jagananna gorumudda :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం గురించి ఈరోజు అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో నేరుగా 40 లక్షల మంది మహిళలకు మేలు జరిగిందని చెప్పారు. విద్యార్థులకు సరైన విద్యను అందించడమే మనం వాళ్ళకి ఇచ్చే గొప్ప ఆస్తి అని నిర్వచించారు.
అదే సమయంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం అందించే భోజన వసతి గురించి కూడా మాట్లాడారు. అందరికీ రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని ఖచ్చితంగా అందిస్తామని మాట ఇచ్చారు. విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త మెనూ ని ఈరోజు నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఒకే ఈ రకమైన ఆహారాన్ని తిని విసుగు చెందకుండా మెనూలో కొత్త కొత్త వంటలను చేర్చారు.
mid day meal new menu in ap :
సోమవారం: బియ్యం, గుడ్డు కూర, చిక్‌పా (వేరుశెనగ, కాయధాన్యం, బెల్లము కలిపిన పాయసం)
మంగళవారం: పులిహరా, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం: కూరగాయల బియ్యం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్‌పా
గురువారం: కిచిడి, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు
శుక్రవారం: బియ్యం, పిల్లితీగలు, ఉడికించిన గుడ్డు, చిక్‌పా
శనివారం: బియ్యం, సాంబార్ మరియు స్వీట్ పొంగల్
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అందించే భోజన వసతి కార్యక్రమానికి, ‘ జగనన్న గోరుముద్ద ‘ గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. మరి ఇప్పటినుండి అయినా గవర్నమెంట్ స్కూల్స్ లో అలాగే కాలేజీలో అందించే మధ్యాహ్న భోజనం అందరికీ రుచిస్తుంది అని ఆశిద్దాం. ఎంతమేరకు ఈ జగనన్న గోరుముద్ద పథకం సక్సెస్ అవుతుందో చూద్దాం.