దీపావళి పండుగ రోజు ఈ రాశుల వారికి అదృష్టం వరించి కోటీశ్వరులు అవుతారు

0
Rashiphalam 2021 Telugu
Rashiphalam 2021 Telugu

Rashiphalam 2021 Telugu | రాశి ఫలాలు 2021 | దీపావళి 2021 

నవంబర్ 4 దీపావళి అమావాస్య తరువాత ఈ 4 రాశుల వారికి దశ తిరిగి కోటీశ్వర్లు అవుతారు!!
నవంబర్ 4 2021 అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోబోతున్నాం. ఈ దీపావళి లక్ష్మీ దేవి కి ఎంతో ఇష్టమైన రోజు.

ఈ 4 రాశుల వారికి ఈ దీపావళి రోజు నుండి లక్ష్మీ కటాక్షం లభించబోతుంది. వీరికి తలుచుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది. ఈ నాలుగు రాశుల వారికి గ్రహ సంచారం ఫలితం ఆధారంగా అంతా మంచే జరుగుతుంది.

ఈ 4 రాశుల వారికి ఇప్పటివరకు ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం వరించ బోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రాబోతుంది . ఉద్యోగాలలో స్థిరపడుతారు. వీరు చేపట్టే ప్రతి పనికి దైవబలం తోడు కావడం వల్ల అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

1. మేష రాశి:- ఈ దీపావళి రోజు నుండి ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. వీరు ఏ పని చేసినా కూడా అందులో విజయం తప్పనిసరిగా సాధిస్తారు. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని తొలగి పోయి సుఖాన్ని అనుభవించ బోతారు.

వ్యాపారం చేసేవారికి సువర్ణవకాశం అని చెప్పవచ్చు. మీరు గురువారం రోజు విష్ణు పూజ చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్యస్వామి పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.

2. సింహరాశి :- సింహ రాశి వారికి దీపావళి పండుగ రోజు నుంచి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఏదైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులకు మరియు ఉద్యోగులకు మంచి రోజులు అని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వ్యాపారులకు ఈ దీపావళి రోజు నుంచి మంచి లాభాలు కలుగుతాయి. రాజకీయరంగంలో వీరికి తిరుగేలేదు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు శివుడు మరియు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల అన్నీ శుభపరిణామాలే జరగబోతున్నాయి.

మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు శివుని దర్శించిన తర్వాత మొదలు పెడితే ఆ పని సక్సెస్ అవుతుంది.

3. వృషభ రాశి :- ఈ దీపావళి అమావాస్య రోజు నుండి వృషభ రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది. చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగి పోయి ధనం కలిసివస్తుంది.

వ్యాపారస్థులకు ఇది చాలా మంచి కాలం, కొత్త వ్యాపారం మొదలు పెడితే బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు చాలా చక్కటి మార్కులు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేనివారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

ఈ రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు శుక్రవారం మొదలు పెడితే విజయం సాధిస్తారు. వీరు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

4. కుంభరాశి :- ఈ కుంభ రాశి వారికి కూడా దీపావళి రోజు నుండి అన్ని విషయాల్లో కలిసివస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, చికాకులు తొలగిపోయి జీవితంలో స్థిరపడతారు. వ్యాపారస్తులు లాభాల బాట పడతారు. నిరుద్యోగులు ఉద్యోగం లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.

రాజకీయ రంగంలో ఉండేవారికి తిరుగు ఉండదు. వీరు పెద్దల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం అంటే మంచి పద్ధతులను నడుచుకుంటారు. ధన లాభం కలుగుతుంది. శ్రీమహావిష్ణువుని ఆరాధించడం వల్ల ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందుతారు.

అనుకున్నది సాధించగలుగుతారు. ఏదిఏమైనా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లు జరుగుతుంది. మేష రాశి, వృషభ రాశి, సింహ రాశి మరియు కుంభరాశి ఈ 4 రాశులలో పుట్టిన వారు నిజంగా అదృష్టవంతులు. ఈ రాబోయే దీపావళి నుండి వీరి జీవితంలో మార్పు రాబోతున్నది.

అందుకే ఈ 4 రాశుల వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా దీపావళి రోజు చేసే లక్ష్మి పూజ వల్ల దాదాపు అన్ని రాశుల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి.

కాబట్టి ప్రతి ఒక్కరు దీపావళి రోజున లక్ష్మీ దేవికి పూజ చేయడం వల్ల కుటుంబంలో ఉండే సమస్యలు, చికాకులు తొలగిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క దీపమైనా వెలిగించడం వల్ల సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి.

ఇవి కూడా చదవండి :-

  1. దీపావళి పండుగ రోజు తెల్ల జిల్లేడు తో ఇలా చేయండి పేదరికాన్ని తొలగించుకోండి
  2. బల్లి శాస్త్రం – దోషలేంటి ?
  3. ఆడవారిపై బల్లి పడిందా ? అయితే ఇవి తెలుసుకోండి.
  4. మగవారిపై బల్లి పడితే ఏమ చేయాలో మీకు తెలుసా ?