మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ల, సినిమా స్టోరీ లీక్ అయ్యిందా?

0

మెగాస్టార్ చిరంజీవి,కొరటాల శివ దర్శకత్వంలోనటిస్తున్న చిత్రం పై ఒక ముఖ్యమైన న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. అటు చిరంజీవి అభిమానులు సినీ అభిమానులను ఈ న్యూస్ ఎంతో కలవరపెడుతోంది. 

వివరాల్లోకి వెళితే బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి యువకుడిగా కనిపించాలనే ది దర్శకుడి ఆలోచన, ఇప్పుడున్న పరిస్థితులలో మెగాస్టార్ వయసురీత్యా సాధ్యపడదని ఆ పాత్ర ని చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ తో చేయించాలని దర్శకుడు కొరటాల శివ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇదే విషయంపై మెగా అభిమానులు కలవర పడుతున్నట్లు సమాచారం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కి రామ్ చరణ్ కి చాలా వ్యత్యాసం ఉంది.కాకపోతే కొందరు అభిమానులు బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా, అని అనుమానలు  వ్యక్తం చేస్తున్నారు. అందువలన రామ్ చరణ్ ని తీసుకోవాలని కొరటాల శివ భావించి ఉంటారు. అని అంటున్నారు.

ఇప్పుడు ఈ హాట్ టాపిక్ లీక్ అవడంతో స్వయంగా దర్శకుడే ఈ సినిమాకు సంబంధించి,మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.ఈ సమావేశంలో లో ఈ న్యూస్ గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఈ స్టోరీ లైన్ కూడా మార్చాలని అనుకున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా లో చిరంజీవి మార్క్ డాన్స్ కానీ, కామెడీ కానీ, సైరా సినిమాలో లేవు. అందువలన తన నెక్స్ట్ మూవీ లో  వీటన్నిటికీ ప్రాధాన్యం ఉండాలని ముందుగానే కొరటాల శివకు చిరంజీవి గారు చెప్పడం జరిగింది.