మహిళా సాధికారత వ్యాసం – Mahila Sadhikaratha Essay Writing In Telugu !

0
Mahila Sadhikaratha In Telugu

మహిళా సాధికారత వ్యాసం | Mahila Sadhikaratha In Telugu Essay 

Mahila Sadhikaratha Essay In Telugu :- మహిళలు అనగానే అందరి దృష్టి లో ఒక ఆది పరాశక్తి అని గుర్తు పెట్టుకొనేలా ఉండాలి.  మహిళా అంటే వంటి ఇంటిలో చేతులు ముడుచుకొని ఉండడం కాదు సమాజంలోకి వచ్చి తనకు ఉన్న కలలను నేరవేర్చుకోవాలి. దేశానికి ఉపయోగపడే పనులు తన వంతు చేయాలి, అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది.

ఏ రంగంలో అయిన మహిళలలే ముందు అంచులో ఉండాలి, స్త్రీ చేతకానీ పని అంటూ ఏది ఉండదు,  దేశం కోసం పోరాటం చేయడానికి ఎల్లపుడు సిద్ధంగా ఉండాలి. మహిళలలు అంటే ఏంటో నిరూపించుకోవాలి. స్త్రీ అంటే దేనికి పనికి రాదు  అన్నట్టు  ఉండరాదు.

సమాజంలో అమ్మాయిలు ఒంటరిగా దొరికితే చాలు కమపిశాచులు హత్యాచారం చేయడానికి సిద్ధంగా గా ఉంటారు. మన దేశంలోనే కాదు ఇతర దేశంలో కూడా హత్యచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ హత్యచారాలు ఆగాలి అంటే అమ్మాయిలు శక్తి వంతంగా మారాలి. అబ్బాయిలు, ఆడపిల్లలను చూస్తే చాలు భయపడి పారిపోయేలా చేయాలి. అప్పుడే అమ్మాయిల మీద జరిగే దాడులు తగ్గుతాయి.      

అమ్మాయి అంటే ఆటం బాంబు లాగా ఉండాలి, కమపిశాచులకి ఎవరికీ  భయపడరాదు, వారె మనల్ని చూసి పారిపోవాలి. మహిళా అంటే ఓపిక, సహనంతో కుడికున్న దేవత, ఆ దేవతలందరికీ ఒక్కసారిగా సహనం, ఓపిక నశించి పోతే దేవతలు ఉగ్రరూపం దాల్చక తప్పదు.  ఎవరి వలన కాదు శాంతి పరుచుటకు. ఓపిక, సహనం ఉన్నత వరకే అందరు జీవిస్తారు, ఉగ్రరూపం ఎత్తితే ఎవరు ఉండలేరు. అంత శక్తి వంతమైనది స్త్రీ.

 సాధికార అంటే ఏంటి 

సాధికారత అనగా మహిళా తన హక్కులను బాధ్యతను తెలుసుకొని, తనకున్న శక్తి యుక్తులను సమగ్రంగా ఆవిష్కరించుకొని అందిన అన్ని అవకాశాలను వినియోగించుకొని సమాజానికి, దేశానికి ప్రపంచానికి ఉపయోగపడమే.

సాధికారత అనగా సామర్థ్య నిర్మాణ ప్రక్రియ. ప్రతివ్యక్తి తన వ్యక్తిగత లేదా సామూహిక జీవనానికి సంబంధించిన విషయాలలో స్వయం నిర్ణయాన్ని తీసుకొనే ధైర్యాన్ని, సామర్ధ్యాన్ని, స్వేచ్ఛనూ కలిగి ఉండటం. నిర్ణయాలు తిసుకునేటప్పుడు ఇతరుల సహాయం తీసుకొకుడదు.

మహిళా విద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం తన సమస్యను తానే పరిష్కరించుకొనే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. తన సొంత ఉద్యోగంతో సంపదను సంపాదించుకోవాలి.

మహిళా సాధికారత అంటే ఏమిటి ?

మహిళాసాధికారత అనగా స్త్రీలు వారి జీవితానికి సంబంధించిన అంశాలో స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండటం. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాలలో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండటం. నిర్ణయాలు తీసుకొనే స్వేచ్చ, ఎంపిక చేసుకొనే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. ఆర్థిక స్వతంత్రాన్ని, రాజకీయ అధికారాన్ని కలిగి ఉండటం.

అందుకే పంచవర్ష ప్రణాళికలలో “మహిళా సంక్షేమానికి”  “మహిళాసాధికారతకు” ప్రాధాన్యతను ఇస్తూ వస్తుంది. 1982-83 లో ప్రారంభించిన ‘డ్వాక్రా’ 1992 లో మహిళా కమీషన్‌ ఏర్పాటు 2001లో ప్రారంభించిన జాతీయ మహిళా సాధికారత విధానము మొదలైనది.

సాధికార కోసం రాజ్యాంగంలో పొందు పరిచిన చట్టాలు 

స్వతంత్రం తర్వాత భారత ప్రభుత్వము మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్నదని చెప్పవచ్చు. రాజ్యాంగంలో స్త్రీ, పురుషులు అందరు సమానంగా ప్రాధమిక హక్కును కల్పించడం జరిగింది. మరియు వివిధ చట్టాలను మహిళా సాధికారత కోసం పొందపరిచినది. ఈ చట్టాలు ఏంటో తెలుసుకుందాం.

  1. గర్భస్త లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం :- 1992
  2. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం :-1986
  3. సతీ నిరోధక చట్టం :- 1987
  4. గర్భ నిరోధక చట్టం :- 1971
  5. బాల్య వివాహాల నిరోధక చట్టం :- 1976
  6. హిందూ వివాహము మరియు విడాకుల చట్టం :- 1955
  7. హిందూ వివాహ చట్టం :- 1955
  8. వరకట్న నిరోధ చట్టం :- 1956.

పైన పేర్కొన్న చట్టాలు మహిళా సాధికార కోసం రాజ్యాంగం అమలుచేసింది. ఈ చట్టాలు వచ్చిన కూడా కొన్ని ప్రాంతాలలో అమ్మాయిల పై జరిగే హత్యచారాలు, అఘాయిత్యాలు, దాడులు, లైంగిక దాడులు మొదలైనవి ఇప్పటికి జరుగుతున్నాయి.

పైన ఇచ్చిన information అంతర్జాలంలో దొరికిన  సమాచారం ప్రకారం మీకు  తెలియచెస్తున్నాం, మీకు ఈ వ్యాసం మీద సందేశం ఉంటె కామెంట్ రూపంలో తెలియచేయండి రిప్లై ఇస్తాం.

ఇవి కూడా చదవండి :-

  1. మాతృభాష వ్యాసం మీ అందరి కోసం !
  2. స్వచ్చ భారత్ గురించి తెలుసుకుందాం !