Table of Contents
Poppy Seeds(Khus khus) In Telugu | గసగసాలు అంటే ఏమిటి?
గసగసాలు మంచి గింజ రుచిని కలిగి ఉంటాయి. ఈ తెల్లని, చాలా చిన్న గసగసాలు పండిన గసగసాల నుండి తీసివేయబడతాయి. ఆసక్తికరంగా, పండిన గసగసాలు నల్ల గసగసాల విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ‘నల్ల గసగసాల’ ఉపయోగకరమైన మత్తుమందు, దీనిని మార్ఫిన్ వంటి వైద్య ఔషదాలలో ఉపయోగిస్తారు.
గసగసాలు ఎలా నిల్వ ఉంచాలి ?
- విత్తనాలను ఫార్మసీలో కొనవచ్చు లేదా మీరే పెంచుకోవచ్చు.
- విత్తనాలను సేకరించిన తరువాత, వాటిని ఎండబెట్టి, వాటిని శుభ్రం చేయాలి.
- వాటిని బాగా మూసివేసిన కంటైనర్లో ఉంచండి. గాజు లేదా పింగాణీ వంటకాలు తీయడం మంచిది.
- గసగసాలు విత్తనాలు మంచి వాసనతో పొడిగా ఉన్నాయో లేదో చూడండి.
- నిటి శాతం మరియు తేమ ఉండకూడదు.
How To Eat Poppy(Khus khus)Seeds In Telugu|గసగసాలుఎలా తినాలి?
- వీటిని ఎక్కువగ స్వీట్స్ చేయడానికి మరియు ఇతర వంటలలో వాడవచ్చు.
- గసగసాలు రోజు వీటిని నీటిలో కలుపుకొని దీనిలోకి నిమ్మకాయ రసం కలుపుకొని తాగవచ్చు.
- గుండె సమస్య ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, షుగర్ కలిపి మార్నింగ్, ఈవెనింగ్ హాఫ్ స్పూన్ (అర చెంచాడు) తీసుకొంటే గుండె హాయిగా ఉంటుంది.
- వీటిని తగినంత మోతాదులో వాడి చక్కర రసముతో కలుపుకొని తాగవచ్చు.
గసగసాలు ఎంత మోతాదులో తినాలి?
- ముఖ్యంగా నిద్రించే ముందు గసగసాలను పేస్ట్ చేసి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకొంటే మంచిది.
- వేడి పాలలో కలిపి సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.నిద్రలేమితో బాధ పడేవారు ఈ డ్రింక్ తాగితే అంటే గసగసాలు మరియు చక్కర మరియు నిమ్మరసం కలిపిన ఈ డ్రింక్ తాగితే మీ కడుపులో ఉన్న మాలినాలు దూరమవుతాయి.
- చక్కటి మరియు ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
- అలాగే ఎదిగే పిల్లలకు గసగసాలను బెల్లం మరియు నెయ్యి కలిపి ఇవ్వడం వల్ల వారిలో బలం పెరుగుతుంది.
- వారిలో ఆలోచించే శక్తి పెరగడంతో పాటుగా ఎప్పుడు యాక్టివ్‌గా, బలంగా ఉంటారు.గసగసాలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
గసగసాలు వాటి ఉపయోగాలు | Poppy(Khus khus) Seeds Uses In Telugu
- నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వలన మంచి నిద్ర సొంతం అవుతుంది.
- మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. తద్వారా మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
- గుండె సమస్య ఉన్న వారు గసగసాలు దోరగా వేయించి పంచదార కలిపి ఉదయం, సాయంత్రం అర చెంచాడు తీసుకుంటే గుండెకు మంచిది.
- నిద్రకు మేలు. కొంతమందికి సరిగా నిద్ర పట్టదు. అలాంటి వారు గసగసాలు తీసుకోవాలి. రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్‌ను కొద్దిగా కలిపి తాగితే చాలు.చక్కటి నిద్ర వచ్చేస్తుంది.
- శ్వాస సమస్యలకు చెక్. గసగసాలు ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్ (నయం చేసే గుణాలు) గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి.
- గుండె సమస్య ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, షుగర్ కలిపి మార్నింగ్, ఈవెనింగ్ హాఫ్ స్పూన్ (అర చెంచాడు) తీసుకొంటే గుండె హాయిగా ఉంటుంది.
- గసగసాలు చలవ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడొచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ వున్న వారు గసగసాల్ని వాడితే పేగులలో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి.
గసగసాలు వాటి దుష్ప్రభావాలు |(Khus khus) Side Effects Of Poppy Seeds
- గసగసాలు ఎక్కువగా బెకరి ఫుడ్ లలో మరియు ఇతర రకాల వంట్లోలో ఎక్కువగా వాడుతూ ఉంటారు.
- వీటిని రొట్టెలలో మరియు అనేక రకాల పిండి వంటల్లో వాడేటప్పుడు డయాబెటిస్ వారు ఇతర రకాల వ్యాది ఉన్న వారు తక్కువ మోతాదులో వాడాలి.
- గసగసాలు అతిగా వాడటం వలన మగవారిలో వీర్య నష్టము జరుగుతుంది. లైంగిక సామర్థ్యం కూడా దెబ్బ తింటుంది. కాబట్టి వీటిని అతిగా వాడకూడదు. ఔషధంలా తక్కువ మోతాదులో వాడుకోవాలి.
- గసగసాలు మోఫిన్, కోడిన్ మరియు పపెవరైన్, తబైయిన్ మరియు నార్కొతిన్ ఉండటం వలన ఇవి తక్కువ మోతాదులో వాడాలి.
- దీనిన్ మించి విపరీతముగా సేవిస్తే అది విషపూరిత ఆహారముగా మరే ప్రమాదం ఉంది.
- అలాగే అల్లేర్జి ఉన్న వారు వీటిని వాడేటప్పుడు జాగ్రత్త పడాలి.
- అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని గసగసాలను అతిగా మాత్రం తీసుకోరాదు.ఇక లైంగిక సమస్యలుఎదుర్కొనే వారి వీటికి దూరంగా ఉండటమే మంచిది.
ఇంకా చదవండి :-