కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ ఇన్ తెలుగు | Karthika Deepam Serial Today Episode In Telugu
కార్తిక దీపం 1352 ఎపిసోడ్ అంటే 14 May, 2022, శనివారం రోజున ఎం జరిగిందో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రోమో: హిమని సౌందర్య కొడుతుంది. ఎంగేజ్మెంట్ ఎందుకు ఆపేసావ్ అని అడుగుతుంది. హిమ నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఇంకోవైపు నిరుపం ఫుల్ గ తాగేసి రోడ్ మీద కార్ లో ఉంటాడు. అక్కడికి జ్వాల వస్తుంది. తగిన మత్తులో నువ్వంటే నాకిష్టం ఐ లవ్ యు అని చెప్తాడు.
కార్తీక దీపం టుడే ఎపిసోడ్: గుడిలో ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది. నిరుపం హిమతో ఈ లోకాన్నే జయించినంత ఆనందంగా ఉంది అని చెప్తాడు. నువ్వెందుకు అంత డల్ గ ఉన్నావ్ అని హిమ తొ అడుగుతాడు. అప్పుడు హిమ ఏం లేదు అని చెప్తుంది. అప్పుడు స్వప్న భర్త స్వప్నతో పనిలో పనిగా ప్రేమ కి కూడా ఒక మంచి సంభంధం చూసి పెళ్లి చేయాలి అని అంటాడు.
అప్పుడు స్వప్న ప్రేమ కి మాత్రమే కాదు నిరుపం కి కూడా మంచి సంబందం చూడాలి అని చెప్తుంది. ఈ నిశ్చితార్థం జరగనివ్వను అని, అంతే కాదు ఆ ఉంగరాలను కూడా నేనే తీసాను అని స్వప్న మనసులో సంతోషపడుతా ఉంటుంది.
‘జ్వాల అదే గుడిలోకి వచ్చి దేవుడిని దర్శనం చేస్కున్తుంటుంది. హిమ జ్వాల (శౌర్య) ని చూస్తుంది దేవుడా తను ఎందుకు ఇక్కడికి వచ్చింది అని తన మనసులో అనుకుంటుంది. తహను వాళ్ళ నాన్నమ్మ ని ఇక్కడ ఇలా చూస్తే ఏంటి పరిస్థితి అని చాల కంగారు పడుతుంది.
ఇంతలో..
పంతులు గారు ముహూర్తం సమీపించిది తాంబూలాలు మార్చుకోవాలి, తర్వాత ఉంగరాలు మార్చకుంటే నిశితార్థం సంపూర్ణం అయినట్టే అని చెప్తాడు. తాంబూలాలు మార్చుకునే సమయంలో హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. నిరుపం ఏమైంది హిమ అని అడుగుతాడు.
ఏం లేదు బావ అని చెప్పి లేచి వెళ్లి పోతుంది. అప్పుడు సౌందర్య ఆగు హిమ అని పిలిచినా కూడా వినకుండా అక్కడినుండి వెళ్లి పోతుంది. ప్రేమ్ తన మనసులో హిమ ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు నేను సంతోష పడాలా బాధ పడాల అని ఆలోచిస్తుంటాడు. సౌందర్య అండ్ నిరుపమ్ చాల బాధ పడుతుంటారు.
శౌర్య బయట ఆటో లో వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉంటుంది. వాళ్ళు బయటకి వచ్చి ”ఏంటో ఈ కలికాలం ఈకాలం ఏం చేస్తున్నారో వాల్లకి అయిన తెలుస్తుందో లేదో అని మాతడుతుంటారు. అప్పుడు శౌర్య ఏమైంది అమ్మ అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు లోపల జరిగిందంతా చెప్తారు.
చివరి నిమిషం లో పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని చెప్పి వెల్లి పోయింది అని అంటారు. అప్పుడు జ్వాల అయ్యో అప్పటి వరకు ఆ పిల్ల తెలివి ఏమైంది అని అంటుంది. ఇంకా వాళ్ళని తిస్కోని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
సీన్ కట్ చేస్తే..
స్వప్న వాళ్ళ మీద చాల కోపంతో హిమ ని తిడుతూ ”ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా మమ్మీ ? చెప్తూనే ఉన్నాను అది నష్ట జాతకురాలు అని కార్తిక్ దీపాలని పొట్టన పెట్టుకుంది. శౌర్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం అయ్యింది. నా కొడుకు పరువు తీసింది. జీవితాంతం ఒక అమ్మాయి తనని రిజెక్ట్ చేసింది అనే నింద తో ఉండాలి.
నువ్వు నీ మనవరాలు మమ్మల్ని అవమానించ దానికే ఇలా ప్లాన్ చేసారు కదా? నా పరువు నా కొడుకు పరువు తిసేసవు. ఏజ్ వస్తే సరిపోదు మమ్మీ తలవంపులు మాకి తెచ్చి నువ్వెందుకు మమ్మీ తల దిన్చుకున్తున్నావ్ అని ” వాళ్ళ మమ్మీ మీద అరిచి వెళ్ళిపోతుంది.
హిమ వాళ్ళ అమ్మ, నాన్న ఫోటో దగ్గరకి వెళ్లి నేను చేసింది తప్ప అని మాట్లడుతుంటుంది. శౌర్య ని జాగ్రతగా చూస్కోమని మేము ఇద్దరు కలిసి ఉండాలని శౌర్య భాద్యత నాకు అప్పగించారు. కాని శౌర్య చిన్నప్పుడే ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కాని సౌర్య మీద ప్రేమ నాకు కొంచం కూడా తగ్గలేదు. సౌర్య కలిసినప్పుడు నేన్ చాల సంతోషించాను. కాని నేనే హిమ ని అని చెప్పలేక పోయాను.
దానికి కారణం నేనంటే శౌర్య కి చాల ద్వేషం. శౌర్య కోసం నా ప్రేమ ను త్యాగం చేసాను. సౌర్య మనసులో నిరుపం బావ ఉన్నాడని ఆరోజు ఐస్ క్రీం పార్లర్ లో తెలిసింది. ” ఐస్ క్రీం మీద పదేసుకొని శౌర్య వాష్ చేస్కోవాడానికి వెళ్తుంది. అప్పుడు నిరుపం కాల్ చేస్తాడు.
అప్పుడు హిమ తన ఫోన్ ని చూస్తుంది , అందులో నిరుపం నెంబర్ ”నా మొగుడు అని సేవ్ అయి ఉంటుంది. అది చూసి హిమ నిరుపంబావ అంటే శౌర్య కి ఇష్టం అని తెలుస్కుంటుంది. అందుకే తనకు ఎంతో ఇష్టం అయిన తనబావతో ఎంగేజ్మెంట్ ని ఆపేస్తుంది.
ఇది కూడా చదవండి :- గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్, మే 14