మీ యొక్క పాన్ కార్డ్ ను ఆధార్ తో లింక్ చేశారా? లేదా ? ఐతే మీ పాన్ కార్డ్ ఇక చెల్లదు !

0

aadhaar pan linking latest news :

ఆధార్ యొక్క రాజ్యాంగ ప్రామాణికతపై తన తీర్పును తెలియజేసినపుడు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి సుప్రీంకోర్టు (ఎస్సీ) అనుమతించింది. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేయడానికి మరియు కొత్త పాన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ తప్పనిసరి అని సుప్రీం కోర్టు తెలిపింది.

డిసెంబర్ 30, 2019 నాటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) నోటిఫికేషన్ ప్రకారం, పాన్‌కార్డ్ ను ఆధార్‌తో అనుసంధానించే గడువును మార్చి 31, 2020 వరకు మూడు నెలల వరకు పొడిగించారు. మీరు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయకపోతే, ఈ ఏప్రిల్ 1, 2020 నుండి పాన్ పనిచేయదు. అయినప్పటికీ, ‘పనిచేయని’ అనే పదానికి ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని గుర్తుంచుకోండి.

ఏప్రిల్ 1, 2019 నుండి ఐటిఆర్ దాఖలు చేసేటప్పుడు ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వకపోతే ఆధార్ నంబర్‌ను కోట్ చేసి లింక్ చేయడం తప్పనిసరి. చార్టర్డ్ అకౌంటెంట్ల ప్రకారం, ఒక వ్యక్తి మొదట రెండింటినీ లింక్ చేయకుండా వారి ఐటిఆర్‌ను దాఖలు చేయలేరు.

how to link pan card with aadhaar online in telugu :

మీ యొక్క పాన్ కార్డ్ ను ఆధార్ తో లింక్ చేయటం తెలుసుకుందామా. మీరు ఇప్పటికే ఆదాయపు పన్ను లేదా ఇ-ఫైలింగ్ వెబ్సైట్ లో రిజిస్టర్డ్ యూజర్ ఐతే, పన్ను రిటర్న్ లను దాఖలు చేస్తుంటే లేదా ఇంతకు మునుపు ఆదాయపు పన్ను మదింపు సంవత్సరాల లో ఐటిఆర్ దాఖలు చేసినప్పుడు, మీ యొక్క పాన్ కార్డ్ ఇప్పటికే ఆధార్ కార్డు తో అనుసంధానం చేసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు వివరాలు ఇప్పటికే అందుబాటులో ఉంటే కనుక ఈ పనిని ఆదాయపు పన్ను శాఖ చేస్తుంది.

ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in ని సందర్శించడం ద్వారా రా మన యొక్క ఆధార్ ఇప్పటికే మన పాన్ కార్డు తో లింక్ చేయబడిందా లేదా అని మనం తనిఖీ చేసుకోవచ్చు.

పాన్ కార్డు నెంబర్ ను యూజర్ ఐడి గా మరియు మీ పుట్టిన తేదీని పాస్వర్డ్ గా నమోదుచేసి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత అందులో ప్రొఫైల్ సెట్టింగులు అనే టాబ్ పైన క్లిక్ చేసి అందులోనే చివరి సెలెక్ట్ ఆప్షన్ link aadhar ను ఎంపిక చేసుకోండి.

 


అప్పుడు “మీ పాన్ నెంబర్ ఇప్పటికే ఆధార్ నెంబర్××××1234 కు లింక్ చేయబడింది” అనే సందేశాన్ని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒకవేళ మీ పాన్ ఆధార్ తో లింక్ కాకపోయి ఉంటే అప్పుడు పాన్ రికార్డుల ప్రకారం మీరు పూర్తి వివరాలు, అంటే పేరు, పుట్టిన తేదీ మరియు లింగం వంటి వివరాలు నమోదు చేయాల్సిన ఒక ఫారం కనిపిస్తుంది.
తర్వాత మీ ఆధార్ నెంబర్ను తెరపై కనిపించే captcha code ను నమోదు చేసిన తర్వాత (సబ్మిట్) సమర్పించు పై క్లిక్ చేయండి. సమర్పించిన తర్వాత స్క్రీన్ మీద విజయ సందేశం చూపించబడుతుంది.

ఇంతవరకు వివరాలను నమోదు చేయని వినియోగదారుల కోసం మీరే ఇ-ఫైలింగ్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు.
మీ పాన్ మరియు ఆధార్ లను లింక్ చేయగల మరొక మార్గం ఉంది. ఇ-ఫైలింగ్ వెబ్సైట్ యొక్క హోమ్ పేజీలో మరియు ఆదాయపన్ను వెబ్సైట్ http://incometaxindia.gov.in/Pages/default.aspx లో కూడా హైపర్ లింక్ అందించబడుతుంది.

ఇప్పుడు ఇ-ఫైలింగ్ వెబ్సైట్లోని లింక్ ఆధార్ పై క్లిక్ చేయండి. మీరు వివరాలు నమోదు చేయాల్సిన చోట కొత్త ఫారం కనిపిస్తుంది. ఆ ఫారంలో పాన్ ఆధార్ నెంబర్, ఆధార్ ప్రకారం పేరు నమోదు చేయాలి. అయితే మీ ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే అప్పుడు మీరు “నాకు ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది” అనే ఎంపికను టిక్ చేయాలి.


తర్వాత క్యాప్షన్ కోడ్ ను నమోదు చేసి సమర్పించు పై క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత “మీ పాన్ విజయవంతంగా ఆధార్ తో అనుసంధానించబడింది” అనే సందేశం తెరపై చూపిస్తుంది.

ఇలా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం పైన తెలిపిన పద్ధతులే కాక ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి తెలుసుకుందామా!!

1). ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ యొక్క ఈ ఫైలింగ్ వెబ్ సైట్ ను ఉపయోగించి పాన్ సర్వీస్ ప్రొవైడర్ లకు sms పంపడం ద్వారా మీయొక్క పాన్ ను ఆధార్ తో లింక్ చేయవచ్చు! లేకపోతే ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. మీరు పాన్ సర్వీస్ ప్రొవైడర్ లలో ఎన్ ఎస్ డి ఎల్ ఇ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లేదా యు టి ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITL) కు ఎస్ఎంఎస్ పంపవచ్చు.

sms పంపడం ఎలాగో చూద్దామా:  ( aadhar pan link with sms )

UIDPAN<SPACE> <12అంకెల ఆధార్> < SPACE> <10 అంకెల పాన్> అని నిర్దిష్ట ఆకృతిలో ఎస్ఎంఎస్ లు 567678 లేదా 56161 లకు పంపవచ్చు.

ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 111122223333 మరియు మీ పాన్ AAAPA9999Q అయితే అప్పుడు మీరు 567678 లేదా 56161 కు sms పంపాలి. ఇలా ఎస్ఎంఎస్ పంపినందుకు ఎన్ ఎస్ డి ఎల్ కానీ యు టి ఐ లు లు మీకు ఎలాంటి చార్జీలు విధించవు. కానీ మీ ఫోన్ యొక్క మొబైల్ ఆపరేటర్ విధించే ఎస్ఎంఎస్ చార్జీలు వర్తిస్తాయి.

2). ఎవరికైనా ఇతర పద్ధతుల ద్వారా ఆన్ మరియు ఆధార్ యొక్క డేటా లోనే సమస్యలను పరిష్కరించలేక పోతే ఇలాంటి సమస్యల పరిష్కారానికి సిబిడిటి ఒక మ్యాన్యువల్ పద్ధతిని పేర్కొన్నది.

ఇందుకోసం మీరు ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ లేదా nsdl pan download లేదా utiitsl pan download యొక్క సేవా కేంద్రాన్ని అవసరమైన పత్రాలతో సంప్రదించవచ్చు. అయితే ఇందుకు ఆన్లైన్ సేవల మాదిరి కాకుండా నిర్ణీత రుసుము చెల్లించాలి. ఇందులో ఏవైనా సవరణలకు ఒక రుసుము(ఫీజు) పాన్ ఆధార్ లింక్ లకు ఒక రుసుము అనేది ఆధారపడి ఉంటుంది.

అంటే పాన్ వివరాల్లో ఏవైనా మార్పులు చేర్పులకు 110 రూపాయలు, ఆధార్ వివరాలను మార్పిడి చేయుటకు 25 రూపాయలు చార్జీ వసూలు చేస్తారు. ఈ రెండూ కాకుండా మరియు ఆధార్ లో సరిపోలనటువంటి మార్పులు ఏవైనా ఉంటే ఇందుకు బయోమెట్రిక్ (వేలిముద్రలు) తీసుకుంటారు.

ఇక ఈ ప్రక్రియలు అన్నింటికీ రెండు గమనించాల్సిన అంశాలున్నాయి. ఈ ఆన్లైన్ ప్రాసెస్ లో ఒకవేళ మీ పాన్ కార్డులో పేరు సరిపోల్చి కపోతే మీ ఆధార్ కు ఓటిపి వస్తుంది.అయితే ఈ ఓటిపి అనేది మీ ఆధార్ నెంబర్ కు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ కు మాత్రమే వస్తుంది.

కాబట్టి పాన్ మరియు ఆధార్ యొక్క డేటా లో ఏదైనా తేడా ఉన్నట్లయితే ముందుగా ఈ రెండు సంఖ్యలను లింక్ చేయడానికి ప్రయత్నించే ముందు మీరు వాటిని సరిదిద్ది ఉంటే మంచిది.