సంక్రాంతి బరిలో నలుగురు హీరోలు.

0

సినీ పరిశ్రమకు దసరా దీపావళి గడవకముందే  సంక్రాంతి సీజన్ వచ్చేసింది.మహేష్ బాబు, బాలయ్య, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్,ఈ నలుగురు హీరోలు దసరా బరిలోపోటీపడుతున్నారు.మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు.. 

బాలయ్య సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు .జైసింహా విజయంతో కె.ఎస్.రవికుమార్  బాలయ్య బాబుల కాంబినేషన్ హిట్టుగా నిలిచింది మరో హిట్ కాంబినేషన్ అల్లు అర్జున్  త్రివిక్రమ్ ల కలయికలో వస్తున్న’ అల… వైకుంఠ పురంలో ‘కళ్యాణ్ రామ్’ ఎంత మంచి వాడవురా’ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి .

ఈ సినిమాల ప్రమోషన్స్ దసరా కంటే ముందే ప్రారంభం కావడం విశేషం. దసరా కానుకగా సంక్రాంతి సినిమాలా పోస్టర్స్ టీజర్ లు క్యూ కడుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ చిత్రం’ అల… వైకుంఠ పురంబులో’పోస్టర్ ఈ సాయంత్రం 4 గంటల ఐదు నిమిషాలకి రాబోతోంది. మహేష్ బాబు చిత్రం’ సరిలేరు నీకెవ్వరు’ పోస్టర్ ఈ సాయంత్రం అం 5 గంటల నాలుగు నిమిషాలకి  రాబోతోంది.అలాగే బాలయ్య సినిమా 105 టైటిల్ పోస్టర్ రేపు విడుదల కాబోతోంది.ఆ మరుసటి రోజే కళ్యాణ్ రామ్ చిత్రం’ ఎంత మంచి వాడవురా’ టీజర్ రాబోతోంది.

సంక్రాంతి సినిమాలు దసరా నుంచి ప్రమోషన్స్ ని మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు మాత్రం సంక్రాంత్రి ప్రమోషన్స్ లో’ అల… వైకుంఠ పురంలో ‘ముందుంది. ఈ చిత్రం ఇప్పటికే ఒక పాటను విడుదల చేసింది. సామజ వర గమన, అంటూ సాగే ఈ పాట కు మంచి స్పందన వస్తోంది. ఈ ఒక్క పాటతో’ అల… వైకుంఠ పురంలో’కి పీక్స్ కి చేరిపోయాయి.ఇక మిగిలింది బాలయ్య, కళ్యాణ్ రామ్,లే మరి  దసరా రేసులోఆకట్టుకున్నసంక్రాంతి చిత్రంగా ఏ సినిమా నిలుస్తుందో, వేచి చూడాలి.