కోరమీను చేప గురించి పూర్తి వివరాలు తెలుసుకొందం !

0
korameenu fish in telugu

కోర మీను చేప పరిచయం | Korameenu Fish In Telugu 2022

Korameenu Fish In Telugu : కోర మీను అనేది మన భారతదేశం లో అందరు ఇష్టపడి తినే చేప దీనికి ఎక్కువ డిమాండ్ కలిగి ఉంది. కోర మీను యొక్క పులుసును మన ఆంధ్రప్రదేశ్ లో ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు.

ఈ చేపలు మంచి నీటి గుంతలలో, చెరువులలో, ఏరులలో చిన్నపాటి చేపల సాగు చేసే చెరువులలో మనకు బాగా కనిపిస్తాయి, దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. ఇది అన్నిటికంటే రుచిగా ఉండుటకు కారణం, దీని యొక్క ప్రొటీన్ శాతం అన్నిచేపలతో పోలిస్తే చాలా అధికంగా ఉండటం.

ఇది ఎక్కువగా లోతైన ప్రాంతంలో, బురదలో కూరుకుని చిన్న చిన్న పురుగులను తింటూ జీవనం సాగిస్తుంది. ఇది సర్వ భక్షక జీవి కాబట్టి చిన్నపాటి చేపలను కూడా ఆహారంగా తింటుంది. ఇది చాలా ధృడమైన చేప. నీటి లో నుంచి బయటకు తీసినా కూడా కొన్ని గంటల పాటు ఇది బ్రతికే ఉంటుంది. దీని తల చూడటానికి పాము తలలా ఉంటుంది.

Korameenu Fish In Telugu

ఈ చేపని మీరు కొనాలి అనుకొంటే ఇద్దకడ ఇచ్చిన లింక్ ద్వారా ఈ చేపని మీరు కొనవచ్చు :-Korameenu Fish Site Link

కోర మీను చేప మార్కెట్ లో ఏ ధరకి అమ్ముతారు

మార్కెట్ లో ఒక్కో చేపకి ఒక్కోరకంగా ధర అనేది ఉంటది, అలాగే ఒక్కోదానికి ఒక్కో డిమాండ్ అనేది ఉంటది. ఈ చేపలు ఎక్కువగా సముద్రం ఉండే ప్రాంతాలలో ఈ చేపలు మనకి లభిస్తాయి. ఇది చాలా డిమాండ్ కలిగిన చేప దీని ఖరీదు కూడా కొన్ని ప్రాంతాలలో మనకు మాములుగా దొరికే చేపలతో పోలిస్తే చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ చేప సుమారు కేజీ 500 నుండి ప్రారంభం అవ్తుంది.

కోర మీను చేప తినడం వలన కలిగే  ఉపయోగాలు 

గాయాలు మర్పుటకు :

ఇందులో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనకు గాయం తగిలినప్పుడు దీనిని ఆహారంగా తీసుకుంటే మన గాయాలు త్వరగా మానిపోతాయి. ఆల్బుమిన్ అనేది మన శరీరంలో ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఇది గాయాలను మాన్పడానికి చాలా ఉపయోగపడుతుంది.

కండరాల దృడత్వనికి సహయంచేస్తుంది 

ఈ చేపలు తినడంవల్ల ఇది ప్రోటీన్ శాతాన్ని కలిగి ఉండడం వల్ల మన కండరాలలో శక్తి పెరుగుతుంది.   ఈ చేపలో ఉన్న ప్రోటీన్ శాతం మనకు మార్కెట్లో దొరికే మాంసం అంటే చికెన్ మరియు మటన్ తో పోలిస్తే ఇందులో ఎక్కువగానే ఉంటుంది.

రక్త ప్రసరణ 

ఇందులో ఉన్న లవణాలు కొవ్వు పదార్థాలు మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలోని రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్థాయి. అందుకని కనీసం నెలకు రెండు సార్లు ఈ చేపను ఆహారంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాల ఉపయోగాలు కలుగుతాయి.

మధుమేహ నివారణ 

ఈ చేపను మనం తరుచుగా తీసుకొంటే మన శరీరం లో ఉండే చెక్కర స్థాయి ని తగిస్తుంది. ఈ చేప మాంసం లో ఉన్నా లవణాలు, మంచి ప్రొటీన్లు మరియు కొవ్వులు వల్ల దీని మాసం తింటే చాలా ఫలితాలను చూపుతుంది. అలాగే ఈ చేపను తినడం వలన మన మధుమోహ స్థాయి ని పెంచకుండా తగ్గకుండ ఒక నిర్ణిత స్థాయి లో ఉంచుతుంది.

కోర మీను చేప తినడం వలన కలిగే  దుష్ప్రభావాలు 

  • ఈ చేపలు గర్భవతులు తినకూడదు.
  • అలాగే పాలు ఇచ్చే తలలు కూడా ఈ చేపను తినకూడదు.
  • ఒక్కోసారి ఈ చేపను తినడం వలన తిమ్మిరిగ ఉండడం జరుగుతుంది.
  • ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బురం రావడం లేదా నొప్పి వంటిది వస్తుంది.
  • ఈ చేపలు తినడం వలన వంతులు సంభావిoవచ్చు.

ఇవి కూడా చదవండి