మగవారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ కు పనికిరారా ??

0

family planning operation in telugu :

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం భారత దేశ సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైనవి. చిన్న కుటుంబాలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ లు దర్శనమిస్తున్నాయి. ఈ చిన్న కుటుంబం లో తల్లి, తండ్రి మరియు ఇద్దరు సంతానం లేదా ఒక్కరు మాత్రమే సంతానంగా ఉంటున్నారు.

ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, రకరకాల పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని తమ సంతానానికి మంచి చదువు, మంచి తిండి, మంచి బట్టలు అందివ్వడానికి కేవలం ఒక్కరు లేదా ఇద్దరు సంతానం తర్వాత కుటుంబనియంత్రణ చికిత్స చేయించుకుంటున్నారు.

మన భారతీయ సమాజంలో చాలామంది పురుషులు గానీ స్త్రీలు గానీ ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి సిగ్గు పడతారు. అయితే ప్రతి వ్యక్తి మరియు స్త్రీ ఈ కుటుంబ నియంత్రణ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది.

family planning operation types in india :

కుటుంబ నియంత్రణ 2 పద్ధతులు గా ఉన్నది. మొదటిది తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి, రెండవది శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి.

1.తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి : తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి కొత్తగా పెళ్లి అయిన వారు, కొన్నాళ్ల పాటు పిల్లలు వద్దనుకుని లేదా కొంతకాలం సెక్సువల్ లైఫ్ ను ఎంజాయ్ చేయుటకు ఈ పద్ధతి పాటిస్తారు.
మరియు ఒక బాబు లేదా ఒక పాప పుట్టిన తర్వాతరెండవ సంతానం కోసం కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇవ్వటానికి కూడా ఈ తాత్కాలిక కుటుంబ నియంత్రణపద్ధతిని పాటిస్తారు.

ఈ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు చాలా రకాలున్నాయి.
అయితే బాగా ప్రాచుర్యం లో ఉండి ప్రభుత్వం ఆమోదం పొందినవి కొన్ని మాత్రమే ఉన్నాయి అవి
1. నోటి మాత్రలు
2.కాపర్ టీ లూపు
3. నిరోధ్
ఇవి అన్నీ కూడా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందజేస్తారు. వీటి కోసం మీరు స్థానికంగా ఉంటున్న ఆ ఏరియా లో ని ఆశా వర్కర్ లేదా ANM ను సంప్రదిస్తే సరిపోతుంది.

2.శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి : ఇక శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అంటే పూర్తిగా సంతానం అవసరం లేదు అనుకునే సమయంలో చేయించుకునే చికిత్స ను శాశ్వత కుటుంబనియంత్రణ చికిత్స అని అంటారు.
సాధారణంగా మన భారతీయ సమాజంలో ఎక్కువ భాగం మహిళలే ఈ చికిత్సను చేయించుకుంటారు, కానీ మహిళలకంటే పురుషులకే ఈ చికిత్స చాలా సులువుగా చేస్తారు.

వీటి గురించి ఒకసారి తెలుసుకుందామా !

family planning operation for male :

a.సులభతరమైన ప్లానింగ్ ::- మగవారికి చేసే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సను వేసెక్టమీ అని అంటారు.
ఈ ఆపరేషన్లో భాగంగా అతి సులువుగా ఒకే ఒక చిన్న గాటు/కోత తో పూర్తి చేస్తారు. దీనికంటే ముందు మగవారు అందరూ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అవగాహన కలిగి ఉండాలి. మరి దీని గురించి తెలుసుకుందామా!

b.పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ::- మగవారిలో సంతానానికి అవసరమైన వీర్య కణాలు వృషణాలలో తయారవుతాయి. ఈ వీర్య కణాలు వ్యాస్ అనే చిన్నపాటి నాళాలు లేదా గొట్టాల ద్వారా ప్రయాణం చేస్తాయి. ఈ గొట్టాలను కత్తిరించి వీర్యకణాలు వీర్యంతో పాటు బయటకు రాకుండా చేస్తారు. అసలు విషయం ఏమనగా వీర్యమనే ఈ ద్రవం అంతా ప్రోస్టేట్ గ్రంథిలో తయారవుతుంది. ఈ ద్రవంలో అంటే వీర్యంలో వీర్య కణాల శాతం కేవలం ఒక శాతం కంటే తక్కువగా ఉంటాయి.

c.నో స్కాల్ పెల్ ప్రాసెస్::- ఇది మరింత సులువైనది. సాధారణంగా మహిళలు చేయించుకునే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ను ట్యూబెక్టమీ అని అంటారు. ఇది మేజర్ శస్త్ర చికిత్స గా పేర్కొంటారు.మగవారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ను వేసెక్టమీ అని అంటారు. ఈ రోజుల్లో ఈ వేసెక్టమీ ఆపరేషన్ మరింత ఈజీ ప్రక్రియగా మారింది.

ఎలాగంటే ఈ నో స్కాల్ పెల్ ప్రాసెస్ ద్వారా వృషణాలలో అంటే మగవారి బీజకోశాలకు చిన్న గాటు/కోత పెట్టడం ద్వారా ఈ వేసెక్టమీ ఆపరేషన్ ను మరింత సులువుగా చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత కనీసం ఆ కోతకు కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు! మామూలుగా మన శరీరానికి తగిలిన అతి చిన్న గాయం ఎలా మానిపోతుందో ఈ కోత కూడా అలాగే మానిపోతుంది.

family planning operation misunderstandings ( అవగాహనాలోపం ) :-

మన సమాజంలో పూర్వం నుండి చాలా వరకు మూఢ నమ్మకాలు, అపోహలు రాజ్యమేలుతున్నాయి. అంతేకాక మన సమాజంలో మగతనం అనేది మగవారి గర్వానికి, గౌరవానికి ప్రతీకగా ఉంటుంది. అంటే భారతదేశ సమాజంలోనే ఓ కాలం నుండి వస్తున్న కొన్ని పద్ధతులు మరియు మూఢనమ్మకాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఇలాంటి వాటి వల్లనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం మన భారతదేశంలోనే ఎక్కువగా స్త్రీలకు చేసే విధంగా కొన్ని విపత్కర సామాజిక కట్టుబాట్లు మన సమాజంలో ఏర్పడ్డాయి.

కొసమెరుపు::- ఏమిటంటే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు స్త్రీలకు చేసే దానికన్నా మగవారికి చేయడం చాలా చాలా సులభం. స్త్రీలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ట్యూబెక్టమీ తో కంపేర్ చేస్తే మగవారికి చేసే వేసెక్టమీ ఆపరేషన్ చాలా చిన్నది, మరియు సులువైనది కూడా. ఈ రెండు ఆపరేషన్లలో స్త్రీలకు చెందిన ట్యూబెక్టమీ ఆపరేషన్ ను పెద్ద లేదా మేజర్ ఆపరేషన్ అంటారు.

Tubectomy ( ట్యూబెక్టమీ ) ::-

భార్యాభర్తలిద్దరూ ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ గురించి అవగాహన కలిగి ఉండడం చాలా మంచిది, కావున ట్యూబెక్టమీ గురించి తెలుసుకుందామా!

మహిళలు ఇక తమకు సంతానం వద్దు అనుకున్నప్పుడు స్త్రీ అంగీకారంతో చేయించుకునే ఆపరేషన్ను ట్యూబెక్టమీ శస్త్ర చికిత్స అని అంటారు. ఇందులో భాగంగా స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కీలక భాగాలైన ఫెలోపియన్ ట్యూబులు కత్తిరించడం గానీ లేదా వాటిని మూసుకుని పోయేలా క్లిప్ వేయడం కానీ చేస్తారు. ఈ ఫెలోపియన్ ట్యూబులు గర్భాశయం తో అనుసంధానించబడి ఉంటాయి.

చికిత్సలో భాగంగా ఎప్పుడైతే వీటిని కత్తిరిస్తారో వీటికి, గర్భాశయానికి సంబంధం తెగిపోతుంది, అప్పుడు ఫెలోఫియన్ ట్యూబ్ల ద్వారా మగవారి శిశ్నం నుండి విడుదలైన వీర్యంలో వీర్యకణాలు గర్భాశయంలోని అండాలతో కలవకుండా అవుతుంది. దీని ఫలితంగా స్త్రీల గర్భాశయంలో ఫలదీకరణ అనే ప్రక్రియ జరగదు. దీంతో పిల్లలు పుట్టడం అనేది ఇక ఎప్పటికీ జరగదు.

ఫ్యామిలీ ప్లానింగ్ అపోహలు నిజాలు :

సాధారణంగా మన దేశంలో ఈ మేల్ డామినేషన్ ఎక్కువ అంటే చాలామంది మగవారు స్త్రీలను చాలా తక్కువ స్థాయి గా అని చిన్నచూపు చూస్తూ ఉంటారు. మగవారు వేసెక్టమీ చేయించుకుంటే మగతనం తగ్గిపోతుంది అనేది ఓ పెద్ద అపోహ!
కానీ ఈ వేసక్టమీ లో మగతనానికి సంబంధించి ఏ అంగాన్ని కానీ అవయవాన్ని కానీ కనీసం తాకను కూడా తాకరు.
కేవలం వీర్యకణాలు ప్రయాణం చేసే వ్యాస్ అనే గొట్టాలు లేదా ట్యూబ్ లను మాత్రమే కత్తిరిస్తారు. ఈ చికిత్స వల్ల, ఈ చికిత్స చేయించుకున్న మగవారి మగతనానికి వచ్చే లోటు ఏమాత్రం ఉండదు.

అంతేగాక ఈ వేసెక్టమీ చికిత్స మీద ఉండే మరొక పెద్ద అపోహ ఏదంటే వేసెక్టమీ ఆపరేషన్ తర్వాత మగవారి శిశ్నం నుండి వీర్యం విడుదల కాదు అనే ఒక పెద్ద అపోహ ఉంది. ఈ శస్త్రచికిత్స తర్వాత పురుషుడు స్త్రీతో సంభోగం లో పాల్గొన్న తర్వాత వీర్యం తప్పకుండా విడుదల అవుతుంది, కానీ విడుదలైన వీర్యంలో వీర్య కణాలు లేదా శుక్రకణాలు ఉండవు. కాబట్టి సెక్స్ చేసిన తర్వాత గర్భం వచ్చే ఛాన్స్ ఉండదు!

అంతే కాకుండా ఈ శస్త్రచికిత్స తర్వాత మగవాడు గతంలో లాగానే స్త్రీతో శృంగార జీవితాన్ని గడపొచ్చు, మరియు సెక్సువల్ లైఫ్ ని మామూలుగా ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి నిరభ్యంతరంగా మగవారు అతి సులువైన ఈ వేసెక్టమీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవచ్చు.

కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో రకాల పనుల ఒత్తిడితో స్త్రీజీవితం అతలాకుతలమై పోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కుటుంబ నియంత్రణ పేరుతో స్త్రీలకు ఆపరేషన్ చేయించడం చాలా బాధాకరం.
అందుకే పురుషుల్లో చైతన్యం కలిగి వారు కూడా వేసెక్టమీ చేయించుకున్న అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.

పైన తెలిపిన వివరాలన్నీ స్త్రీపురుషులిద్దరికీ అవగాహన కోసం మాత్రమే

!! సర్వేజనా సుఖినోభవంతు !!