పంచాయతి రాజ్ & గ్రామీణాభివృద్ధిలో శాఖలో భారీగా ప్రాజెక్ట్ ఆఫీసర్స్ జాబ్స్| NIRDPR Notification 2025 Telugu

0
nirdpr notification

ఫ్రెండ్స్ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 1992 సంవత్సరంలో ప్రారంభించారు.గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం,పేదరికాన్ని నిర్మూలించడం, వారికీ మౌలిక సదుపాయాలను కల్పించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA), ప్రముఖ గ్రామీణ గృహ నిర్మాణ పథకం (PMAY-G),దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY-NRLM) వంటి పథకాలు ఈ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ లో ముఖ్యమైన పథకాలుగా చెప్పుకోవచ్చు.

ఈ వ్యవస్థలో కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చించి.ఇంతకి ఆ నోటిఫికేషన్ దేని గురించి, ఎన్ని జాబ్స్ వదిలింది, వాటికీ ఎలా అప్లై చేసుకోవాలి? అనే వాటి గురించి వివరంగా క్రింద తెలుసుకుందాం.

NIRDPR Notification 2025 

ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి 33 జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్,ప్రోగ్రామ్ ఆఫీసర్,ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ మార్కుల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఇంతకీ ఆ జాబ్స్ కి స్యాలరి ఎంత, రిజర్వేసన్ లు ఏవైనా ఉన్నాయా? అనే విషయాల గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOName of the PositionNumber Of PositionsSalary
1Programme Officer- Works11,90,000/-
2(Timely payment, MIS and DBT)11,90,000/-
3Project Officer – Works (NRM/Convergence)11,40,000/-
4Project Officer (Research)11,40,000/-
5Project Officer (Legal)11,40,000/-
6Project Officer (IEC)21,40,000/-
7Project Officer (Planning and Monitoring)21,40,000/-
8Project Officer (Finance)21,40,000/-
9Project Officer Works (SECURE)21,40,000/-
10Project Officer (Timely payment, MIS and DBT)41,40,000/-
11Project officer (Capacity Building/
CFP/Unnati/HR/Public Grievance/Training)
51,40,000/-
12Project Officer (Social Audit and Ombudsperson)51,40,000/-
13Junior Project Officer (Planning and Monitoring)11,00,000/-
14Junior Project Officer (IEC)11,00,000/-
15Junior Project Officer (Finance)11,00,000/-
16Junior Project Officer- Geo- MGNREGA/GIS21,00,000/-
17JuniorProject Officer- Works11,00,000/-
Total33

 

Eligibility

ఫ్రెండ్స్ మనం ఏ జాబ్ కి అయిన అప్లై చేసుకోవాలి అంటే ఒక అర్హత అనేది ఉండాలి.అలాగే ఈ జాబ్స్ కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి అవి ఏంటి అంటే:

.వయస్సు 18 అండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

.ఏదైనా డిగ్రీ లేదా పీజీ లేదా బిటెక్ చేసి ఉండాలి.

Note: ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి ఇందులో వయో పరిమితి ఉండదు.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

ఆధార్ కార్డు. 
టెన్త్,ఇంటర్,పిజి సర్టిఫికెట్స్. బిటెక్ చేసి ఉంటె వాటి సర్టిఫికెట్స్
మీకు ఏదైనా ఎక్స్పిరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్

Application Fees

ఫ్రెండ్స్  ఏ జాబ్స్ కి అప్లై చేసిన అప్లికేషన్ ఫీజు అనేది తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుంది. దీనికి కూడా అప్లికేషన్ ఫీజు ఉంది. అది ఎంత అంటే:

జనరల్,ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 300/

ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు ఉండదు. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

Important Dates  

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

మార్చి 19 2025 తేదీలోగా ఆన్లైన్లో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఎటువంటి TA,DA చెల్లించబడవు.

Job Selection Process

ఫ్రెండ్స్ NIRDPR ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నా అభ్యర్థులలో మెరిట్ మార్క్స్ ఉన్న వారిని ఎంపిక చేసుకొని రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ  నిర్వహించి జాబులో జాయిన్ చేసుకుంటారు.

Note:ఇందులో జాబ్స్ పొందిన వారికి హైదరాబాదులోని NIRDPR సంస్థలో జాబ్ చేయాల్సి ఉంటుంది.

Apply Process

ఈ జాబ్స్ పై  ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

NIRDPR Notification 2025