అరవింద సమేత హిట్టుతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .ఈయన తీయబోయే నెక్స్ట్ సినిమా పై చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.త్రివిక్రమ్ కూడా చాలా గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసాడు. ఇందులో హీరోగా అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ దసరా కానుకగా విడుదల చేశారు.గత చిత్రాల మాదిరిగానే త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్’ అలా… వైకుంఠ పురములో’అని అచ్చమైన తెలుగు లోనే పెట్టారు.సినిమా టైటిల్ విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎందుకంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల జోడి హిట్ కాంబినేషన్ వీరిద్దరూ కలిసి ఇంతకుముందు జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి, చిత్రాలు చేశారు.ఈ చిత్రాలు హిట్ కావడంతో అందరి దృష్టి ‘అలా… వైకుంఠ పురములో’పైనే ఉన్నాయి.
ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం హిట్టయితే,అల్లు అర్జున్, త్రివిక్రమ్ లకు, హ్యాట్రిక్ అవుతుంది.
త్రివిక్రమ్ తీయబోయే నెక్స్ట్ సినిమ మన ప్రిన్స్ మహేష్ బాబు తో అని త్రివిక్రమ్ అంటున్నారు.ఎందుకంటే మహేష్ బాబు తో త్రివిక్రమ్ కి మంచి అనుబందం ఉంది.మహేష్ బాబు తో కూడా త్రివిక్రమ్ ఇంతకు ముందు రెండు సినిమాలు తీసారు.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా అతడు.ఆ చిత్రానికి గానూ మహేష్ బాబు కి నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఖలేజ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్ల కొట్టింది.