తగ్గిన పెట్రోల్ ధరలు…వాహనదారులకు ఇంకా పండగే పండగ

0

మీరు టు వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ నడుపుతుంటారా ? అయితే మీకు గుడ్ న్యూస్ ఎలాంటి న్యూస్ అంటే ఆశ్చర్యం తో అదిరిపోయే న్యూస్. కొండెక్కిన పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా కిందకు దిగి వస్తున్నాయి గడచిన రెండు నెలల నుండి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు వారం రోజుల నుండి భారీగా తగ్గుతున్నాయి.

రెండు నెలల క్రిందట 76 రూపాయలు ఉన్న పెట్రోలు మొన్నటి వరకు 80 రూపాయలకు చేరింది అలాగే డీజిల్ ధర 66 రూపాయలు ఉన్నది, ఒక్కసారిగా 75 రూపాయలకు చేరింది కానీ ప్రస్తుతం అవి ధరలు ఇప్పుడిప్పుడే కొండ దిగుతున్నాయి.

దీంతో ఈ రోజు అనగా శుక్రవారం వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటర్కు 18 పైసలు తగ్గగా డీజిల్ ధర లీటర్కు 20 పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గడం వల్లే ఈ ధరల తగ్గుదలకు కారణమని భావిస్తున్నారు.

ఇంకా విజయవాడ అమరావతి లో కూడా ఈ తగ్గిన పెట్రోలు డీజిల్ ధరలు కొనసాగనున్నాయి. ఈ తగ్గింపు ధరలతో పెట్రోల్ 79.38 చేరగా డీజిల్ ధర 73. 27 కు చేరింది. ఏదిఏమైనప్పటికీ చాలా రోజుల తర్వాత పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా తగ్గాయి వాహనదారులు అందరూ సంతోషించదగ్గ విషయమే ఇది