మనసున్న రాజకుమారి వింత ప్రేమ ..!

0
japan princess mako married to common man

ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎలా పుడుతుందో ఏమీ చెప్పలేము. ఇందుకు ఉదాహరణగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న విషయం చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రేమ వివాహాలు అంటే ప్రేమించిన వాడి కోసం ఆస్తులు, అంతస్తులు మరెన్నో త్యాగాలు చేసిన వారిని మనం చూస్తూ ఉంటాం. సరిగ్గా ఇలాంటి కోవకే చెందిన ఒక ఖరీదైన ప్రేమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖరీదైన ప్రేమ అని ఎందుకన్నానంటే ఇది సామాన్యమైన ప్రేమ కాదు, సాక్షాత్తు ఒక దేశ యువరాణి ప్రేమ కథ. ఆమె జపాన్ రాకుమారి మకో. ఈమె తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అదేంటంటే జపాన్ సంప్రదాయం ప్రకారం అతి సామాన్యుడిని పెళ్లాడేందుకు ఈ రాకుమారి సిద్ధమయ్యారు.

అతని పేరు కోమురోను. ఇతను అమెరికా లో న్యాయశాస్త్రాన్ని చదువుతున్నాడు. రాకుమారి మాకో 2013 డిసెంబర్లో జరిగిన డిన్నర్ సమయంలో తన ప్రియుడు కోమురోతో వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఈ లవ్ వ్యవహారం చాలా రోజులు సీక్రెట్ గా మెయింటైన్ చేశారు.

జపాన్ సంప్రదాయం ప్రకారం ఈ రాకుమారి వివాహానికి రాజకుటుంబం నుండి భారీగా డబ్బులు ఇవ్వడం ఆనవాయితీ అట. దాదాపు 1.2 మిలియన్ అమెరికా డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 8.7 కోట్లు రాకుమారికి ఇవ్వాలని అనుకున్నారట. అయితే రాకుమారి ఈ మొత్తాన్ని తీసుకోవడానికి ఇష్టంగా లేదట.

మరి వీరిరువురి వివాహం 2020లో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా ఇంకొన్ని రోజులు వాయిదా పడింది. మరి ఇంత కాస్ట్లి ప్రేమని మనం కూడా మనసారా దీవిద్దాం.

ఇది మీకు తెలుసా :- బల్లి శరీరంపై పడితే ఏమవుతుంది ?? బలిశాస్త్రం ఏమి చెబుతోంది ??