కరోన ఎఫెక్ట్ – దేశ ప్రజలకు కేంద్రం ప్రకటించిన వరాలు ఇవే

0

గౌ. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ గారి ప్రకటనలు.. ( PM Gareeb Kalyan Scheme )

 1. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం.
 2. దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా పనిచేస్తున్న వైద్య అధికారులు, నర్సులు,ఆశా వర్కర్లకు యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించటం.
 3. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు మూడు నెలల వరకు ఉచితంగా రేషన్ 10 కిలోల పప్పు 10 కిలోల బియ్యం.
 4. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు వెంటనే బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తాం.
 5. దేశ ప్రజలకు పూర్తిగా ఆహార భద్రత కల్పిస్తాం.
 6. ఉపాధి హామీ పథకం కోసం ఐదు కోట్ల మంది కూలీలకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున బ్యాంకులో నగదు చేస్తాం.
 7. వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వారి బ్యాంకు అకౌంట్లో నగదు జమ చేస్తాం.
 8. పీఎం కిసాన్ రైతులకు ఇప్పటికే ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం. మొదటి విడతగా మరో 2000 వారి అకౌంట్లో నగదు జమ చేస్తున్నాం.
 9. ఉజ్వల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం.
 10. జన్ థన్ అకౌంట్లో ఉన్న మహిళలకు మూడు నెలల పాటు ఐదు వేల రూపాయలు నగదు జమ చేస్తామని చెప్పారు.
 11. పొదుపు మహిళలకు, ఒక్కో మహిళకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంచి షూరిటీ అవసరం లేకుండా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
 12. దేశవ్యాప్తంగా చిన్న వేతన ఉద్యోగులు ఊరట ఇచ్చే నిర్ణయం.
 13. 15,000 కంటే వేతనం తక్కువ ఉన్నా ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం.
 14. మరియు ఈ ఉద్యోగస్తులకు PF వాటాను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

కరోనా కు సంబంధించి, జనరల్ బ్రేకింగ్ న్యూస్ కు సంబంధించి చూస్తూ ఉండండి తెలుగువారి “తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్సైట్”