సైర భారీ డిజాస్టర్ గ పయనిస్తోంది

0

మెగాస్టార్ చిరంజీవి .స్వాతంత్ర సమర యోధుడు గా నటించిన ,సైరా నరసింహారెడ్డి,చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది .మొదటిరోజే రెండున్నర కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం,భారీ విజయం సాధిస్తుందని, అందరూ అనుకున్నారు. కాకపోతే రెండవ రోజు కలెక్షన్స్ చతికిల పడ్డాయి.మెగాస్టార్ చిరంజీవి మూవీ కావడంతో మొదట ఆ హడావుడి బాగా కనిపించింది,సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ అంటూ ప్రకటనలు వచ్చాయి.ఇదిలా ఉండగా తెలుగులోనే తొలిరోజు వచ్చిన కలెక్షన్లు రెండవ రోజు లేకపోయినా సైరాకు ఇప్పుడు వీకెండ్ దిక్కుగా ఉంది.మొత్తం మీద తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న డౌట్ ఉంది. 

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ కావడంతో, ఆయన మీద అభిమానంతో  సైరా మూవీ బ్లాక్ బస్టర్ అని కితాబు ఇచ్చారు.నిమ్మదిగా వాస్తవాలు బయటపడుతున్నాయి.సైరా మూవీ ని బాహుబలి తో పోల్చలేము అని తొలిరోజే కొంతమంది సినీ ప్రముఖులు అంగీకరించారు. ఇప్పుడు ఏకంగా ఫ్లాప్ కాదు డిజాస్టర్ అని అంటున్నారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఫలితం మాత్రం తేడా కొట్టేసిందని క్లారిటీ వచ్చేసింది.సైరా అక్కడ భారీ డిజాస్టర్ దిశగా పయనిస్తుందని అంటున్నారు.మొదటిరోజే రెండున్నర కోట్లు వచ్చిన ఈ మూవీ రెండవ రోజు కోటికి  అటు ఇటుగా కలెక్షన్ పడిపోయింది.ఇక మూడవ రోజు కూడా వరసగా కలెక్షన్ డ్రాప్ అవుతూనే ఉంది. దీంతో వీకెండ్ ఈ మూవీని కొంచమైనా ఆదుకుంటున్న అశలు పెద్దగా లేవు,ఇక బాలీవుడ్ పాతిక కోట్లు షేర్ రాబట్టాలి సీన ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేసిన మూడవ వంతు అయినా వసూలు అవుతుందా అన్న బెంగ బయ్యర్లకు పట్టుకుంది /

 

అమితాబచ్చన్ లాంటి వారిని పెట్టుకున్న,బాహుబలి రేంజ్ బిల్డప్ ఇచ్చిన, అక్కడ మీడియా పూర్తి అనుకూలంగా రాసిన కూడా ఎందుకో బాలీవుడ్లో మాత్రం సైరా చతికిలపడింది .సాహో ఇక్కడ సూపర్ హిట్ ఆయీ వంద కోట్లకు పైబడి వసూలు సాధించింది.అదే సైరా తీసుకుంటే 10 కోట్లు అయినా వస్తాయా అన్న డౌట్ పట్టుకుంది.మొత్తానికి బాలీవుడ్ మన మెగాస్టార్ కి కలిసిరాదని మరోమారు రుజువైంది