Jnanabhumi ap gov in: వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా అర్హులకు ప్రతి సంవత్సరం కొంత డబ్బును అందిస్తున్నారు. ఈ పథకానికి అర్హత పొందే క్రమంలో స్కాలర్ షిప్ ను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి.
మరి వీటిలో ముఖ్యంగా తల్లి బ్యాంకు ఖాతా నెంబరు తప్పుగా నమోదు చేయబడిన వారికి స్కాలర్షిప్ అమౌంటు పడడం లేదు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించనుంది.ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విష్ణు మోహన్ రెడ్డి గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైనటువంటి విద్యార్థులు వెంటనే వారి గ్రామాల్లోని గ్రామా లేదా వార్డు సచివాలయంలో తల్లి బ్యాంకు ఖాతాల వివరాలను మూడు రోజుల లోగో సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించారు.
అలాగే జ్ఞాన భూమి పోర్టల్ లో సెట్ అలాట్మెంట్ ఆర్డర్ అప్లోడ్ చేయండి విద్యార్థులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. లేకపోతే జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకాలు వీరికి వర్తించవని స్పష్టం చేశారు.
Official Link For Jnanabhumi website : Jnanabhumi.ap.gov.in