కన్నడ హీరో నిఖిల్ పెళ్లి ఎంక్వయిరీ కోరిన కర్ణాటక ప్రభుత్వం

0

ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాధికి భయపడి లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఓ మాజీ ముఖ్యమంత్రి తన కుమారుడి పెళ్లి జరిపించారు. ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరో కాదు కర్ణాటక కు చెందిన కుమారస్వామి, ఆ పెళ్ళికొడుకు మరెవరో కాదు యంగ్ హీరో నిఖిల్.మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడు, నటుడు అయిన నిఖిల్ పెళ్లిని ఫామ్ హౌస్లో కేవలం వంద మంది అతిథులు మధ్య పెళ్లి వేడుకలు జరిపించాడు.అయితే ఈ పెళ్లి వేడుకల్లో ఎక్కడా కూడా సామాజిక దూరం పాటించలేదని ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇందుకోసం కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెళ్లి జరిగిన ప్రాంతంలోని అధికారులను ఉద్దేశించి పెళ్లికి సంబంధించిన ప్రతి వివరము తన దగ్గరకు చేర్చాలని ఆయన ఆదేశాలు జారీ చేయడమైనది. కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ దీనికి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.ఇందుకోసం పెళ్లి జరిగిన రాంనగర్ కు చెందిన డిప్యూటీ కమిషనర్ నుండి పూర్తి వివరాలు రాబట్టాలని ఆయనకు ఆర్డర్స్ జారీ చేయడమైనది.పెళ్లి వేడుకలో సామాజిక దూరం పాటించలేదని పూర్తి వివరాలు కనుక బయటపడితే మీపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెళ్లి వివరాలు:-బెంగళూరు సిటీ లోని రాంనగర్ కేతగాని హల్లిలోని ఓ పెద్ద ఫాం హౌస్లో ఈ పెళ్లి వేడుకలు జరిపించారు.ఈ పెళ్లికి దేవేగౌడ కు సంబంధించిన కుటుంబ సభ్యులు, పెళ్లి కూతురు రేవతి ఆమె తల్లిదండ్రులు, వారికి సంబంధించిన కొంత మంది కుటుంబ సభ్యులు ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న ట్లుగా బయట పడింది.