మలేరియ జ్వరం తగ్గాలంటే ఎం చేయాలి ? ఈ జ్వరానికి నివారణ చర్యలు ఏమిటి !

0
Malaria Fever In Telugu

మలేరియ జ్వరం తగ్గాలంటే ఎం చేయాలి ? | What Is Malaria Fever In Telugu

Malaria Fever In Telugu :-మలేరియా పరాన్నజీవుల వల్ల కలిగే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది, దోమలు కుట్టడం ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. మలేరియా సోకినపుడు మనిషి చలిజ్వరంతో బాధపడతాడు. సాధారణంగా సంక్రమణ జరిగిన 10-15 రోజులలో లక్షణాలు కనిపిస్తాయి.

అయితే పరాన్నజీవులు మనిషి శరీరంలో సుమారు ఒక సంవత్సరం పాటు కూడా నిద్రాణంగా ఉండే అవకాశం ఉంది. మలేరియా సాధారణ లక్షణాలు జ్వరం, చలి, తలనొప్పి, వికారం, వాంతులు, అలసట, పొత్తికడుపు నొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం, దగ్గు మొదలైనవి.

Malaria Fever : మలేరియా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలను బలి తీస్తుకుంటుంది. ఇది ఓ దోమ కాటు వల్ల వచ్చే వ్యాధి. మలేరియా దోమ కుట్టినప్పుడు రక్తంలో ఓ హానికరమైన పరాన్న జీవిని వదిలేస్తుంది. దీంతో మన శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను దెబ్బతీస్తుంది.

దీని తీవ్రత వర్షకాలంలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మలేరియ జ్వరాo లక్షణాలు ఏమిటి | Malaria Symptoms In Telugu 

మలేరియా వచ్చిన వారి శరీరం తరచుగా చల్ల పడుతుంది. అధికంగా జ్వరం రావడమే కాకుండా రోగికి విపరీతంగా చెమటలు పడతాయి.  ఇవే కాకుండా తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం, రక్తహీనత, కండరాల నొప్పి వంటి సమస్యలు వస్తాయి, కొంతమంది మలేరియా రోగులల్లో మూర్ఛ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

మలేరియా లక్షణాలు మొదటి దశలోనే ఈ వ్యాధిని గుర్తించడం వల్ల మెరుగైన చికిత్స అందిచొచ్చు. కొద్దిగా ఆలస్యం చేసిన కూడా ప్రాణాలకే ప్రమాదం. దోమకాటుకు గురైన ఏడు నుంచి 18 రోజుల మధ్య మలేరియా లక్షణాలు కనిపిస్తాయి.

రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కోపిక్ ల్యాబోరేటరీ టెస్టులు లేదా ఆర్డీటీ టెస్టుల ద్వారా మలేరియా వ్యాధిని నిర్ధారిస్తారు. వేరే వ్యాధుల్లోనూ మలేరియా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

కాబట్టి పారాసైటలాజికల్ టెస్టుల ద్వారా ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించొచ్చు. గర్భిణులు, చిన్నారులకు మలేరియా మరింత ప్రమాదకరం.

  • అకస్మాత్తుగా విపరీతమైన జ్వరం, ఆ తర్వాత చలితో గజగజ వణకడం, శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటం.
  • జ్వరంతో పాటు చెమటలు పట్టడం, బలహీనంగా అనిపించడం.
  • ఒకటి, రెండు, మూడు రోజుల వరకు జ్వరం వస్తూ ఉండటం.

మలేరియ జ్వరానికి నివారణ చర్యలు | Prevention Of Malaria In Telugu 

మలేరియా బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే.. వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించడం మేలు. ఇది ఎక్కువగా దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి దోమలు ఉండకుండా చూసుకోవాలి. ఇందుకోసం పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి.

దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రించే సమయంలో దోమ తెరలను ఉపయోగించాలి. కిటీకీలు, తలుపులకు నెట్‌లు బిగించొచ్చు. మస్కిటో రిపెల్లెంట్స్ క్రీములు, స్ప్రేలు వాడటం ఉపకరిస్తుంది.

ఘాటైన వాసనలను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి రోస్‌మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.

  • కచ్చితంగా రక్త పరీక్ష చేయించుకుని, సరైన చికిత్స తీసుకోవాలి.
  • డాక్టర్‌ని సూచించిన ఔషధాలు తీసుకోవాలి, ఔషధాలు సరైన మోతాదులో తీసుకోకపోతే మళ్లీ మళ్లీ సంభవించే అవకాశం ఉంటుంది.
  • ఇంటి పరిసరాల్లో దోమలు పెరకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార నియమాలు పాటించాలి. మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలి.
  • మలేరియాను నివారించడానికి మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.
  • ఇంటి వద్ద ఉన్న మురుగు గుంటల్లో నిలిచిన నీటిని తొలగించాలి.
  • దోమలు వృద్ధి చెందకుండా చూడాలి.
  • వర్షకాలం డ్రైనేజిల్లో నిలిచిన వర్షపు నీటిని ప్రవహించేలా చూడాలి.
  • గార్డెన్ ప్రదేశాల్లో  ఎప్పటికప్పుడు పురుగుల మందులను పిచికారీ చేస్తూ ఉండాలి.
  • ఇంటి పరిసరాల్లో నీరు పేరుకుపోకుండా  జాగ్గత్తలు తీసుకోవాలి.
  • నీటి ట్యాంకులపై దోమలు చేరకుండా సరిగ్గా మూత పెట్టాలి.
  • దోమలు ఇంటి లోపలకి రాకుండా తగు చర్యలు చేపట్టాలి.

మలేరియ జ్వరం రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రతలు పాటించాలి 

మలేరియా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ఉత్తమం. దోమతెరలను ఉపయోగించాలి, ఆ దోమ తెరలను కూడా శుభ్రంగా ఉతికినవే వాడాలి.

కిటీకీలు, తలుపులకు నెట్‌లు బిగించొచ్చు. మస్కిటో రిపెల్లెంట్స్ క్రీములు, స్ప్రేలు వాడటం ఉపకరిస్తుంది, ఘాటైన వాసనలను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి రోస్‌మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ద్రవాహారం తీసుకోవడం ముఖ్యం. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై, రోగాల బారిన పడకుండా ఉంటాం. వీధుల్లో అమ్మే అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం మానేయాలి.

మలేరియ  జ్వరం రావడానికి కారణం ఏమిటి | Malaria Fever Causes 

  • సోకని దోమ:మలేరియా ఉన్న వ్యక్తిని తినడం ద్వారా దోమ సోకుతుంది.
  • పరాన్నజీవి ప్రసారం:- ఈ దోమ భవిష్యత్తులో మిమ్మల్ని కుట్టినట్లయితే, అది మీకు మలేరియా పరాన్నజీవులను వ్యాపిస్తుంది.
  • కాలేయంలో:- పరాన్నజీవులు మీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, అవి మీ కాలేయానికి ప్రయాణిస్తాయి  ఇక్కడ కొన్ని రకాలు ఒక సంవత్సరం వరకు నిద్రాణంగా ఉంటాయి.
  • రక్తప్రవాహంలోకి:- పరాన్నజీవులు పరిపక్వం చెందినప్పుడు, అవి కాలేయాన్ని వదిలి మీ ఎర్ర రక్త కణాలకు సోకుతాయి. ప్రజలు సాధారణంగా మలేరియా లక్షణాలను అభివృద్ధి చేసినప్పుడు ఇది జరుగుతుంది.
  • తదుపరి వ్యక్తికి వెళ్లండి:- చక్రంలో ఈ సమయంలో వ్యాధి సోకని దోమ మిమ్మల్ని కుట్టినట్లయితే, అది మీ మలేరియా పరాన్నజీవులతో సంక్రమిస్తుంది మరియు వాటిని అది కుట్టిన ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది.

ఇలా ఇన్ని విధాలుగా దోమలు కుట్టడం ద్వారా మలేరియ అనేది వ్యాప్తి చెందడానికి కారణం అవుతుంది.

మీకు గాని మలేరియ కి సంభందించిన టాబ్లెట్ కావాలి అంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు

Malaria Tablet Online Link

గమనిక :- మీరు ఈ టాబ్లెట్స్ ని ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి, డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే మీరు ఈ టాబ్లెట్స్ ని వాడండి మీ సొంత నిర్ణయం తీసుకోకండి.  

ఇవి కూడా చదవండి :-