జాతిపిత.. మహాత్మా గాంధీ సూక్తులు మరియు జీవిత సత్యాలు

0
జాతిపిత.. మహాత్మా గాంధీ సూక్తులు
జాతిపిత.. మహాత్మా గాంధీ సూక్తులు

జాతి పిత మహాత్మా గాంధీ గురించి :

సూక్తులు తెలుసుకోయే ముందు జాతి పిత మహాత్మా గాంధీ గురించి short గా తెలుసుకొందాం.

2019 అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ఆయనకు ఘన నివాళి అర్పించారు.  ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్ లోని పోరుబందరులో అక్టోబరు 2, 1869లో జన్మించారు. ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీని ప్రజలు జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలనే ఆయుధాలతో దేశానికి స్వరాజ్యం సంపాదించిన అగ్రగణ్యులు మహాత్ముడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము లాంటి విధానాలతో తెల్లవారిని గడగడలాండించిన ధీశాలి.

జాతి పిత మహాత్మా గాంధీ సూక్తులు (Mahatma Gandhi Quotes ) :

 • శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
 • విశ్వాసం అనేది కొద్ది పాటి గాలికి వాలి పోయేది కాదు. అది అచంచలమైనది.హిమాలయాల అంత స్తిరమైనది.
 • నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు. ప్రపంచం తో స్నేహం చేసుకోవడమే నా గమ్యం.
 • నన్ను స్తుతించే వారి కంటే నన్ను కటినము గా విమర్శించే వారి  వాళ్లనే  నేను అధికముగా మంచిని పొంది ఉన్నాను.
 • ప్రార్థన ఉంటె ఉదయం లేచినపుడు తాళం చెవి. రాత్రి పడుకొనే ముందు తలుపు గడియ.
 • కష్టపడి పని చేయచేయని వ్యక్తీ కి తిండి తినే హక్కు లేదు.
 • లేని గొప్పదనం ఉందని చెబితే, ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది.
 • మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి. వీటిని అదుపులో పెట్టడానికి సహన శక్తి అవసరం.
 • దుర్బల భాదల అనుభవం నిజాయితి కి  ఒరిపిడికి రాయి.
 • భయం వల్ల పొందే అధిపత్యం కంటే, అభిమానుల్లో లబించే అధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది.
 • చదువు లో ఆనందాన్ని పొందితే, జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకొంటావు.
 • ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి.
 • తనకు తాను తృప్తి పడే మానవుడు ఎదగాడు.
 • ఎక్కువ తక్కువలు కుల మత బేధాలు ఉండటం మనవ జాతి కి అవమానకరం.
 • విద్యనూ దాచుకోవడం కన్నా ఇతరులకు పంచితే మరింత పెరుగుతుంది.
 • మేధావులు మాట్లాడతారు. మూర్ఖులు వాదిస్తారు.
 • మొదట వారు నిన్ను విస్వరిస్తారు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత నీతో పోరాటం చేస్తారు. అప్పుడు నీవే గెలుస్తావు.
 • నీ అనుమతి లేకుండా నిన్ను ఎవరు భాదపెట్టలేరు.
 • మనిషి గొప్పదనం మెదడు లో కాదు, హృదయం లో ఉంటుంది.
 • వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తీ  తన సర్వస్వాన్ని కోల్పోయినట్టే.
 • బలహీనులు, ఎన్నడు ఎప్పటికి, క్షమించడానికి ఎంతో దైర్యం కావాలి.
 • నీవు ఎవరికైనా సాయం చేస్తే వెంటనే మరిచిపో, ఎవరి నుంచైనా సాయం పొందితే జీవితాంతం గుర్తు ఉంచుకో.
 • నిన్ను నువ్వు కనుగొనడానికి మార్గం, ఇతరులు సేవలో నిన్ను నువ్వు మరిచి పోవడమే.
 • కుండెడు భోదనల కంటే గరిటెడు ఆచరణ మేలు.
 • ఈ ప్రపంచములో నీవు  చూడాలి అనుకొంటున్నా మార్పు, మొదట నీతోనే మొదలు అవ్వాలి.
 • ప్రజలే వేళ్ళూ. ప్రభుత్వమే ఫలం, వేళ్ళూ తియ్యగా ఉంటేనే, పండు తియ్యగా ఉంటుంది.
 • నీ ఆలోచనలే నువ్వు.
 • ప్రజావాణి. దివ్యవాణి.
 • పొరపాటుని స్వంతం చేసుకో, అది నీ బలాన్ని పెంచుతుంది.
 • ఇతరుల పొరపాటులు పోల్చుకొంటే బాదే మిగులుతుంది.
 • మనిషి పుట్టుకతోనే ; పుట్టుకలోనే ప్రజాస్వామ్యవాది.
 • ప్రపంచములో మానవుని అవసరాని కి సరిపడా ఉంది; అంతే గాని ఆశకు సరిపడా లేదు.
 • మంచి పుస్తకాలూ మన చెంత ఉంటె మంచి మిత్రుడు లేని లోటు తిరినట్టే.
 • పొడుపు చేయవలసిన చోట ఖర్చు చేయకు, ఖర్చు చేయవలసిన చోట పొదుపు చేయకు.
 • మనం పొరపాట్ల ద్వారా, ఓటమి ద్వారా పాటలు నేరచుకోనీ, లాభం పొందుతాము.
 • పాపాల్లాన్ని రహస్యము గా చేస్తాము. దేవుడు మన ఆలోచనలకూ కూడా సాక్షి అని తెలిసినపుడు మనం స్వేచా జీవులం అవుతాము.
 • మరొకడు చేసిన పాపానికి నువ్వు వ్యక్తీగతం గా అపరాధ భావనకు లోను కావద్దు. దాగిన పాపం విష తుల్యం.
 • నేరం ఒక జబ్బు. దాన్ని జబ్బు గా మాత్రమే పరిగణించాలి.
 • నిన్ను నువ్వు అంచనా వేసుకో, అదే ఆనందం.
 • దయర్దాత లేని న్యాయం షైలాక్ న్యాయం.
 • పట్టుదల గనులను తెరస్తుంది. అది అంతు లేని ఆనందాన్ని ఇస్తుంది.
 • తక్కువ మాట్లాడేవాడు మాట్లాడడానికి ఆలోచన లేక కాదు. అతను ప్రతి  మాట ఆచి తూచి మాట్లాడుతాడు.
 • ప్రజస్వామ్య మొత్తంగా అవలోకిస్తే, అది నైతిక సూత్రాల మీద ఆధారపుడుతుంది.
 • నీతిగా జీవించడమంటే మనం మన మనసు మీద కోర్కెల మీద అధికారం సంపాదించాలి.
 • తన భాద్యత ను సక్రమంగా నిర్వర్తించండం ఎలాగో తెలియ చేసేదే నాగరికత.
 • స్వచ్చమైన నిరాహారదీక్ష గొప్ప ప్రార్థన.
 • మనసు మురికిగా ఉంటె నిరాహార  దీక్ష   నిరుపయోగం.
 • ఏది చేయలేనంత కోపాన్ని నిశబ్దం అణచి వేస్తుంది.
 • ప్రేమ ఉన్న చోట జీవితం ఉంటుంది. పగ ఉన్న చోట నాశనం ఉంటుంది.
 • మనకు జన్మను ఇచ్చ్చిన భగవంతుని చేతిలోనే మనకు నాశనం ఉంటుంది.
 • పనిలో పద్దతుల్లో నమ్మకం ఉంటె వేడెక్కిన సూర్యుడు చల్లబడతాడు.
 • మానవత్వాని ప్రేమించడం లాంటిదే దేశభక్తీ .
 • ద్వేషించిన వారినే ప్రేమించడమే అహింస.
 • భౌతికమైన ప్రతి వైపరీత్యం వెనుక దేవుని వెనుక ఆజ్న ఉంటుంది.
 • నేత్రాలు దేహానికి దీపాలు.
 • స్త్రీలు త్యాగానికి గుర్తు కనుక వారు వీరోచితముగా ఉండరు.
 • త్యాగం ఎంత నిస్వార్థం గా ఉంటె, అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది.
 • దేవుడికి భయపడితే మనిషికి భయపడనవసరం లేదు.
 • కన్నులు పోయినప్పుడు అందుడు కాదు. తప్పులను కప్పి పుచ్చుకొన్న వాడె అందుడు.
 • తులనడటం భావాలను వ్యక్తికరించందం నేటి ప్రపంచం లో సహజం అయిపోయాయి.
 • సంతోషిన్చదగిన్డైతే తప్ప ఏ త్యాగం గుర్తించబడింది కాదు.
 • జీవితమనే దారం దేవుని చేతుల్లో ఉంది.
 • భక్తీ లేని జ్ఞానం, ఉపయోగం లేని అగ్ని.
 • జ్ఞాపకం అనుమానాస్పదం. రాసిన అక్షరాలే కల కాలం నిలుస్తాయి.
 • ప్రపంచములో ని పురానాలన్ని సమర్తించిన తప్పు తప్పే.
 • ప్రసవ వేదన, భాద నుండి జాతులు జన్మిస్తాయి.
 • చెడును తేలికగా వదలించు కోవచ్చు. చెడుకు కాళ్ళు లేవు, దాని మీద అది నెలబడటానికి.
 • ఎక్కడ వెలుగు ఉంటె అక్కడ నీడ ఉంటుంది.
 • చివర్లో మంచి జయిస్తుంది చేయవలసింది ఒక్కటే- మన మనసు లోని చెడుకు సహకరించాకూడదు.
 • చికాకులనే పాటశాలలో క్రమ శిక్షణ పెంపొందుతుంది.
 • సత్యం అనే పాత్రా లో నిశబ్దం, ఆద్యాత్మిక క్రమ శిక్షణ లో భాగం.
 • జీవితం ముగింపు లేని ప్రయోగ శాల.
 • ఎక్కడ ఉత్తమమైన క్రమశిక్షణ ఉంటుదో అక్కడ స్వతంత్రం ఉంటుంది.
 • ఎన్నుకొన్న దాని కోసం ప్రయత్నిచిన నెగ్గడం లో కీర్తి ఉంటుంది.
 • పట్టుదలతో సాధించుకోవాల్సింది కీర్తి. సరంక్షించు కావాల్సింది.
 • క్రోధాన్ని అనచడమే మవవత్వం.
 • కష్టాలను తప్పించుకొనే వారి కంటే, వాటిని అధిగమించే వారె, విజయం సాదించా గలుగుతారు.
 • ఏ మనిషినీ అయిన అతని పనిని బట్టే అంచనా వేయాలి. వాటి వెనుక కారణాలను బట్టి కాదు. వారి హృదయం దేవునికే తెలుసు.
 • ప్రార్థన మన కోరిక తో చేసేది కాదు. ఆత్మ యెక్క కోరిక అది.
 • అత్మనుభావం ఉన్న చోట వాచాలత ఉండదు.
 • ప్రతి వాడు ఓర్పు తో ఉండ లేదు. అల ఉన్న వాడె తనను తాను జయించగలడు.
 • అందం నడవడిక లో ఉంటుంది. ఆడంబరం లో కాదు.
 • నేనే ఆచరించని దాన్ని ఇతరులుకు ఆచరించమని చెప్పడం నా జీవిత సూత్రాలకు వ్యతిరేఖం.
 • అహింస సర్వ ప్రాణులకూ మాతృ మూర్తి.
 • నిరక్షరాస్యులైన తన తల్లి పిల్లలి హృదయం తో ప్రేమిస్తుంది.
 • నిజమైన అందం మనో మాలిన్యా శుభ్రతతో ఉంది.
 • దేశాభివృద్ధి అంటే అద్దాల మేడల్ని నిర్మించడం కాదు. ప్రజల అభివృదే అసలైన న నైతిక అభివ్రుది.
 • అణకువ విజయానికి దారి.
 • తెలివైన వాడు తాను చేసే పనికి  అవకాశం మీద ఆధార పడదు.
 • మూలధనం ఆధారం అయితే పని కూడా అంతే.
 • అహింస ఎదుట హింస వాలే, సత్యం ఎదుట అసత్యం శాంతించాలి.
 • ఇవి కూడా చదవండి :