పృథ్వి రాజ్ కి షాక్ ఇచ్చిన విజిలెన్స్ అధికారులు-అదిరిపోయే ట్విస్ట్

0

prudhvi raj audio tape case

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అతనికి అంటుకున్న ఒక మచ్చ అంటే, అదే పృథ్వీరాజ్ మూలంగా ఈ మధ్య జరిగిన సంఘటన. పృద్వి రాజ్ గారు అసభ్యంగా ఒక మహిళతో మాట్లాడినట్లుగా లీకైన ఆడియో కాల్ వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే!

అయితే దీనికి సంబంధించి పృద్వి రాజ్ గారు ఈ మాటలు నావి కావు అని ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు. దీనిపైన విజిలెన్స్ చాలా లోతుగా విచారణ చేపట్ట పోతున్నారు అందుకనే పృథ్వీరాజు గారు ముందు జాగ్రత్తగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయం పెద్ద సమస్యగా మారకముందే రాజీనామా చేయమని జగన్ కోరినట్లు సమాచారం. కానీ పృథ్వీరాజు జగన్ చెప్పక ముందే తనే స్వయంగా రాజీనామా చేసుకున్నట్లు చెప్పడం జరుగుతున్నది.

అయితే పృథ్వీరాజు నాకు ఆడియో కాల్ కు ఏమాత్రం సంబంధం లేదు ,కేవలం నా పైన బురదజల్లే ఒక పెద్ద ప్రయత్నమే ఇది అని అంటున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పుకునే ఒక పెద్ద కమెడియన్ పృథ్వి రాజ్ గురించి , ఈ ఆడియో కాల్ గురించి పూర్తిగా లోతైన విచారణ జరుపుతున్నారు. ఏంటంటే పృథ్వీరాజ్ ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన ఉద్యోగ నియామక అక్రమాలు ప్రధానమైనవి.

ఇంకా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు మహిళలను ఆయన మాట్లాడిన తీరు విధానము వివాదాస్పదంగా మారింది. టాలీవుడ్ రంగానికి చెందిన ఇద్దరు మహిళలను ఆయన ఎస్వీబీసీ ఛానల్ లో నియామకాలు జరిగినట్లుగా పేర్కొంటున్నారు.

ఆ ఇద్దరు మహిళల్లో ఒకరితో పృథ్విరాజ్ ఒక ప్రేమ వ్యవహారం బయటపడినట్లు గా తెలుస్తున్నది. ఈ విషయంపైనే అవునా కాదా అని విజిలెన్స్ విచారణలో నిర్ధారణ కావలసి ఉన్నది. అయితే పృధ్వీరాజ్ తో ఫోన్లో మాట్లాడిన మహిళ ఎవరు అనేది ఇంతవరకు స్పష్టత లేదు. ఫోన్లో మాట్లాడిన ఆ మహిళ బయటకు వచ్చి అతని పైన కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి విచారణ చేయలేక పోతున్నారు పోలీసులు.

కాబట్టి పోలీసులు దీనిపైన కూడా లోతుగా విచారణ చేస్తే ఆ మహిళ ఎవరు అనేది తెలుసుకోవచ్చు. కానీ ఆ మహిళ తనంత తానుగా బయటకు వచ్చి కంప్లైంట్ చేయకపోతే ఆమె ఎవరు అనేది గోప్యంగానే ఉండిపోతుంది. అయితే ప్రధానంగా ఈ ఆడియో టేప్ లో మాట్లాడినది పృథ్విరాజ్ అవునా కాదా అనేది తేలాల్సి ఉంది.

విజిలెన్స్ విచారణ తర్వాత ఆడియో కాల్ ఆల్ లో మాట్లాడినది మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు పృథ్వీరాజే అని తేలితే ప్రభుత్వం వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. జగన్ ప్రభుత్వం పృథ్విరాజ్ మీద నమ్మకంతో ఎంతో పవిత్రమైన బాధ్యతాయుతమైన పదవిలో కూర్చోబెడితే, ఆయన ఇలాంటి కార్యకలాపాలకు కార్యక్రమాలకు లోబడి ఉన్నాడు అని తేలితే ప్రభుత్వం మీద ఇది చాలా ప్రభావాన్ని చూపుతుంది.

ప్రభుత్వం కూడా ఊరికే చూస్తూ ఊరుకోదు. పృథ్వీరాజు ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నపుడు ఏఏ ఉద్యోగాలను నియమించాడు, ఎవరిని నియమించాడు, అనే విషయాలను పూర్తిగా బయట పెట్టబోతున్నారు. ఆ జాబితా కూడా బయటకు వెలువడుతున్నది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అన్నీ విజిలెన్స్ వారి దగ్గర ఉన్నవి అయితే ఇప్పటికే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ మొత్తం పూర్తి వివరాలు ,అన్నీ ఆ లెక్కల వివరాలు అన్నీ మా దగ్గర నిరూపణ లతో ఉన్నాయి అని ప్రచారం మొదలుపెట్టారు.

ఏ మైన నూ విజిలెన్స్ అధికారులు పృధ్విరాజ్ పైన విచారణ చేపట్ట పోతున్నారు. విచారణ ముగిసిన తర్వాతపృథ్వీరాజ్ సఛ్ఛీలుడు అని తేలితే పర్వాలేదు కానీ కచ్చితంగా తప్పు చేశాడు అని తేలితే అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేదే ఇప్పుడు చాలా ఆసక్తి కరమైన అంశం.