కార్తిక దీపం సీరియల్ టుడే 18-05-2022 ఎపిసోడ్ !

0
karthika deepam today episode 18 may 2022

కార్తీకదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ | Karthika Deepam Serial Today Episode 18 May

సీన్ లోకి ఎంటర్ అయితే…

Karthika Deepam 18 May 2022 : జ్వాలా నిరుపం లు కారు దగ్గర మాట్లాడుతూ ఉంటారు. నిరుపం జ్వాలాకి థాంక్యూ అని చెప్తే మీరు నాకు డాక్టర్ సాబ్ థాంక్యు చెప్పకండి నాకు కూడా బాధ్యత ఉంటుంది కదా అని అంటుంది. డాక్టర్ సాబ్ మీరు మళ్ళీ ఎప్పుడు మందు తాగుతారు అని అడుగుతుంది.

అప్పుడు నిరుపం ఎందుకు జ్వాలా అని అడిగితే తన మనసులో మీరు నాకు మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్తారు కదా అని అనుకుంటుంది. జాల తనలో తాను చాలా సంతోష పడుతూ ఉంటుంది తనని పిలిచినా పట్టించుకోదు. నిరుపం  కార్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళి పోతాడు.

సీన్ కట్ చేస్తే….

హిమ హాస్పిటల్ దగ్గరికి వస్తుంది అందరు గుసగుసలాడు తూ ఉంటారు. నిరూపం తో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసునింది అని. అప్పుడు హిమ కి కోపం వచ్చి అందరికీ ఏం పని లేదా ఎందుకు నా వైపు అందరు గుచ్చి గుచ్చి అలా చూస్తున్నారు అని గట్టిగా అరచి లోపలకు వెళుతూ ఉంటుంది ఇంతలోనే నిరుపం కనిపిస్తాడు. వాళ్ల బావతో మాట్లాడితే సరిగా మాట్లాడు నిరుపం.

సీన్ కట్ చేస్తే…….

జ్వాల ప్రేమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. సత్యం సార్ ని చూసి సార్ ఎందుకు అలా డల్ గా ఉన్నారు అని అడిగితే ఏం లేదమ్మా ఊరికే ఉన్నాను అని సమాధానమిస్తాడు. అలా ఉంటే ఎలా సత్యం సార్ ఎప్పుడు ఏం జరగాలో అవి జరిగిపోతాయి దానికి మనం ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఎక్స్ట్రా ఎక్కడికి వెళ్లాడు కనిపించడం లేదు అని అడిగితే బయటికి వెల్లాడు అని చెప్తాడు.

ఎక్స్ట్రా లేకపోతే ఇంట్లో అసలు సందడి ఉండదు చాలా సైలెంట్ గా ఉంటుంది సత్యం సార్ అని చెప్తుంది. భోజనం పెట్టివ్వన సత్యం సార్ అని అడిగితే  ప్రేమ్ వచ్చాక ఇద్దరం కలిసి తింటాము అని చెప్తాడు కానీసత్యం సార్ ని పిలుచుకొని వెళ్ళుతుంది.

సత్యం సార్ కి అన్నం పెడుతూ నాకు నిరుపం కి జరిగే పెళ్లిని సత్యం సార్ ఒప్పుకుంటాడా అని తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సత్యం సార్ ఇవ్వాలా ఏం ఆలోచిస్తున్నావ్ అమ్మ అని అడిగితే ఏం లేదు సార్ అని సమాధానమిచ్చి అన్నం పెట్టిస్తుంది.

సీన్ కట్ చేస్తే….

నిరుపం హిమ గురించి ఆలోచించుకుంటూ తన క్యాబిన్ లో కూర్చొని ఉంటాడు. హిమ అసలు ఎందుకు ఇలా చేసింది నా గురించి ఏమనుకుంటుంది అని ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి వస్తుంది.

హిమ తన మనసులో సారీ బావ నేను అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితులలో ఇలా చేయాల్సి వచ్చింది బావ అంటూ తన మనసులో తాను బాధపడుతూ ఉంటుంది హిమా.

హిమ నిరుపం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావ్ బావ అని అడిగితే చెప్పండి డాక్టర్  హిమా అని అంటాడు. ప్లీజ్ బావ అలా మాట్లాడకు అని అంటుంది ఒక్కసారి నా వైపు చూడు బావ అని అడుగుతుంది.

తన దగ్గర ఉన్న ఫైల్ను లాగితే అందులో ఫొటోస్ పెట్టుకుని చూస్తూ ఉంటాడు నిరుపం, నిరుపం ఆ ఫోటోస్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళి పోతాడు.

సీన్ కట్ చేస్తే…

సౌందర్య కార్ లో హిమ గురించి ఆలోచించుకుంటూ చాలా స్పీడ్గా వెళుతూ ఉంటుంది. ముసలామె కు యాక్సిడెంట్ చేస్తుంది. ఇంకోవైపు జ్వాలా నిరూపం గురించి ఆలోచించు కుంటూ చాలా సంతోష పడుతూ ఆటో నడుపుకుంటూ వస్తా ఉంటుంది.

డాక్టర్ సాబ్ ఐ లవ్ యు  నువ్వు నా జీవితం లోకి వచ్చాక నా జీవితమే మారిపోయింది అంటూ సంతోష పడుతూ ఉంటుంది.

జ్వాలా వాళ్ళ నానమ్మ ని చూస్తుంది తను యాక్సిడెంట్ చేసిన అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో కి వెళ్లడం చూసి ఈమె ఎందుకు ఇక్కడికి వెళ్తుంది  ఎందుకు వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి జాల కూడా వెళుతుంది.

ఏంటి రౌడీ ఇక్కడికి వచ్చావు నువ్వు ఏమన్నా నన్ను గూడాచారి లాగా ఫాలో అవుతున్నావా అని సౌందర్య అడుగుతుంది జలాలతో, అప్పుడు అక్కడ జరిగిన విషయం అంతా యాక్సిడెంట్ జరిగింది కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు జ్వాలా వాళ్ళ నానమ్మ తో ఏంటి నీకు ఇలాంటి మంచి ఆలోచనలు కూడా ఉన్నాయా నువ్వు అచ్చం నాలాగే అని అంటుంది.

అప్పుడు సౌందర్య నీకు నాతో పోలిక  ఏంటి అని అడుగుతుంది. సౌందర్య గురించి ఆ పెద్దావిడ చాలా పొగుడుతూ ఉంటుంది అప్పుడు అవును మా సీసీ చాలా మంచిది అని వెటకారంగా చెప్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య జాలని తీసుకొని తన కార్లో కూర్చోమని చెప్తుంది. అప్పుడు కార్ స్టార్ట్ అవ్వదు.

అప్పుడు జ్వాలా హలో సిసి ఇంకా కార్ స్టార్ట్ చేయడం రావట్లేదు నేను స్టార్ట్ చేస్తాను ఇవ్వు అని అడిగితే నీకు కార్ డ్రైవ్ చేయడం కూడా వచ్చా అని సౌందర్య అడుగుతుంది. అప్పుడు నేను ఆల్ రౌండర్ ని సిసి అని చెప్తుంది జ్వాల.

ఇంతలో సౌందర్య కార్ స్టార్ట్ అవుతుంది.  అక్కడ ఉన్న ఒక విస్టింగ్ కార్డు ని  తీసుకుంటుంది జ్వాల, నిరుపం హీమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ఇలా చేసింది అని.

రేపటి ఎపిసోడ్ ప్రోమో: సౌందర్య జలాలతో మీ నాన్న ఎవరు అసలు ఏం చేస్తుంటాడు అని అడిగి వాళ్ళ నాన్న తిడుతూ ఉంటుంది నువ్వు మా నాన్నను తిట్టద్దు అని అంటుంది. జ్వాల సౌందర్య కి కాల్ చేసి నానమ్మ నేను నీ సౌర్య ని అని మాట్లాడుతుంది.

ఇవి కూడా చదవండి :-