మీకు జన్ధన్ అకౌంట్ ఉందా? అయితే మీరు డబ్బులు డ్రా చేయలేరు?

0

🌷జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు విత్‌డ్రాపై కేంద్రం ఆంక్షలు🌷

 జన్‌ధన్‌ మహిళల ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. బ్యాంకులు, ATM ల వద్ద భారీగా గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు.. అకౌంట్ చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 3న నగదు విత్ డ్రా చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.

అలాగే, ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవాళ్లయితే ఈ నెల 4వ తేదీన, అకౌంట్ నెంబర్ చివరన 4 లేక 5 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 7వ తేదీన; అలాగే, అకౌంట్ నెంబర్ చివరన 6లేక 7 సంఖ్య ఉన్నవాళ్లయితే ఈ నెల 8వ తేదిన, ఎనిమిది లేదా 9 అంకె ఉన్నవాళ్లు అయితే ఈ నెల 9న నగదును విత్ డ్రా చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 9 లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు ఆ తర్వాతైనా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ అకౌంట్ ల్లో 3 నెలల పాటు రూ.500 చొప్పున జమచేస్తున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. AP లో జన్‌ధన్‌ఖాతాదారుల సంఖ్య 1,18,55,366 ఉండగా.. తెలంగాణలో 52,23,218 మంది ఖాతాదారులు ఉన్నారు.

బ్రేకింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి “తెలుగు న్యూస్ పోర్టల్”.