prati roju panduga collections till now – సినిమా హిట్టా ఫట్టా ?

0

prathi roju pandage collections worldwide

ప్రతి రోజు పండగే సినిమాతో బాక్సాఫీసు దుమ్ము దులిపిన సాయిధరమ్ తేజ. నందమూరి వారసుడు బాలయ్య రూలర్ సినిమాకు గట్టిపోటీని ఇచ్చే రికార్డుల బరిలో నిలదొక్కుకున్న ప్రతి రోజు పండగే చిత్రం. డిసెంబర్ 2019 లో విడుదలైన ఈ చిత్రం ఈరోజు నుంచి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ సాధించి బాక్సాఫీస్ దుమ్ముదులుపేసినది. ఎలాగంటారా మరి ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ వివరాలు కి వెళ్దామా.

మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ప్రతి రోజు పండగే ఈ చిత్రం విడుదల లోనే ఒక ప్రత్యేకతను చాటుకుంది. దాదాపు 800 థియేటర్లలో విడుదలై భారీ అంచనాలతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకొన్నది. అంతేకాకుండా ప్రస్తుతం భారీ కలెక్షన్లతో రన్ అవుతూ చిత్రం ముందుకు దూసుకు వెళ్తుంది. ఈ కలెక్షన్ల హవాకు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు నిజంగానే ప్రతి రోజూ పండగ చేసుకుంటున్నారా అని అనిపిస్తున్నది.

యు.వి.క్రియేషన్స్ గీతాఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన చిత్రం ప్రతి రోజు పండగే. ఈ చిత్రం విడుదలైన తొలిరోజునే దాదాపు నాలుగు కోట్ల షేర్ వసూలు చేసి ఈరోజు వరకు అదే జోష్ కొనసాగిస్తున్నది. డిసెంబర్ 29న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి దాదాపు నెల రోజులు దాటినా ఇప్పటికీ అదే కలెక్షన్స్ కొనసాగిస్తూ దాదాపు మొత్తం 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సినీ పరిశ్రమలోనే ఇదో కొత్త రికార్డు. కొత్త సినిమాలు విడుదలకు సంక్రాంతి పండుగకు చాలా సంబంధం ఉంది. అయితే సంక్రాంతి నెల ముందుగానే విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లు ఎలా ఉంటుందో అని అందరూ అనుమానపడ్డారు. అయితే అందరి అనుమానాన్ని తొలగిస్తూ ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మరియు యు.వి రోయిన్ రాసి కన్నా కు మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది. అందుకే అభిమానులకు బాగా దగ్గరగా చేరువైంది
ఈ చిత్రం విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సినిమా విడుదల తేదీ కన్నా ముందే ఓ విచిత్రమైన రికార్డు సాధించింది అదేంటంటే ప్రతి రోజు పండగే చిత్రానికి ఉన్న డిమాండ్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఇది 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నిజం చెప్పాలంటే ఈ చిత్ర నిర్మాణానికి 18 కోట్ల రూపాయలు ఖర్చయింది మరియు సినిమా థియేట్రికల్ హక్కుల కోసం 14 కోట్లు లభించాయి ఈ విధంగా ప్రతి రోజు పండుగ విడుదలకు ముందే సినిమా మేకర్స్ కు లాభాల పంట పండించింది