జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం – నమోదు & కుటుంబ ఉపాధి కార్డు నమోదు దరఖాస్తు

0

NREGA job card application form in telugu : MGNREGA మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఏమిటి ఎలా అప్లై చేయాలి క్రింద ప్రాసెస్ నుండి తెలుసుకుందాం! మీరు ఉంటున్న పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకానికి అప్లై చేయడానికి మీరు 18 సంవత్సరాలు దాటిన వారు అయి ఉండి ఉపాధి హామీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే క్రింద విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు.

  1. మీ గ్రామ పంచాయతీ కి వెళ్లి ఉపాధి హామీ (NREGA ) అప్లికేషన్ తీసుకొని దానిని నింపి రసీదు తీసుకోవాల్సి ఉంటుంది.
  2. మీరు అప్లికేషన్ నింపేటప్పుడు ఏ ఏ సమయాలలో మీరు పని చేయగలరు ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. మధ్యాహ్న సమయాల్లో పని చేయాల్సిన అవసరం లేదు.ఒక పూట మాత్రమే పని ఉంటుంది. (సుమారు 4 గంటల పని)
  3. మీ పంచాయతీ వారు మిమ్మల్ని వెరిఫై చేసి ఇందు కొరకు మీకు జాబ్ కార్డ్ అనేది ఇస్తారు.
  4. జాబ్ కార్డు కొరకు మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ జాబ్ కార్డు పోతే మరల అప్లై చేసుకోవచ్చు.
  5. మీరు అప్లికేషన్ ఇచ్చిన 15 రోజుల లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి మీకు పని కల్పించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీకి ఉంటుంది.
  6. మీకు సంవత్సరానికి తప్పనిసరిగా కనీసం 100 పని దినాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ కనీస పరిమితి 100 రోజులు ఒక వ్యక్తి చొప్పున కాకుండా ఒక కుటుంబం మీద పరిమితిని లెక్కిస్తారు.
  7. ఒకవేళ మీరు అప్లై చేసిన 15 రోజుల సమయానికి మీకు పని కల్పించడంలో మీ పంచాయతీ విఫలమైతే మీకు తదుపరి రోజు నుండి UNEMPLOYMENT ALLOWANCE అనగా నిరుద్యోగ భృతి వస్తుంది.
  8. మీకు కల్పించే పనిని ఐదు కిలోమీటర్ల లోపు పరిధిలో కల్పించాల్సి ఉంటుంది.
  9. ఒకవేళ అంతకన్నా ఎక్కువ దూరం అయితే మీకు 10 శాతం ఎక్కువ జీతం చెల్లించాల్సి ఉంటుంది.
  10. పురుషులకు మహిళలకు సమాన వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
  11. ఇక మీరు పనిచేసే చోట పసి పిల్లలను చూసుకోవడానికి స్థలం, మంచినీరు మరియు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి సదుపాయాలు కల్పించాలి.
  12. ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినా హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.
  13. జీతాలు ప్రతివారం చెల్లించబడతాయి.
    ఒకవేళ క్లిష్ట పరిస్థితుల వల్ల వారం లోపు చెల్లించ లేకపోతే పక్షం(15 రోజులలో) గడువులో తప్పనిసరిగా చెల్లించాలి.
  14. ఇటీవల కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని పెంచింది.
    ప్రతి రోజు కనీస వేతనం 202 రూపాయలు( రోజుకి) చెల్లించాల్సి ఉంటుంది.
  15. కరోనా సమయంలో ఉపాధి హామీ పథకానికి ఎక్కువ డిమాండ్ పెరిగింది.
  16. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ పనులు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
  17. తదనుగుణంగా ప్రభుత్వం పని అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని పేర్కొంది. వలస కార్మికులకు కూడా ఉపాధిహామీ జాబ్ కార్డు ఇవ్వాలని ఇటీవల ఏపి ప్రభుత్వం అధికారులకు తెలిపింది.

మీరు ఈ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం – ఆంధ్రప్రదేశ్ కింద మీ కుటుంబాన్ని నమోదు చేయించుకోవాలి అంటే ఈ కింది లింక్ లో ఇచ్చిన అప్లికేషను ను నింపాల్సి ఉంటుంది. మరి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

Application Link