రైల్వే లో 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Railway ALP Notification 2025

0
RRB ALP NOTIFICATION 2025

RRB ALP అంటే Railway Recruitment Board Assistant Loco Pilot (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్) అని అర్థం.ఇది దీని యొక్క ఫుల్ ఫార్మ్.భారతీయ రైల్వేలో లోకో పైలట్‌కు (ట్రైన్ డ్రైవర్) సహాయంగా పనిచేసే ఉద్యోగమే ALP (Assistant Loco Pilot).ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Railway ALP Notification 2025

ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి 10,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 2025 రైల్వే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.ఈ నోటిఫికేషన్ గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Job Details

ఫ్రెండ్స్ రైల్వే లో జాబ్ చేయాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది.అలాంటి వారికీ ఇది ఒక సువర్ణ అవకాశం.ఈ RRB ALP లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి?,అవి ఏ ఏ రైల్వే జోన్ లో ఉన్నాయి? అనే విషయాలు క్రింద వివరంగా తెలుసుకుందాం.

S.NOZonal RailwayNumber of Vacancies
1Central Railway376
2East Central Railway700
3East Coast Railway1461
4Eastern Railway768
5North Central Railway508
6North Eastern Railway100
7Northeast Frontier Railway125
8Northern Railway521
9North Western Railway679
10South Central Railway989
11South East Central Railway568
12South Eastern Railway796
13Southern Railway510
14West Central Railway759
15Western Railway885
16Metro Railway Kolkata225
Total9970

Eligibility

ఫ్రెండ్స్ మనం ALP జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18-33 మధ్య ఉండాలి.
  • 10 + ITI , డిప్లొమా, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
  • SC,ST,OBC,EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయో పరిమితి కూడా ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు. 
  • 10 + ITI , డిప్లొమా, ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్.
  • స్టడీ సర్టిఫికెట్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • అప్లికేషన్ ఫారం.

Salary Details

ఈ RRB ALP ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకి 50,000/-వరకు స్యాలరి ఇస్తారు.దీనితోపాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఇస్తారు.

Application Fees

ఫ్రెండ్స్ ఈ రైల్వే జాబ్స్ కి అప్లై  చేసుకునే అభ్యర్థులకు 250/- నుండి 500/- మధ్య అప్లికేషన్ ఫీజు ఉంటుంది.ఈ ఫీజును మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Important Dates  

ఈ రైల్వే లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను రైల్వే డిపార్ట్మెంట్ వారు ఇంకా వెల్లడించలేదు.అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశాక అందులో తెలిపిన తేదీలలో మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Job Selection Process

ఈ RRB ALP ఉద్యోగాలకు స్టేజ్ 1,స్టేజ్ 2,సైకోమెట్రిక్ టెస్ట్,డాక్యుమెంట్ వెరిఫికేషన్,మెడికల్ ఎక్సమ్ నిర్వహించి ఈ జాబ్స్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Apply Process 

ఈ ALP జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కింద ఇచ్చిన లింకు ద్వారా చూసుకొని అఫీషియల్ అప్లికేషన్ తేదీలు విడుదల చేశాక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Railway ALP Notification 2025

Notification pdf