మాతృభాష వ్యాసం మీ అందరి కోసం !

0
Mathrubhasha Goppatanam Essay In Telugu

మాతృ భాష యొక్క గొప్పతనం ఏమిటి | Mathrubhasha Essay In Telugu 

Mathrubhasha Goppatanam Essay In Telugu :- మాతృభాష అనేది అమ్మతో సమానమైనది. మాతృభాష అమ్మ ద్వారానే మనకు తెలుస్తుంది. మాతృభాషను అందరూ గౌరవిస్తారు, అమ్మని మనం ఎంత ప్రేమగా, గౌరవంగా చూసుకుంటామో అదే విధంగానే మాతృభాషని కూడా గౌరవించాలి.

మాతృభాష అనగానే మనందరికి  తెలుగు భాష గుర్తుకు వస్తుంది. తెలుగు గడ్డ మీద జన్మించాలి  అంటే మనం అందరం ఏంతో అదృష్టం చేసుకొని ఉండాలి. తేనె కన్నా తీయనిది మన తెలుగు భాష.

ఇప్పుడు కాలంలో పిల్లందరు తెలుగు భాషకి దూరం అవుతున్నారు. ఏ కళాశాలలో చూసిన, బడిలో చూసిన ఒక ఇంగ్లీష్ కే ప్రాధ్యానత ఇస్తున్నారు, తెలుగు భాషకి ప్రాధ్యానత ఇవ్వడం లేదు. రాబోయే కాలంలో తెలుగు అనేది కనుమరుగు అవుతుంది అని చాల మంది తెలియచేసారు.

ముందు కాలంలో అయితే కళాశాలలో గాని, పాఠశాలలో గాని విద్యార్థులు అందరు వేమన పద్యాలు, సుమతి శతకాలు, సుభాషిత రత్నాలు, పెద్దబాల శిక్ష వీటన్నిటినీ చదివేవారు. కానీ ఇప్పుడు చదువుతున్నా పిల్లలు ఇటువంటివి ఏమి తెలియవు. ప్రతి ఒక్కరికి తమ భాష రావాలి. అప్పుడే మాతృభాష గొప్పదనం అంటే ఏమిటో తెలుస్తుంది.

మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని మనం ఎలా పాటిస్తున్నామో అలానే మన మాతృభాషని కూడా గౌరవించాలి, అనుసరించాలి. మనం ఎప్పుడు కూడా తెలుగు భాషనీ తక్కువగా చూడరాదు. తెలుగు భాషకి చాల చరిత్ర  ఉన్నదీ, తెలుగు భాష సంసృతం నుండి పుట్టినది.

తెలుగు భాషలో ఎందరో కవులు, రచయితలు గ్రంధ కర్తలు చాలా రచనలు చేశారు. ఇతర భాషలను  గౌరవించడమే తెలుగు భాష యొక్క గొప్పదనం. మనం బడికి వెళ్ళే సమయంలో ప్రార్ధన చేసే ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, తేనెల తేటల మాటలతో మన తెలుగు దేశ మాతనే కొలిచెదమా అంటూ తేట తెలుగులో పాటలు పాడేవారం. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు వచ్చి పిల్లలకు ఇవన్నీ దూరమవుతున్నాయి.

మన  భాషలో ఎన్నో గొప్ప భక్తి  గీతాలు, మహాభారతం, రామాయణం, భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్ని ఇప్పుడు పిల్లలకి ఇవి ఏంటో అని కూడా తెలియదు, మరికొన్ని రోజులు ఇలానే ఉంటే రామాయణం, మహాభారతం కనుమరుగు అవుతాయి.

భారత దేశంలో చాల రకాల భాషలు కలవు.  ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపిని  ఆస్వాదించ గలిగితే, వారు తప్పకుండ మాతృభాషను మరణించే వరకు గొప్పదనం గురించి గుర్తు పెట్టుకొంటారు. ఈ కాలంలో పిల్లలు ఇతర భాషనీ నేర్చుకోవాలి. కానీ మాతృభాషని మరిచిపోకూడదు, మాతృభాషకి ఉన్న ప్రాముఖ్యతను మరవరాదు.

తెలుగు భాష తియ్యదనం గురించి నేటి పిల్లలకి వివరించాలి.  కొన్ని పాటల్లో అయితే తెలుగు మధురిమ మనకు కనబడుతుంది.

నేటి గాయనిగాయకులు ఈ కాలం తగ్గటు గానే వారికి ఇష్టమైన పాటలు పడుతున్నారు. ఇప్పుడు ఉన్న పిల్లల కోసం తెలుగు గొప్పదనం గురించి తెలియజేస్తూ పాడాలి. అప్పుడే పిల్లలకి తెలుగు గొప్పదనం మీద గౌరవం వస్తుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి, వాళ్లు తెలుగు గొప్పదనం తప్పకుండ తెలుసుకోవాలి.

గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగుభాష కోసం ఎంత గానో కృషి చేశారు. ఈయనతో పాటు  కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు కూడా పోరాడటం జరిగింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు తన జీవితంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.

దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు అన్నాడు. ఆయన కాలంలో తెలుగు బాగా అభివృద్ధి చెందినది. శ్రీకాకుళ ఆంధ్రవిష్ణు అని పేరుపొందిన రాజు శ్రీకృష్ణ దేవరాయలు. ఇయన తెలుగుని ప్రోత్సహించారు. తెలుగులో పద్యాలు క్లుప్తంగా ఉంటాయి. అలాగే ఎంతో అర్థాన్ని కూడా ఇస్తాయి.

నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, తెనాలి రామకృష్ణ , ముక్కు నంది తిమ్మన, తిరుపతి వెంకట కవులు, వేమన, బమ్మెర పోతన లాంటి మహా మహులు తెలుగు లో రచనలు చేసి  జాతి గౌరవాన్ని, భాష స్థాయిని ఆకాశానికి ఎక్కించారు. తెలుగు మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21 నాడు ఘనంగా జరుపుకుంటారు.

మాకి అందిన information ప్రకారం, మీకు తెలియచేస్తున్నాం, మీకు ఎలాంటి సమాచారం కావాలి అనుకొన్న తెలుగు న్యూస్ పోర్టల్. కాంని రోజు విజిట్ చేస్తూ ఉన్నండి. మీకు అవసరమైన విషయాలను రోజు తెలియచేస్తూ ఉంటాం.

ఇవి కూడా చదవండి :-