కార్తిక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ యొక్క విశేషాలు !

0
karthika deepam today episode 19 may 2022

కార్తీకదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ | Karthika Deepam Serial Today Episode 19 May 2022

సీన్ లోకి ఎంటర్ అయితే..

Karthika deepam 19th may 2022 : నిరుపం హిమ ఎందుకు ఎంగేజ్మెంట్ వద్దు అన్నాద అని ఆలోచిస్తూ కార్లో కూర్చొని ఉంటాడు. నువ్వు అసలు ఎంగేజ్మెంట్ ఎందుకు కాదన్నావు అసలు అర్థం అవటం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో హిమ కార్ లోకి వచ్చి బావ సీట్ బెల్ట్ పెట్టుకోమని అని చెప్తుంది.

సీన్ కట్ చేస్తే..

సౌర్య ని తీసుకొని సౌందర్య పార్క్ లోకి వెళుతుంది. ఏంటి సీసీ నన్ను కిడ్నాప్ చేస్తున్నావా నన్ను కిడ్నాప్ చేస్తే నీకు ఏమీ రాదు ఆ ఒక్క ఆటో తప్ప ఆటో కి కూడా డబ్బులు కట్టాల్సి ఉంటుంది సిసి అని చెప్తుంది. నువ్వు ప్రతి ఒక్క మూమెంట్ ని సంతోషంగా ఆనందంగా ఎలా గడుపుతావ్, నీకు అసలు బాధలు అనేవి ఉండవా అని సౌందర్య సౌర్య తో అడుగుతుంది.

నేను చాలా బాధలో టెన్షన్ లో ఉన్నాను నేను నీలాగా ఉండలేకపోతున్నా నే అని సౌందర్య చెప్తుంది. అప్పుడు సౌర్య నీకేం బాధలు సిసి ఏసీ కార్లో బాగా డబ్బులు ఉన్నాయి కదా, నువ్వెందుకు బాధపడుతున్నావ్ అని అంటుంది. అప్పుడు సౌందర్య హిమ ఎంగేజ్మెంట్ వద్దు అని చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది, అప్పుడు శౌర్య నువ్వు ఏడుస్తున్నావా నువ్వు ఇలా ఏడిస్తే నేను ఇలా చూడలేను సిసి అని చెప్తుంది.

ఒకటి చెప్పు సీసీ మనిషికి కన్నీళ్ళు మానవ శరీరంలో ఎక్కడ ఉంటాయి అని అడుగుతుంది. అప్పుడు సౌందర్య ఎందుకు రౌడీ పిల్ల అని అంటుంది ఏంలేదు సిసి ఎక్కడుందో తెలుసుకుని ఆపరేషన్ చేయించి ఆ నీళ్ళని పక్కకి తీయించేస్తాను, ఇక జీవితాంతం ఏడవకుండా ఉండొచ్చు కదా సంతోషంగా ఉండొచ్చు కదా అని సమాధానం ఇస్తుంది.

సిసి కష్టాలు బాధలు అనేటివి అందరికీ ఉంటాయి అయినా కూడా ఈ మనుషులు బాధ ఎందుకు పెడతారో తెలుసా” రేపు సంతోషంగా ఉండొచ్చు అనే ఆశతో బతుకుతూ ఉంటారు అందుకే అందరూ బాధపడుతూ ఉంటారు” అని సమాధానం ఇస్తుంది, అప్పుడు సౌందర్య ఈరోజు నువ్వు చాలా సంతోషంగా కొత్తగా కనిపిస్తున్నావే అని అంటుంది.

సౌందర్య నన్ను ఎందుకు అడుగుతున్నావ్ ఏ అని అడుగుతుంది అప్పుడు సౌర్య జీవితం గడవాలి కథ సిసి అని చెప్పింది. అప్పుడు సౌందర్య నువ్వు చిన్నప్పుడు ఏం కావాలి అనుకున్నావే అని అడుగుతుంది అప్పుడు “సౌర్య నేను చిన్నప్పుడు కలెక్టర్ కావాలనుకునే దాని సిసి అని సమాధానం ఇస్తుంది. అప్పుడు సౌందర్య మీ నాన్న ఎవరు అసలు మీ నాన్న కనిపిస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది.

ఇంత మంచి అమ్మాయిని కలెక్టర్ చదవకుండా ఆటో నడిపిస్తాడు అని తిడుతుంది అప్పుడు సౌర్య మా నాన్న చాలా మంచోడు అని చెప్తుంది. మా నాన్న ఇప్పుడు లేడు దేవుడి దగ్గరికి వెళ్లి పోయాడు అని సమాధానం ఇస్తుంది.అయ్యో సారీ అని చెబుతోంది సౌందర్య. అక్కడ నుండి ఇద్దరు వెళ్ళిపోతారు.

సీన్ కట్ చేస్తే..

హిమ మరియు ని రూపంలో  ఎవరో పేషెంట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు అప్పుడు ఏంటి నువ్వు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చావ్ అని అడుగుతాడు “ప్లీజ్ బావ నువ్వు ఇలా సైలెంట్ గా ఉండకు నువ్వు ఎంత మంచోడు నాకు తెలుసు అదే నీ ప్లేస్స్ లో ఇంకెవరైనా ఉండి ఉంటే చాలా పెద్ద గొడవ చేసేవారు కానీ నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు నీ మౌనం నన్ను కాల్చేస్తుంది బావ నీ కోపం తీరే వరకు నన్ను తిట్టు బావ” అని అడుగుతుంది హిమ.

అప్పుడు నిరుపం తిట్టినంత మాత్రాన ప్రేమ పోదు కదా అని చెప్తాడు. నీ మనసులో నేను లేను అని అర్థమయింది కానీ నీతో ప్రశ్న అడగడానికి కూడా నేను పనికి రాని ఇప్పుడే అర్థం అవుతుంది అనిఅంటాడు. ఇక్కడ ఎవరో పేషెంట్ ముసలామె ఉందంట బావ దిగి చూద్దాం అని చెప్పి దిగు బావ అని చెప్తుంది హిమ.

సీన్ కట్ చేస్తే..

స్వప్న సత్యం వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. సత్యం వచ్చి స్వప్న దగ్గరికి ఇంటిలోపలికి రా స్వప్న అని అంటే “నేను మీ ఇంటికి అతిథి సత్కారాల కోసం రాలేదు అని సమాధానం ఇస్తుంది. అప్పుడు స్వప్న సత్యంతో మీ కొడుకుని జాగ్రత్త గా పెట్టుకోండి వీడు మళ్లీ ప్రేమ ప్రేమ అంటూ వెంట పరిగెడుతున్నాడు అని చెప్తుంది. భర్తగా ఎలాగో ఫెయిలయ్యారు కనీసం తండ్రిగా అయినా మీ పేరు నిలబెట్టుకోండి” అని సత్యంతో అంటుంది.

ఈమాట ఫోన్ లో చెప్తే సరిపోతుంది కదా ఇంటి దగ్గరికి వచ్చి నిలబడి ఎందుకు చెప్తున్నావ్ స్వప్నా అని అంటాడు. అప్పుడు సత్యం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. మీరు హిమని నిరుపమ్ మీ కలపాలని చూస్తే నా సైడ్ నుంచి రియాక్షన్ వేరే ఉంటుంది, అని చెప్పి అక్కడి నుండి కార్ వేసుకుని వెళ్ళిపోతుంది. చి చి ఈ స్వప్న నీ ఈ దేవుడు కూడా మార్చలేడు అని చెప్పి సత్యం కూడా వెళ్ళిపోతాడు.

సీన్ కట్ చేస్తే..

ఇంతలో ముసలమ్మ దగ్గర వాళ్ళ ఇంటికి సౌందర్య సౌర్య ఇద్దరు వస్తారు.అప్పుడు సౌందర్య సౌర్య తో నువ్వు నాకు చెప్పిన మాటలు చాలా ప్రేరణను ఇచ్చాయి. అయినా నువ్వు ఒక్కదానివే తిరగడానికి ఇంత పెద్ద కార్ అవసరమా సిసి అని చెప్పి, ఇంతకు ముందు నువ్వు మా తాతయ్య తో కలిసి తిరిగి ఉంటావు.

కదా అని చెప్పు వెటకారం చేస్తుంది సౌందర్యతో, ఎప్పుడు ఒక్కదానివే తిరుగుతావ్ మీ మనవరాలు నీతో ఉండదా అని అంటుంది. అప్పుడు సౌందర్య దాని గురించి నాతో మాట్లాడకు నాకు చిరాకేస్తుంది అని చెప్పి, కార్ వేసుకుని వెళ్లి పోతుంది. ఇదేంటి తన మనవరాలు గురించి అడుగుతుంటే ఎపిసో తెచ్చుకుని వెళ్ళిపోతుంది మాట్లాడొద్దు అని అంటుంది ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని సౌర్య అనుకుంటుంది.

సీన్ కట్ చేస్తే…

హిమ తన ఇంట్లో సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సౌర్య గురించి నాన్నమ్మ కు తెలిసిందా నా గురించి తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. సౌందర్య ఇంటి ముందు వాకింగ్ చేస్తూ ఉంటుంది ఇంతలో తనకు ఒక నంబర్ నుండి కాల్ వస్తుంది. తనకు సౌర్య కాల్ చేసి ఉంటుంది. ఎవరు మాట్లాడరా ఏంటి కాల్ చేసి మాట్లాడరా ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా అని అంటుంది.ఇంతలో అటు పక్క నుంచి నాన్నమ్మ అని వినిపిస్తుంది.

 ప్రోమో: సౌందర్య హిమ ను పిలిచి చాలా సంతోషంగా నాకు శౌర్య కాల్ చేసింది అని చెప్తుంది. ఇంతలో స్వప్న ఎంటర్ అయి ఇక నా కొడుకు సంగతి పక్కనపెట్టి మనవరాలిని వెతికే పని చూసుకో అని చెప్పి వెళ్లిపోతుంది. హిమ ఇంకొకసారి సౌర్య కి కాల్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ విశేషాలు !