ప్రేమించిన అబ్బాయిని ఒక పార్కులో చితకబాదిన అమ్మాయి .

0

అమ్మాయిలు, అబ్బాయిలు, ఎందుకు ప్రేమించుకుంటారు,అర్థం కావడం లేదు.వాళ్ల ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో తెలీదుకానీ  పిచ్చపిచ్చగా ప్రేమిస్తున్నా మని బిల్డప్పులు కొడుతుంటారు .అవసరం తీరాక ఒకరిపై ఒకరికి అనుమానాలు పుడుతుంటాయి .అవసరం అనేది శరీరకంగా, గాని ఆర్థికంగా గాని ఉండవచ్చును .చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా,భార్యాభర్తల సంబంధం గురించి  అర్థం చేసుకోలేక విడిపోతున్నారు .

ఇప్పుడున్న జనరేషన్ లో ఎప్పుడు  ప్రేమించుకుంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో  సరిగా వాళ్ళకే అర్థం కావడం లేదు.ఇప్పుడున్న యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది ఆకర్షణ వల్ల పుడుతున్నాయి గాని, నిజమైన ప్రేమ వల్ల మాత్రం కాదు.ప్రేమించుకున్నాం అని బ్రతికే వాళ్లంతా ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఇక ప్రేమించుకున్న వారు వేరే వ్యక్తితో మాట్లాడితే చాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇలాంటి సంఘటన ఒకటి ఇప్పుడూ బయటకు వచ్చింది.ప్రేమించిన వాడు తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో ఓ ప్రియురాలు వారున్న ప్రదేశాన్ని కూడా మర్చిపోయి అతనిని  చితకబాదిoది.ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే, అమెరికాలో ఒక పార్క్ లో జరిగింది.ఇక వివరాల్లోకి వెళితే తను ఎంతగానో ప్రేమిస్తున్న అబ్బాయి తనను మోసం చేస్తున్నాడు అనే అనుమానంతో,ఆ అనుమానం తొలగించుకోవాలని అని, ఉదయాన్నే పార్కుకు రమ్మంది.ఆ పార్కులో కలుసుకున్న ఇద్దరూ  ఆ అబ్బాయి ఫోన్ లో వివరాలు చూడటానికి ప్రయత్నించింది. అయితే అతని ఫోన్ కి ఫేస్ లాక్ చేసి ఉంది.

 ఆ లాక్ తీయమని ప్రేమగా అడిగిన ఆ ప్రియుడు ససేమిర అనడంతో, తనకు పట్టరాని కోపం వచ్చింది. అ లాక్  తీయటానికి ప్రయత్నిస్తూ, ఫోన్ కు అతని మొహం చూపించ బోయింది.కానీ తన ప్రియుడు మొహo చాటేయడంతో,దీంతో  చిర్రెత్తిన ఆమె అతని కింద పడేసి బలవంతంగా ఫోన్ లాక్ తీసింది. ఆ వెంటనే ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది.ఆ పార్కులోనే ఉన్న ఒక వ్యక్తి ఈ సంఘటన మొత్తం వీడియో తీశాడు. 

సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఈ ప్రేమ జంటను ఆడుకుంటున్నారు.