పూరి జగన్నాథ్ కి మరో హిట్ దక్కేనా?

0

ఆకాష్ పూరి హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు.వీరిద్దరి కలయికలో ఇంతకు ముందు వచ్చిన మెహబూబా అనే చిత్రం వచ్చింది.ఈ చిత్రం పరాజయం పాలవడంతో తన కుమారుడికి ఎలాగైనా హిట్ సినిమా అందించాలని పూరి జగన్నాథ్ చూస్తున్నారు.ఈ చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి  చాలా నష్టం వచ్చింది.

ఆ నష్టాలని కవర్ చేయడానికి పూరి జగన్నాథ్ కి చాలా సమయం పట్టింది.ఐ స్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్.ఈ సినిమా హిట్ తో ఒక్కసారిగా రేసులోకి వచ్చారు.సినిమాకి బాగా ప్రాఫిట్ రావడంతో,చాలా హ్యాపీగా ఉన్నారు.ఈ చిత్రం నిర్మాణంలో చార్మి కూడా భాగస్వామి ఇప్పుడు వీరిద్దరు కలిసి ఆకాష్ పూరి హీరోగా;రొమాంటిక్; అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీని అడల్ట్ కంటెంట్ తో  బజ్ క్రియేట్ చేసి బిజినెస్ చేయాలని భావిస్తున్నారట.రొమాంటిక్ చిత్రం ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.హీరోహిన్ టాప్ లెస్ తో ఉండగా హీరో హగ్ చేసుకునే స్టిల్ ను ఫస్ట్ లుక్ గా వదిలారు. టైటిల్ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా పెట్టారని అర్థమవుతోంది .ఐ స్మార్ట్ శంకర్ లాగే ఈ చిత్రం కూడా అ మంచి విజయం  సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు .