మెగా కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయడానికి దూసుకొస్తున్నాడు .అతను ఎవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు.ఈయన మనకు హీరోగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, వ్యవహరించారు .ఈయన అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం తో చిత్ర పరిశ్రమకు దూరం కావడం జరిగింది.
అయితే ఆయన కుమారుడు అకీరా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అకీరా మరాఠీ లో ఓ సినిమా చేశాడు.అదే చిత్రాన్ని తెలుగులోకి అనువదించాలని అనుకున్నారు.అయితే డబ్బింగ్ సినిమాతో కాకుండా డా డైరెక్ట్ సినిమాతో తన కుమారుడిని లాంచ్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.
ఈ క్రమంలోనే తన అన్నయ్య కుమారుడైన రామ్ చరణ్ నిర్మాత సంస్థ అయినా కొణిదెల ప్రొడక్షన్ లోనే తన కుమారుడి చిత్రాన్ని తెరకెక్కించాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు.మరి పవన్ కళ్యాణ్ లాగే తన కుమారుడు మేరకు కు మెగా అభిమానులకు తన నటనతో ఆకట్టుకుంటాడో లేదో వేచి చూడాలి .ఏది ఏమైనప్పటికీ మెగా కుటుంబం నుంచి మరొక వారసుడు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమే.