కలోంజీ విత్తనాలు వాటి ఉపయోగాలు-సైడ్ ఎఫెక్ట్స్ ఇవే !

0
kalonji seeds in telugu

Kalonji Seeds In Telugu||కలోంజీ విత్తనాలు అంటే ఏమిటి?

 కలోంజీ ని మంగారెల్లా లేదా ఉల్లిపాయ విత్తనాలు అని కూడా అంటారు. కలోంజీ విత్తనాలు మన దేశంలోని  అన్నీ ప్రాంతాలలో  కనిపిస్తుంది. ఈ  నల్ల కలోంజీ గింజలను ఆంగ్లంలో నిగెల్లా సాటివా Nigella Sativa అని అంటారు. కలోంజీ అనేక వందల వ్వ్యాధులను నయం చేయడంలో చాలా ఉపయోగ పడుతుంది.

కలోంజీ విత్తనాలు ఎలా నిల్వ ఉంచాలి?

  • కలోంజీ విత్తనాలు ఇవి సాగుకు ఇసుకు నేలలకు అనుకూలముగా ఉంటుంది

  • ఇది ఆరోగ్యానికి మరియు అందముకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.

  • సేంద్రియ  పద్దతిలో  విత్తనాలు వాడాల్సి ఉంటుంది.

  • నేలలో PH విలువ 7 నుంచి మధ్య ఉండాలి.

  • కలోంజీ మొక్కలు బాగా పెరగడానికి ఉష్ణమండల వాతావరణం అనుకూలం.

  • కలోంజీ మొక్కలు 20 నుంచి 25 రోజులలో కలుపు తీయడం ప్రారంభిస్తారు.

How To Eat Kalonji Seeds In Telugu|కలోంజీ విత్తనాలు ఎలా తినాలి?

  • కలోంజి గింజలను మీరు నేరుగా తినవచ్చు. లేదా ఇది కాకుండా మీరు ఒక చిన్న చెంచా కలోంజి గింజలను తీసుకొని అందులో కొంత తేనెతో కలిపి తినవచ్చు.
  • లేదా ఈ కలోంజి గింజలను నీటిలో ఉడికించి దానిని ఫిల్టర్ చేసి ఆ నీటిని తాగవచ్చు.ఈ విధంగా కలోంజి ని ఉపయోగించవచ్చు.
  • ఇదే కాకుండా కలోంజి ని పాలలో ఉడికించి మరియు ఆ పాలు చల్లార్చిన తర్వాత జల్లెడపట్టి తాగండి.
  • ఈ కలోంజి గింజలను మీరు మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి మరియు వాటర్ లేదా పాలలో లో కలిపితాగవచ్చు.
  • మోడ్రన్ పద్ధతిలో అయితే ఈ కాలేజీ గింజలను బ్రెడ్, జున్ను మరియు పేస్ట్రీలపై చల్లుకోని దీనిని తినవచ్చు.
  • కలోంజితో పాటు మెంతుల గింజలను సమానంగా కలిపి రోజు రెండు చెంచాలు వాటర్ లో వేసి అందులో ఒక టి స్పూన్ తేనె మరియు కొంచం లెమన్ ని కలిపి వాటిని బాగా మరగనివ్వాలి తర్వాత ఆ నీటిని జల్లెడ పట్టి ఉదయం, సాయంత్రం పడిగడపున త్రాగలి.

కలోంజీ విత్తనాలు ఎంత మోతాదులో తినాలి? | Kalonji Seeds Dosage In Telugu

  • మెటబాలిక్ సిండ్రోమ్‌లో 100 mg N అంటే వీటినే కలోంజి విత్తనాలతో తయారు చేయబడిన  ఈ మెడిసిన్ ను  5 mL  రూపములో  మరియు 1.5 నుండి 3 g పౌడర్ రోజువారీ మోతాదులను 3 నెలల వరకు వాడతారు.
  • ఇది రోజు 1/4 టీ స్పూన్ కలోంజి పౌడర్ ను నీటిలో కలుపుకొని తాగవచ్చు.
  • అలాగే పెద్ద వారికి 1/2 టీ స్పూన్ కలోంజి పౌడర్ ను వేసుకొని తాగవచ్చు.

కలోంజీ విత్తనాలు వాటి ఉపయోగాలు | Kalonji Seeds Uses In Telugu

  • ఒక వ్యక్తిలో జుట్టు పెరుగుదలను పెంచడానికి కలోంజి గింజలు గణనీయంగా ఉపయోగపడతాయి.
  • మీరు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసుకునేందుకు మరియు మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరచుకునేందుకు కలోంజి సీడ్ పేస్టుని ఉపయోగించాలి.
  •  బ్లాక్ సీడ్ ఆయిల్ లేదా కలోంజి ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ సీడ్ ను ఉదయం పరకడుపున, రాత్రి నిద్రించే ముందు వాడాల్సి ఉంటుంది. 5-6 చుక్కల బ్లాక్ సీడ్ ఆయిల్ ను గోరువెచ్చని నీటిలో లేదా బ్లాక్ టీతో కలుపుకుని సేవించాలి. రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఎక్కువ ఫలితాలుంటాయి.
  • మరణం తప్ప అన్ని వ్యాధుల్ని ఈ ఆయిల్ జయిస్తుందనే మాట కూడా ప్రాచుర్యంలో ఉంది.  క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, ఒబెసిటీ, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్, నిమోనియా, చర్మ వ్యాధుల్ని తగ్గించే లక్షణాలున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చెబుతోంది.
  • మూడు నుండి నాలుగు చెంచాల కలోంజి గింజలనుతీసుకుని వాటిని గంటసేపు నీటిలో ఉంచి, అ తర్వాత ఈ పేస్టు ను తలకు పట్టించుకోని అర్థ గంట తర్వాత స్నానం చేయాలి.
  • కలోంజిని ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగకరమైన మూలికగా భావిస్తారు.
  • ఇది దగ్గు నుండి డయాబెటిస్ వరకు నివారణలో చాలా ప్రయోజకరంగా ఉంటుంది.
  • ఇందులో లభించే కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం మరియు జింక్ వంటి అనేక పోషకాలు కలిగి ఉంది.
  • జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
  • డయాబెటిస్‌ను తగ్గిస్తుంది.
  • గుండె ఆరోగ్యానికి మంచిది.
  • మంటను, నొప్పులను తగ్గిస్తుంది.
  • పంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
  • ఉబ్బసం లేదా ఆస్తమా నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
  • బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
  • మూత్రపిండాలను రక్షిస్తుంది.
  • మొటిమలను తగ్గించడం.
  • కంటి చూపును పెంచుతుంది.
  • దంతాల బలహీనత తగ్గడం.

కలోంజీ విత్తనాలు వాటి దుష్ప్రభావాలు | Kalonji Seeds Side Effects In Telugu

  •   ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఇది రక్తంలో చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపిస్తుంది.
  •  ఇది ఎక్కువ రక్తపోటు వచ్చే ప్రమాదము ఉంది. కావున దీనిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.
  •  పాలిచ్చే తల్లులకు ఇది మంచిది కాదు కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
  •  కలోంజీ ఎక్కువగా తీసుకుంటే ఆపరేషన్ ల సమయంలో మరియు ఆపరేషన్ ల తరువాత రక్తం గడ్డ కట్టే ప్రక్రియను దెబ్బ తీస్తుంది. కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. మరియు అలాంటి సందర్భాలు వస్తే పూర్తిగా మానేయాలి.
  • గర్భిణీ స్త్రీలు కలోంజీ వినియోగానికి దూరంగా ఉండాలని నిపుణుల అభిప్రాయం, ఎందుకంటే దీని వాడకం  ఎంతవరకు సురక్షితం అనేది  ఇప్పటివరకు ఆధారాలు లేవు. అందువల్ల, వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని తీసుకోండి.

ఇవే కాక ఇంకా చదవండి.