ్ హీరోగా హోలీ సినిమాలో తనకు సునీల్ కు జోడిగా నటించే అవకాశం వచ్చింది. ఉదయ్ కిరణ్ సినిమా కాబట్టి విడుదల అయిన తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే ఈ సినిమా 2002 సంవత్సరంలో విడుదలైనా ఈమె కు ఎలాంటి అవకాశాలు రాలేదు

2004 వ సంవత్సరంలో ఆది కేరాఫ్ AVL కాలేజీ చిత్రంలో నటించారు. మరలా రెండు సంవత్సరాల తర్వాత థాంక్స్ అనే మూవీలో నటించింది. ఈ సమయంలోనే హాస్టల్ ఫీజు కట్టలేక హాస్టల్ లో ఫ్రెండ్స్ తో రూమ్ ని షేర్ చేసుకున్నారు. దానికి కూడా డబ్బు లేక చాలా శ్రమపడ్డారు. ఇందుకోసం rashmi పార్ట్టైం జాబ్ కూడా చేసింది. ఈ సమయంలోనే యువ అనే సీరియల్లో కూడా చేసింది కానీ అది ఆమె దశను మార్చలేక పోయినది. ఒకసారి రూమ్ కి లేట్ నైట్ గా వచ్చినప్పుడు రూమ్ తలుపు కూడా తీసే వారు కాదు.

అప్పుడు ఉదయం వరకూ బయటనే ఉండేవారట. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా సినిమా ఛాన్స్ కలిగే అంతవరకూ ఇంటికి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నది. ఇలా చాలా కష్టాల్లో కూర్చున్నారు. చాలా కాలం తర్వాత కరెంట్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇలా సినిమా అవకాశాల కోసం మొండిగా తిరుగుతూ వెల్ డన్ అనే హిందీ సినిమాలో ఒక చిన్న రోల్ చేసింది. తర్వాత గణేష్ బిందాస్ సినిమాలు 2019 లో రిలీజ్ అయినా ఆమెకు ఏమాత్రం పేరు కానీ అవకాశాలు కానీ తెచ్చి పెట్టలేదు.

2010లో చలాకి, ప్రస్థానం సినిమాల్లో చేసింది. తర్వాత తమిళంలో కూడా ఓ సినిమాలో నటించింది. ఇన్ని సినిమాలు చేసినా రూమ్ రెంట్ కు తన ఖర్చులకు డబ్బులు సరిపోయేవి కావట. సరిగ్గా ఈ సమయంలోనే అంతం అనే ఓ షార్ట్ ఫిలిం లో నటించింది 2012లో హిందీలో లాగిన్ ,కన్నడలో గురు, తమిళంలో మా పిళ్లై వినాయగర్, ప్రియదర్శన్ ప్రియా లో చేసింది.

Rashmi Gautam Jabardasth Entry 

rashmi gautam jabardast

ఇలా ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు టర్నింగ్ పాయింట్ మాత్రం రాలేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఈమె ఇబ్బంది పడుతున్నట్లు గా తాతయ్యకు తెలిసింది. ఈమెను వైజాగ్ వచ్చి చేయమన్నాడు అప్పుడు రష్మీ కూడా వైజాగ్ వెళ్లి పోతే బాగుంటుందని అనుకుంది. ఆమె వెళ్ళి పోయారు , అప్పుడే ఈటీవీలో మల్లెమాల వారి వీర ప్రోగ్రాం కోసం ఒక కామెడీ షో చేయాలని అనుకున్నారు. అప్పుడే జబర్దస్త్ అనే కామెడీ షో ని మొదలు పెట్టాలని మల్లెమాల వాళ్ళు నిర్ణయించుకున్నారు.

ఈ కామెడీ జబర్దస్త్ షో కోసం కొంతమంది రష్మీ బాగుంటుందని మరికొంతమంది అనసూయ బాగుంటుందని అనుకున్నారు. అయితే అప్పటికి రష్మి పోస్ట్ గానీ యాంకర్గా గానీ ఎక్కడా చేసి ఉండలేదు. అయితే అనసూయ మాత్రం అక్కడక్కడ ఆడియో ఫంక్షన్లలో చేసింది. అందుకే ఆ షోకి అనసూయను తీసుకోవడం జరిగింది. అయితే అనసూయ తో 13 ఎపిసోడ్ లు తీసిన తర్వాత ప్రొడక్షన్ వారికి చిన్న చిన్న గొడవలు వస్తుండడంతో అనసూయ నా వల్లే ఈ షో కి రేటింగ్ వస్తోంది అనడంతో ఆమెను తొలగించేశారు.

ఇది కూడా చదవండి : Jabardasth Anchor Anasuya Biography- తెలుగు లో

అప్పుడే ఈ షోకి రష్మీ ని తీసుకోవాలని నిర్ణయించారు. రష్మీ అప్పటికి వైజాగ్ లో ఉన్నారు వీళ్లు వెంటనే ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆమె చేస్తానని హైదరాబాద్కు వచ్చింది. 14 వ ఎపిసోడ్ నుంచి జబర్దస్త్ చేసింది. ఈ షో బాగా హిట్ కావడంతో ఫ్రైడే రోజు కూడా ఈ షో చేయాలని ఎగస్ట్రా జబర్దస్త్ పేరుతో రష్మీ తోనే ఈ షో చేశారు. ఆ తర్వాత న్యాయనిర్ణేతలు మార్పు లేకపోవడం వలన రష్మీ తో పాటు అనసూయను కూడా తీసుకున్నారు.

రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో కొనసాగింది. ఈ సమయంలో sudigali sudheer టీం రష్మీ పై పంచ్ డైలాగులు వేస్తుండడంతో వీరిద్దరికీ లవ్ ఉందనే ప్రచారం జరిగింది. రష్మీ వీటిని ఖండించక పోవడంతో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత sudheer , rashmi కలిసి కరెంట్ సినిమాలో చేశారు. అప్పటికే రష్మీ బాగా పాపులర్ కావడంతో 2015లో తమిళంలో దౌలత్, తెలుగులో బస్తీ వ్యూహం ,చారుశీల వంటి సినిమాలు లో అవకాశాలు వచ్చాయి.

rashmi gautam jabardast anchor

ఇవన్నీ reshmi క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నే చేసింది. అప్పుడే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు reshmi హీరోయిన్గా పెడితే బాగుంటుందని రష్మీ ని హీరోయిన్ గా పెట్టి గుంటూరు టాకీస్ తీశాడు. ఈ సినిమాలో మార్కెట్ మొత్తం reshmi gautam hot పాత్ర ప్రధానంగా పెట్టి చేశారు. ఈ సినిమాకు వచ్చిన మార్కెట్ పరంగా రష్మీ తమిళంలో కండెల సినిమా నిర్మాతలు తెలుగులో డబ్ చేశారు. అలాగే అంతం షార్ట్ ఫిలిం లోని రష్మీ ఫోటోలను వాడుకొని ఫ్యూచర్ సినిమా గా మార్చారు.

అయితే ఈ విషయం reshmi కి ఎవరూ చెప్పలేదు ఈ సినిమా బాగా డబ్బులు కలక్షన్ చేసింది. తర్వాత రాణి గారి బంగ్లా, తను వచ్చెనంట సినిమాలతో హీరోయిన్ గా చేసింది. అలాగే మల్లెమాల వారితో ఢీ మరియు జోడి షో లో sudheer, rashmi లను టీమ్ లీడర్స్ గా తీసుకున్నారు. అప్పుడు వీరి జోడి సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే మల్లెమాల వారి ఉగాది ఈవెంట్ లో reshmi కి sudigali sudheer కి కమెడియన్లు అందరూ పెళ్లి చేయడంతో వీరి ఇద్దరి మధ్య బంధం బలపడింది అనుకున్నారు.

కానీ వీరిద్దరూ షూటింగ్లో తప్ప బయట ఎక్కడా మాట్లాడుకోలేదు. అసలు rashmi సినిమా వాళ్లను పెళ్లి చేసుకోను అంటుంది. తర్వాత ఆదితో నెక్స్ట్ నువ్వే సినిమా లో సెకండ్ హీరోయిన్ గా చేశారు. ఇప్పుడు తను బాగా సక్సెస్ అయ్యాక వారి కుటుంబం మొత్తాన్ని చాలా బాగా కేర్ గా చూసుకుంటున్నది. రేష్మి చాలా సున్నిత మనస్కులు నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే ధైర్యవంతురాలు. reshmi ఎన్నో విజయాలు సాధించి పెద్ద హీరోయిన్ కావాలని మనం కూడా కోరుకుందాం.