31-05-2022 మంగళవారం మీ యొక్క రాశిఫలాలు !

0
31-05-2022 మంగళవారం మీ యొక్క రాశిఫలాలు

రాశిఫలాలు | Rashi Phalalu  

Rashi Phalalu In Telugu :రాశి ఫలాలు అనేవి ప్రతి ఒక్క మనిషి అవసరం, ప్రతి రోజు వారి యొక్క రాశి ఫలం ఎలా ఉంది అని బుక్స్, న్యూస్ పేపర్స్, టీవీ లో చూసుకోవడం జరుగుతుంది. ఈ రోజు  ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసు కొందాం.

చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశి తర్వాత సింహరాశిలో సంచరించబోతున్నాడు, అటువంటి పరిస్థితిలో ఈ రోజు చాలా రాశిచక్ర గుర్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ రోజు శుభ ఫలితాలను పొందుతారు. మిగిలిన అన్ని రాశుల వారికి ఈ రోజుఎలా ఉంటుందనేది తెలుసుకొందం. 

ఇవాళ పలు రాశుల వారికి చాలా బాగుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. మరికొందరికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పలు రాశుల వారు మోసపోయే ప్రమాదముంది. జాగ్రత్తగా ఉండాలి. ”మేషం” నుంచి ”మీనం” వరకు నేటి దిన ఫలాలు.

Rashi Phalalu In Telugu 31 May 2022 : 

మేషం
విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్యబాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

వృషభం
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.

మిథునం
మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం
నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబంలో సంపూర్ణ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

సింహం
మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు ఆభరణాలను పొందుతారు.

కన్య
ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉన్నది. స్థిరాస్తులకు విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసికాందోళన తప్పుదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.

తుల
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం ఉంది.

వృశ్చికం
ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

ధనస్సు
నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.

మకరం
చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.

కుంభం
వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.

మీనం
అపకీర్తి రాకుండా జాగ్రత్తపడడం మంచిది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి