kumanan sethuraman sarileru neekevvaru – ‘ రమణ లోడ్ ఎత్తాలిరా ‘ లైఫ్ చేంజ్ చేసిన డైలాగ్

1

kumanan sethuraman sarileru neekevvaru :

సినీరంగం సహజంగానే ఎవరిని ఎప్పుడు ఎలా పాపులర్ చేస్తుందో ఊహించి చెప్పలేం! ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ,కొంతమంది నటులు సంవత్సరాల కొద్ది సినిమాలలో నటిస్తూనే ఉన్నప్పటికీ వారు ఎలాంటి గుర్తింపు నోచుకోకుండా ఉన్నారు.

కానీ కొంతమంది నటులు ఒక్క సినిమాతోనే ఫేమస్ గా మారి పోతారు. అయితే సినిమా ఏదైనా కావచ్చు కానీ కేవలం ఒకే ఒక్క డైలాగుతో నే వారు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒక్కరు కుమనన్ సేతు రామన్ (kumanan rasanathan ).

” ramana load ethali ra checkpost paddhati ” అంటూ డైలాగ్ చెప్తూ, పవర్ ఫుల్ ఫైట్ లో మెరిసి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తనదైన పాత్రలో నటించి ఎంతో మంది సినీ అభిమానులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. kumanan rasanathan family గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

ఇతని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం. సేతు రామన్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా పని చేసేవాడు. 1984వ సంవత్సరంలో చెన్నై నుంచి వైజాగ్ కు వచ్చారు. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా సరే సినిమాలలో పని చేయాలనే కోరిక ఉండేది. సినిమా ఇండస్ట్రీ కి వెళ్లి మెంబర్షిప్ కార్డు కూడా తీసుకున్నాడు.

ఇందుకోసం ఒక సినిమా షూటింగ్కు వెళ్లి అక్కడ ఒక షాట్ లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకిచ్చిన డైలాగ్ సరిగ్గా చెప్పలేక పోవడం తో సేతు రామన్ నవ్వితే, ఆ సినిమా డైరెక్టర్ వెంటనే సేతు రామన్ ను పిలిచి ఆ డైలాగ్ ను చెప్పమన్నాడు. అప్పుడు వెంటనే ఇచ్చిన డైలాగ్ ను అనర్గళంగా చెప్పాడు. ఆ వెంటనే ఆ సినిమాలో ఇతనికి అవకాశం ఇచ్చారు.

ఇలా మొదలై ఎన్నో సినిమాలు చేశాడు. ఇటీవలే విడుదలైన అరవింద్ 2 సినిమా లో కూడా నటించాడు. అల్లుడు శీను చిత్రంలో ప్రదీప్ రావత్ పక్కనే నటించాడు. మరియు చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా నటించాడు. Kumanan sethuramanఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేస్తూనే సినిమాలపై ఉన్న ఆసక్తితో స్టైల్ ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టాడు.

ఆ సమయంలోనే అనేక మంది నటులు, ఎంతో మంది తారల ఫోటోలు తీసే అవకాశం లభించింది. ఆ సమయంలోనే అతనికి ఎంతో మంది సినీ నటులయెక్క పరిచయాలు ఏర్పడ్డాయి. మేఘం సినిమాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సేతు రామన్ యొక్క బాడీ లాంగ్వేజ్ నచ్చి ఆ చిత్ర దర్శకుడు విలన్కు సహాయకుడిగా ఉండే క్యారెక్టర్ ఇచ్చాడు.ఇలా ఈ సినిమాలో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందడం ఇతని జీవితంలో కీలకమైన మలుపుగా మారింది.

అప్పట్నుంచి ఓవైపు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తూనే మరో వైపు సినిమాల్లో అవకాశాలు దక్కినప్పుడు నటిస్తూ వచ్చాడు. వెంకీ, స్టాలిన్, ధైర్యం ఇలాంటి అనేక చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ కార్యాలయానికి ప్రధాన సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో నిస్సహాయంగా ఉన్న వికలాంగులను భుజంపై మోసుకుని వెళ్లి సహాయం చేసేవాడు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ kumanan sethuraman ను ప్రత్యేకంగా అభినందించారు.

1 COMMENT