చిరంజీవి తో కొరటాల శివ మూవీ ప్లాన్ అదిరింది

0

సైరా చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి  152 వ చిత్రం మొదలైంది.టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.చిరంజీవి గత రెండు చిత్రాలను నిర్మించిన రామ్ చరణ్,ఈ చిత్రానికి మాత్రం మ్యాట్ ని ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు.ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ ను సినిమాటోగ్రాఫర్గా తిరు ను అధికారికంగా ప్రకటించారు.

అయితే చాలామంది ఇది ఈ లిస్టులో లో కొరటాల శివ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పేరు లేకపోవడంపై ఆశ్చర్యపోయారు.ఇంతకుముందు కొరటాల శివ, అ రామ్ చరణ్ ల  కలయికలో సినిమాను అధికారికంగా ప్రకటించిన, కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీనికి కారణం రామ్ చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను  పెట్టుకున్నాడు అనే చాలామంది చెప్పారు.ఎందుకంటే కొరటాల శివ దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చిన అప్పటినుంచి దేవి శ్రీ ప్రసాద్ తోనే కలిసి పని చేస్తున్నారు.అలాంటిది రామ్ చరణ్ తమన్ ను పెట్టుకోవడం కొరటాలకు నచ్చలేదని చాలా మంది అభిప్రాయం. 

దేవి శ్రీ ప్రసాద్ గురించి కొరటాల శివ మాట్లాడుతూ దేవిశ్రీ అంటే  తనకు చాలా ఇష్టమని, సంగీత దర్శకుడిగా ఆయన ఉన్నప్పుడు, పాటల గురించి గానీ బ్యాక్గ్రౌండ్ సంగీతం గురించి తను పెద్దగా ఆలోచించని, కొరటాల శివ పలు సందర్భాల్లో చెప్పారు.అయితే  మెగా ఫ్యామిలీ తో కూడా దేవి శ్రీ ప్రసాద్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాతో మెగా ఫ్యామిలీ లోకి అడుగుపెట్టిన దేవిశ్రీప్రసాద్. ఆ తరువాత ఆ ఫ్యామిలీలోని హీరోలకి గుర్తుండిపోయే ఆల్బమ్స్ ఇచ్చాడు.

ఇప్పటికీ ప్రేక్షకులు కూడా మెగా హీరోతో దేవిశ్రీ జతకడితే ఆల్బం హిట్ అని నమ్ముతారు.మెగా ఫ్యామిలీ తో ఇంత అనుబంధం ఉన్నప్పటికీ,మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, అ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ పేరు లేకపోవడమేoటని అందరిలో అనుమానం మొదలయ్యింది.చిరంజీవి పక్కన పెట్టారా, నిర్మాతలు వద్దనుకున్నారా,అన్న ప్రశ్నలపై కొరటాల శివ గారే చెప్పాలి.

 టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నా దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముందున్నమ్యాజిక్ ను చూపించలేక పోతున్నాడని చాలామంది కామెంట్ చేశారు.కానీ తనని నమ్మిన వారిని దేవి శ్రీ ప్రసాద్ ఎప్పటికైనా మంచి సంగీతం అందిస్తాడని.. అందుకే సుకుమార్, కిషోర్ తిరుమల వంటి స్టార్ డైరెక్టర్లు దేవి శ్రీ ప్రసాద్ ని ఏరికోరి పెట్టుకుంటారు.అయితే తాజాగా ఇప్పుడు చిరు సినిమాతో కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ల  హిట్ కాంబో కి బ్రేక్ పడనుందా, చిరు 152 సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు.