కరోనా నిర్ధారణకు కిట్ – భారత మహిళ తొలి గెలుపు

1
minal dakhave bhosale

CORONA KIT : ప్రపంచాన్ని అతి తీవ్రంగా భయపెడుతున్న కోవిడ్- 19 వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో, అంతే వేగంతో ప్రపంచంలోని అన్ని దేశాలు మందు తయారీ కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. అయితే మందు కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా?? అయితే మీ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తున్నది ప్రముఖ వైరాలజిస్ట్.

పూణేలోని “మై ల్యాబ్ డిస్కవరీ” అనే డయాగ్నస్టిక్ కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చీఫ్ గా పనిచేస్తున్న మినల్ దఖావె భోశాలే ( minal dakhave bhosale) . ఈమె కేవలం 42 రోజుల లోపే కరోనా వ్యాధి కిట్ ను కనిపెట్టారు. ఈ కిట్ పేరే “పాథోడిటెక్ట్.” “మై ల్యాబ్ డిస్కవరీ” డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ వాంఖడే ఇలా చెప్పారు. 42 రోజుల సమయం అనేది చాలా రికార్డు. ఈ రికార్డు ఘనత ఆమెకే చెందుతుంది.

మొట్టమొదటిది:- ఈమె రూపొందించిన ఈ కిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆమోదం పొందింది.

విశేషాలు:-

  1. ఈ కిట్టు తయారు చేసే ప్రయోగం పనుల్లో ఉన్నప్పుడు ఈమె నిండు గర్భిణీ.
  2. ఇలాంటి సమయంలో ఈ ప్రయోగాలు చేసినప్పుడు ఆమెకు ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురై హాస్పిటల్లో చేరింది.
  3. “మై లాబ్ డిస్కవరీ” యాజమాన్యం కరోనా కిట్ తయారుచేయాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల, ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న ఈ వైరస్ వ్యాధి నిర్ధారణకు ఎన్ని కష్టాలు ఎదురైనా కిట్టు తయారు చేయాలనే ఉద్దేశంతో ఛాలెంజ్ గా తీసుకుని దేశ సేవ కోసం రూపొందించానని ఆమె పేర్కొన్నది.
  4. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే పదిమందిని టీంగా కలుపుకొని రాత్రి పగలు కష్టపడి భారత్ లో తయారైన మొట్టమొదటి కిట్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.
  5.  కేవలం 42 రోజుల లోపే దీన్ని తయారు చేసి రికార్డు సృష్టించింది.
  6. మార్చి 18వ తేదీన ఈ కిట్ యొక్క ఫార్ములాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి అప్పగించింది.
  7. మరో ప్రత్యేక విశేషమేంటంటే మార్చి 19వ తేదీన చిన్నారి పాపాయి కి జన్మనిచ్చింది.

కిట్టు కెపాసిటీ:-

  • ఇంతవరకూ వ్యాధి నిర్ధారణ కోసం ఉపయోగించే కిట్లను కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహి స్తూ వ్యాధి నిర్ధారణ చేసుకొనే వాళ్ళు, ఎందుకంటే ఈ కిట్లు మన దగ్గర లేకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ప్రధాన కారణం.
  • మనం ఇంతవరకు దిగుమతి చేసుకున్న విదేశీ కిట్ ఒక్కో దాని ధర 4,500 రూపాయలు.
  • మన భారత్ లో తయారైన ఈ పాధో డిటెక్ట్ కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే.
  • ఇదే కాక విదేశీ కిట్లో ఫలితం రావడానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టేది కానీ మన స్వదేశీ కిట్ తో కేవలం రెండున్నర గంటల్లో నే వ్యాధి నిర్ధారణ ఫలితం తెలుస్తుంది .
  • ఈ మన స్వదేశీ కిట్ తో 100 శాంపిల్స్ పరీక్షించవచ్చు అని ప్రయోగశాల నిపుణులు తెలిపారు.
  • మొదటి విడతలో 150 డిటెక్ట్ కిట్ లను తయారు చేశారు. వీటిని ముంబై, ఢిల్లీ, బెంగళూర్, గోవా లాంటి నగరాలకు పంపారు.
  • ఇలా ఈ కిట్ రూపొందించింది ఒక భారతీయ మహిళ అని, దీన్ని భారతదేశ గెలుపు గా భావిస్తున్నారు. ఇది నిజంగానే మన భారతీయులందరికీ కీర్తి కిరీటం.
  • ప్రస్తుతం దేశమంతా పాటిస్తున్న లాక్ డౌన్ పరిస్థితి దేశానికే కాదు నాకు కూడా ఎంతో బాధను కలిగించింది. అందుకే దీన్ని ఒక సవాల్ గా తీసుకున్నాను అని చెప్పారు మినల్ గారు.
  • మినల్ గారిని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు, బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా లాంటి వారు ఈమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లైతే ఇతరులకు షేర్ చేయండి. కరోనా వైరస్ న్యూస్ కోసం తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్ సైట్ లో చూడవచ్చు.