రాశిఫలాలు | Rashi Phalalu
Rashi Phalalu In Telugu :రాశి ఫలాలు అనేవి ప్రతి ఒక్క మనిషి అవసరం, ప్రతి రోజు వారి యొక్క రాశి ఫలం ఎలా ఉంది అని బుక్స్, న్యూస్ పేపర్స్, టీవీ లో చూసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసు కొందాం. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశి తర్వాత సింహరాశిలో సంచరించబోతున్నాడు, అటువంటి పరిస్థితిలో ఈ రోజు చాలా రాశిచక్ర గుర్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ రోజు శుభ ఫలితాలను పొందుతారు. మిగిలిన అన్ని రాశుల వారికి ఈ రోజుఎలా ఉంటుందనేది తెలుసుకొందం.
ఇవాళ పలు రాశుల వారికి చాలా బాగుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. మరికొందరికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పలు రాశుల వారు మోసపోయే ప్రమాదముంది. జాగ్రత్తగా ఉండాలి. ”మేషం” నుంచి ”మీనం” వరకు నేటి దిన ఫలాలు.
Rashi Phalalu In Telugu :
మేషం :
మీరు అనారోగ్యం తో బాధ పడుతూ ఉంటె దాని నుండి విముక్తి కలుగుతుంది. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు ప్రయాణం చేసే తప్పుడు జాగ్రతగా ఉండాలి, వృతి రంగాలలో ఆర్ధిక నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి, ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం వేచి చూస్తారు మీకు దైవదర్శనం లభిస్తుంది.
వృషభం :
మీ మనసు చంచలంగా ఉంటది, బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపదండి, అకల భోజనం వలన మీరు అనారోగ్యం తో బాధ పాడుతారు, ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటది. చెడు సవాసలకు దూరంగా ఉండడం మంచిది.
మిథునం :
నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కర్కాటకం :
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధిం చిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
సింహం :
విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
కన్య :
విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
తుల :
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
వృశ్చికం :
రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
ధనుస్సు :
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.
మకరం :
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కుంభం :
కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
మీనం :
ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
ఇవి కూడా చదవండి
- అపరాజిత స్తోస్త్రం తెలుగు వారి కోసం.
- శ్రీ రామనవమి పూజ విధానం పూర్తి వివరాలు మీ కోసం
- తెలుగు భక్తుల కోసం సరస్వతి శ్లోకం…