పద్యం అనగా ఏమిటి | What is Poems In Telegu
Poems In Telegu :పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు.
ప్రతి పద్యం యొక్క మెట్రిక్ అక్షరాల సంఖ్య ద్వారా కొలత స్థాపించబడింది, ప్రాస అనేది చివరి నొక్కిన అచ్చు నుండి శ్లోకాల మధ్య ఉన్న యాదృచ్చికం మరియు లయ అనేది పద్యం యొక్క సౌందర్య ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెట్రిక్ అక్షరం వ్యాకరణ అక్షరాల నుండి భిన్నంగా ఉంటుంది.
మెట్రిక్ అక్షరాల సంఖ్యను నిర్ణయించడం ధ్వనిశాస్త్రం, ప్రతి పద్యం యొక్క చివరి పదం, సినర్జీ మరియు సినాలెఫా, విరామం మరియు ఉమ్లాట్. మైనర్ ఆర్ట్ పద్యాలు 8 అక్షరాల వరకు, ప్రధాన ఆర్ట్ పద్యాలు 9 మరియు అంతకంటే ఎక్కువ అక్షరాలతో రూపొందించబడ్డాయి. అయినప్పటికీ, నిర్ణీత సంఖ్యలో అక్షరాలు లేని క్రమరహిత శ్లోకాలు ఉన్నాయి.
పద్యం అనే పదం లాటిన్ వర్సెస్ నుండి వచ్చింది , దీని అర్థం ” గాడి లేదా వరుస” మరియు అందువల్ల వ్రాత రేఖ,ఎలా ఎన్నో పద్యాలు ఏంతో మంది మహనీయులు వీటిని రాసిననారు.
వేమన పద్యాలు :{Vemana Poems In Telegu}
- అంకి లేరంగగి మాట లాడనేర్చినపుడె
పిన్న పెద్దతనము లెన్నలేల
పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుగదా
విశ్వదాభిరామ వినర వేమ! - అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి
తనువు ముదిమిచేత దరుచు వడక
ముప్పు తిప్పల బడి మోహంబు విడువడు
విశ్వదాభిరామ వినర వేమ! - అంగమందు లింగ మతిశయంబున గట్టి
లింగమందు ముక్తి నిలుపలేరు
ముక్తిలేక తుదను మూర్ఖుడై పోవురా
విశ్వదాభిరామ వినర వేమ! - ఎలుకతోలుదెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ! - పాము కన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినుర వేమ! - ఎండయన తిరుగు నిర వేరంగిన యోగి
యుండు నెల్లకాల ముర్విలోన
దిండిపోతు వశమె తెలియంగ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ! - గంగిగోవుపాలు గరిటెడైనను జాలు
కడివెడైననేమి ఖరముపాలు
భక్తిగలుగుకూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినర వేమ! - ఏమి గొంచువచ్చె నేమితా గొనిపోవు
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగు దానెచ్చటికినేగు
విశ్వదాభిరామ వినురవేమ! - గండడైన దొంగ కవులసొమ్మెగ వేసి
కండకావరాన కదియబలిసి
గండుకుక్కవలెను కాటుకు తిరుగురా
విశ్వదాభిరామ వినురవేమ! గాజు కుప్పె లోన కడఁగుచు దీపంబు
యెట్టు లుండు, జ్ఞాన మట్టు లుండు
దెలిసినట్టి వారి దేహంబు లందును
విశ్వదాభిరామ వినర వేమ!- అంజనంబు కనుల కంటించిచూచిన
సొమ్ము దొరకు భువిని సూత్రముగను
గురుని నమ్మి కరుణ గుణమంటి చూడరా
విశ్వదాభిరామ వినురవేమ! - ఆకృతి యనఁగను నిరాకృతి యనదగు
నాకృతి నొగిదగు నిరాకృతిట్టు
లవియు రెండు లే యపురూపమై యుండు
విశ్వదాభిరామ వినర వేమ! - ఆడు పాపజాతి యన్నిటికంటెను
ఆశచేత యతులు మోసపోరె
చూచి విడుచువారు శుద్ధాత్ములెందును
విశ్వదాభిరామ వినర వేమ! - ఆత్మయందు జ్యోతి యెఱుగుట లింగంబు
తెలిసిచూడగాను తేటపడును
అదియు గురువులేక యబ్బునా తెలియంగ
విశ్వదాభిరామ వినర వేమ! - ఊరిబావిలోని యుదకమ్ము నిందించి
పాదతీర్థమునకు భ్రమయువారు
పాదతీర్థములను ఫలమేమి కందురా
విశ్వదాభిరామ వినర వేమ! - ఊరు ననుచునుండ నొగి సంతసింతురు
అడవియనుచు నుండ నడలుచుందు
రూరు నడవి రెండు నొకటిగా జూచిన
నారితేఱు యోగి యతడు వేమా! - ఈకపట నాటకంబును
ఈకపటపు జదువులన్ని యింపు దలిర్ప
ఏకపటాత్ముడు సేసెనొ
యాకపటాత్మునకు మ్రొక్కి యలరుము వేమా! - ఈశ్వరుని దలంప నేడుపాళ్లుగ జేసి
తనదుమూర్తినెల్ల ధారబోసి
నిత్యకర్మములను నిలుచురా నెఱయోగి
విశ్వదాభిరామ వినర వేమ! - ఎండచీ కటులకు నిమ్మయియుండెడు
నిండు కుండలోన నిద్రమఱచి
దండియైన పరమతత్వంబు దెలియురా
విశ్వదాభిరామ వినర వేమ! - ఎండిన మా నొకటి యడవి
నుండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చరచును వేమా! - చచ్చువారిని గని చావు నిశ్చయమని
తత్వమెల్ల నాత్మదలచి తెలివి
నదరు బెదరులేక యడరిన ముక్తుఁడు
విశ్వదాభిరామ వినర వేమ! - చెట్టునందుబుట్టి చెలరేఁగి కాయలు
దనరు గాంతితోడ దగిలిపండ్లు
పండ్లు దినుచు గాయవర్ణంబు దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ! - రోగియైనవాడు రోగి నెఱుంగును
రోగి నరసిచూచి రూఢిగాను
రోగి కిడినవానిరాగి బంగా రౌను
విశ్వదాభిరామ వినర వేమ! - రతిలేక ముదియు నంగన
రతి కలిగిన ముదియు నశ్వరత్నము ధరలో
సతతము భ్రాంతిని చేసెడు
తతిరతిచే ముదియు నరుడు తథ్యము వేమా! - రోయవచ్చు బరము రూఢిగా దెలిసిన
గానవచ్చు గ్రుడ్డు కదలకున్న
రెప్పలార్పకున్న రెంటి సందుననుండి
విశ్వదాభిరామ వినర వేమ! - హిన గుణము వాణి నిలుసేర నిచ్చాన
ఎంత వారికైనా నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్ట సేయద
విశ్వధాబి రామ వినురా వేమా!
27. వేరులురుంగు చేరి వృక్షంబు జెరచును
చిడపురుంగు చేరి చెట్టు జేరచున్
క్రుతుడు చేరి గుణవంతుడు జేరచురా
విశ్వధాబి రామ వినుర వేమా !
28. చిక్కి యున్నవేల సింహంబ్బునైనను
బక్క కుక్క కరాచీ భాధ చేయు
బలిమి లేని వేల బతంబు చెల్లదు
విశ్వధాబి రామ వినుర వేమా !
29. విద్య లేని వాడు విద్వంసు చేరువ
నుడంగనే పండితుడు గాదు
కొలని హసలకడం గొక్కెర యున్నట్లు
విధ్వదాబి రామ వినుర వేమా !
30. తల్లి తండ్రుల మిద దయలేని పుత్రుడు
పుట్టే నేమి వాడు గిట్ట నేమి
పుట్టలోని జేచాలు పుట్టవా! గిటావా !
విశ్వధాబిరామా వినుర వేమా !
సుమతి పద్యాలు { Sumathi Poems In Telegu}
41. పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచవి జెరుచు గావున
తాలసుడగువానిపొందు వలదుర సుమతీ!
42. స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
43. సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దా బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
44. వెలయాలు సేయు బాసలు
వెలయగ నగపాలి పొందు వెలమల చెలిమిన్
గలలోన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
45. శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ!
46. నాది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
47. పొరుగున పగవాడుండిన
నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్
ధరగాపు కొండెమాడిన
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
48.పులిపాలు దెచ్చిఇచ్చిన
నలవడగ గుండెగోసి యరచే నిడినం
దలపొడుగు ధనము బోసిన
వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!
49.పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాటినిద్ర తరుణులయెడలం
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!
50.పరసతుల గోష్టినుండి
పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్
బరుసతి సుశీయైనను
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!
51.నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
52.చేతులకు దొడవు దానము
భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
53.తాను భుజింపని యర్థము
మానవపతి జేరుగొంత మరి భూగతమౌ
గానల నీగల గూర్చిన
దేనియ యెరుజేరునట్లు తిరగమున సుమతీ!
54.తన కలిమి ఇంద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్
తన చావు జతద్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!
55.చేతులకు దొడవు దానము
భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో
నీతియ తొడవెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
56.కోమలి విశ్వాసంబును
బాములతో జెలిమి యన్యభామల వలపున్
వేముల తియ్యదనంబును
భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!
57.కారణములేని నగవును
బేరణమును లేని లేమ పృథివీస్థలిలో
బూరణము లేని బూరెయు
వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!
58.కరణము సాధై యున్నను
గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
59.కనకపు సింహాసనము
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున
దొనరగ బట్టముగట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!
60.ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
61.లావుగల వానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాc డెక్కినట్లు మహిలో సుమతీ!
62.మంత్రిగలవాని రాజ్యము
మంత్రము సెడకుండ నిలుచుc దరుచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుంగీ లూడినట్లు జరుగదు సుమతీ!
63.దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి తా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!
64.సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదాcబోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
65.సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ!
66.నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ చెరువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
67.నొక తీర్పరియైన గాక, నొగి దరాచైనన్
గకవికలు గాకయుండునె
సకలంబు గొట్టువడక సహజము సుమతీ!
68.నేరము లెన్నడును కలుగనేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!
69.భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో
నీతియే తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
70.తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము,
తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ!
శతక పద్యం
శతక పద్యం అనగా వంద పదాలతో రచించే ఒక సాహితి ప్రక్రియ.శతక సాహితీ ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది. మనకు జీవిత పాఠాలు నేర్పే వేమన శతకం, నీతి పద్యాల నిధి సుమతి శతకం, లోక జ్ఞానం పెంచే భాస్కర శతకం, సద్గుణాలు పెంచే దాశరథి శతకం, ధర్మనిరతిని పెంచే శ్రీ కాళహస్తీశ్వరా శతకము, కుమార శతకం, కుమారి శతకం, నరసింహ శతకం, శ్రీకృష్ణ శతకం ఇలా తెలుగు వారికి ఏంతో ఇష్టమైన శతకాలెన్నో ఉన్నాయి. అందులో ప్రతి పద్యం ఒక లక్ష్యంతో ఉంది. వందల శతకాలలో వేల పద్యాలు తెలుగు నేలలో ఉండడం జరిగింది.
- వేమన శతకం
- సుమతి శతకం
- భాస్కరా శతకం
- దాశరథి శతకం
- నృహ సింహ శతకం
- కుమార శతకం
- నారాయణ శతకం..
71.అదను దలంచి కూర్చిప్రజ నాదర మొప్పవిభుండు కోరినన్
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టితెండనన్
మొదటికి మోసమౌబొదుగు మూలము గోసిన బాలు గల్గునే
పిదికినగాక భూమిబశు బృందము నెవ్వరికైన భాస్కరా!
72.అనఘునికైనజేకురు ననర్హుని గూడి చరించినంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడుధరిత్రియందు నే
యనువుననైనదప్పవు యథార్థము తానది యెట్టులన్నచో
నినుమునుగూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా!
73.చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
74.ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందు, జంద్రి కా
పేక్షజెలంగి చంద్రు డుదయించు విధంబునకై చకోరపుం
బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా !
75.ఆదర మింతలేక నరు డాత్మబలోన్నతి మంచివారికి
భేదము చేయుటం దనదు పేర్మికిగీడగు మూలమె, ట్లమ
ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందడె మున్ను భాస్కరా !
76.ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్పగూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే
కూర దదెట్లు హత్తుగడగూడునె, చూడబదాఱువన్నె బం
గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!
77.ఈ క్షితి నాథ కాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుడైన సత్భుని రకాలు గోరుదు రెండు జంధ్రి కా
ప్రేక్ష జెలంగి చంద్రుడు దయించు విధంబునకై చాకోరాపురం
భక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా!
78. తపముల్ మంత్రసమస్త యజ్ఞఫలముల్ దనక్రియారంభముల్
జపముల్ పుణ్యసుతీర్ధసేవ ఫలముల్ సాద్వేదవిజ్ఞానమున్
ఉపవాసవ్రత శీలకర్మ ఫలముల్ యోప్పార నిన్నాత్మలో
మింపం గలవారికే గలుగు వయున్నేల నారాయణా!
79.శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
80. శ్రీ రమణి యహర యథాసి కుసుమభాశారిర, భక్ష మం
ధార వికరదుర పరతత్వం విహార త్రిలోక చేతనో
ధార దురంత పతక వితాన విదుర, ఖరాది ధైత్త్క్యం
తార కుటార భద్రగిరి దాశరథి కరునపయోనిది!
81.దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం!
82. కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ!
83.శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
84. హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ!
85. పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరధీ కరుణాపయోనిధీ!
86. హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరధీ కరుణాపయోనిధీ!
87. చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమరుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!
88.రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ!
89. అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!
90. జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ!
91.ధరణీనాయకు రాణియు
గురురాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుదలపు కుమారా!
92. పోషకుల మతముగనుగొని
భూషింపక కాని ముదము బొందరు మరియున్,
దోషముల నెంచుచుందురు,
దోషివయిన మిగులగీడు దోచు కుమారా!
93.పెద్దలు విచ్చేసినచో
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్,
హద్దెరిగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దుకుమారా!
94.వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!
95. శ్రీ భామినీ మనోహరు
సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్
లో భావించెద నీకున్
వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!
96.అతి బాల్యములోనైనను,
బ్రతికూలపు మార్గములబ్రవర్తింపక స
ద్గతిమీఱ మెలగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!
97. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా
లోచనము లొంటిజేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా!
98. పోషకుల మతముగనుగొని
భూషింపక కాని ముదము బొందరు మఱియున్,
దోషముల నెంచుచుందురు,
దోషివయిన మిగులగీడు దోచు కుమారా!
99. పిన్నల పెద్దలయెడ గడు
మన్ననచే మెలగు సుజన మార్గంబులు నీ
వెన్నుకొని తిరుగుచుండిన
నన్నియెడల నెన్నబడుదువన్న కుమారా!
100. ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుదెలుప నేగకుమీ నీ
కన్న తలిదండ్రుల యశం
బెన్నబడెడు మాడ్కి దిరుగు మెలమిగుమారా!
ఇవి కూడా చదవండి