రా రా అల్లుడు వేట నేర్పుదాం. అంటున్న వెంకీ మామ.

0

 

తెలుగు చిత్ర అ పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్ లా చిత్రాలూ ఊపందుకున్నయీ.నిజజీవితంలో మామ అల్లుడు గా ఉన్న విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ఇప్పుడు కాస్త స్క్రీన్ పై మామ అల్లుడు గా నే నటిస్తున్నారు.ఈ చిత్రానికి టైటిల్ కూడా వెంకీ మామ.అనే ఖరారు చేశారు.టైటిల్ కూడా పాజిటివ్ గా ఉండటం తో ఈ సినిమాపై భారీగా నే అంచనాలు ఉన్నాయి.

దసరా సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఒక్క టీజర్ విడుదల చేసి ఇటు దగ్గుబాటి అభిమానులకు,అటు అక్కినేని అభిమానులకు,శుభాకాంక్షలు తెలిపింది.రా రా అల్లుడు వేట నేర్పుదాం అంటూ వెంకి చైతు ఇద్దరు అదరగొట్టారు.

ఈ మధ్య విడుదల చేసిన పోస్టర్స్ లో కూడా పంచెలు కట్టుకొని ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని నడుచుకుంటూ వచ్చినా ఈ పోస్టర్ అభిమానులను బాగా అలరించింది.

ఈ చిత్రంలో కథానాయికలుగా రాఖీ కన్నా, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు.ఇందులో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్ గా నాగ చైతన్య సైనికుడిగా నటిస్తున్నారు.సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి  అనూప్ రూబెన్స్ససంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ చిత్రానికి దర్శకుడు బాబి.