Table of Contents
rashmika mandanna age and height :
1996 నుండి ప్రస్తుతం వరకు రష్మిక మందన ( sarileru neekevvaru heroine ) బయోగ్రఫీని పూర్తిగా తెలుసుకుందాం. 1996 ఏప్రిల్ 5వ తేదీన సుమన్ మందన ,మదన్ మందనా దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో కొడగు జిల్లాలోని విరాజపేట తాలూకా గ్రామంలో జన్మించింది. మరి rashmika mandanna age 23 సంవత్సరాలు, అలాగే ఆమె height 1.61m. రష్మికా కు ఒక చెల్లెలు ఉంది పేరు షిమన్ మందన.
::విద్యాభ్యాసం::
రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యతో పాటు మాధ్యమిక విద్య కూడా అభ్యసించింది. తర్వాత మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఎమ్మెస్ చదివింది. రామయ్య కాలేజీ లో సైకాలజీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ కోర్సు కూడా చేసింది.
మోడలింగ్:
రష్మిక చదువుకుంటూనే 2012లో క్లీన్ అండ్ క్లియర్ అనే ఫేస్ క్రీమ్ సంస్థకు మోడల్ గా చేసింది. ఇందుకుగాను 2013లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ rashmika ను వరించింది. దాంతో ఆ సంస్థ క్లీన్ అండ్ క్లియర్ కు రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఆసమయంలోనే తను సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నట్లు ఇంటర్వ్యూలో తెలిపింది. అందులో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి.
rashmika mandanna movies :
అప్పుడే ఆ ఇంటర్వ్యూ చూసిన కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి రష్మిక ను అప్రోచ్ అయ్యాడు. అప్పటికే రిషబ్ శెట్టి తను తీయబోతున్న కిరాక్ పార్టీ సినిమా కు ఇద్దరు హీరోయిన్లను వెతుకుతున్నాడు. ఇందుకోసం కండక్ట్ చేసిన ఆడిషన్స్ లో సుమారు 2000 మంది ప్రొఫైల్ పంపించారు. అందులో 400 మందిని వడపోసి సెలెక్ట్ చేశారు. ఆ 400 మందిని ఆడిషన్స్ చేయగా ఎవరూ అతనికి నచ్చలేదు. సరిగ్గా ఆ సమయంలోనే రష్మిక ఇంటర్వ్యూ చూసి ఆమెను కలిశాడు. ఆమెకు స్క్రీన్ టెస్ట్ , ఆడిషన్ టెస్ట్ చేశాక ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు.
2014లో ఆమెతో అగ్రిమెంట్ తీసుకున్నాడు. 2016 ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టి అక్టోబర్ కల్లా అంటే ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు అన్నీ పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేశారు.
విడుదలైన మొదటి రోజునే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో తీశారు.
అయితే 50 కోట్ల వరకు వసూలు చేసింది.
అంటే కన్నడలో 50 కోట్లు అంటే తెలుగులో దాదాపు 120 కోట్లు వసూలు చేసినట్లు అన్నమాట. ఈ సినిమాలో rashmika mandanna పాత్రే ప్రధానం. రష్మిక కు మొట్ట మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న నటిగా నటించింది. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ వరించింది. ఈ సినిమాను తెలుగులో నిఖిల్ తో కిరాక్ పార్టీ రీమేక్ చేశారు. అయితే ఇందులో రష్మిక నటించలేదు సిమ్రాన్ పరింజా అనే నూతన నటి నటించింది.
rashmika mandanna boyfriend :
మొదటి సినిమా అయినా కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే ఆ సినిమా హీరో అయిన rakshit shetty, rashmika mandanna ఇరువురు ప్రేమించుకున్నారు. కిరాక్ పార్టీ సినిమా హిట్ కావడంతో రష్మిక కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వర్ష డైరెక్టర్ గా వచ్చిన అంజనీపుత్ర సినిమాలో పునీత్ రాజ్ కుమార్ కు జోడిగా రష్మిక ను తీసుకున్నారు. ఈ సినిమా 2017 డిసెంబర్ లో విడుదల అయినది.
ఇది కూడా కమర్షియల్ హిట్ అయినది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు vijay devarakonda గెస్ట్ గా వెళ్ళాడు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే నాటికి డైరెక్టర్ సునీల్ గణేష్ ని హీరోగా పెట్టి ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మికను అడిగారు. ఆ సమయంలో మన తెలుగు డైరెక్టర్ వెంకీ నాగశౌర్య హీరోగా తీయబోయే ఛలో సినిమాకు రష్మిక ను అడిగారు. ఆయా సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేసి షూటింగ్ కు ఓకే చెప్పింది.
అటు కన్నడ లో నటించిన చమ్మక్ సినిమా 2017 డిసెంబర్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయినది. రెండు థియేటర్ లలో హండ్రెడ్ డేస్ కూడా ఆడింది. ఈ సినిమాను తెలుగులో ఛలో ఛలో పేరుతో డబ్ చేశారు. అలాగే 2018 ఫిబ్రవరి లో వచ్చిన ఛలో మూవీ కూడా సూపర్ హిట్ అయినది.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా రష్మిక బోణీ అదిరిపోయింది. తర్వాత పరశురామ్ డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మించిన గీత గోవిందం సినిమాలో గీత క్యారెక్టర్ తో ఆమె లీనమై నది. 2018 ఆగస్టు లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ది. ఈ సినిమా కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తీస్తే 130 కోట్ల గ్రాస్ సాధించింది. చాలా థియేటర్లలో హండ్రెడ్ డేస్ ఆడింది. ఈ సినిమా విజయంతో రష్మిక రెండు రాష్ట్రాలలోనూ బాగా పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది.
ఈ సినిమా ద్వారానే తను విజయ్ దేవరకొండ మంచి స్నేహితులుగా మారారు. దీని తర్వాత నాగార్జున, నాని మల్టీస్టారర్ మూవీ దేవదాసు చిత్రంలో నాని కి జోడీగా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే అదే సమయంలో కన్నడంలో దర్శన్ తో జోడిగా నటించిన yajamana బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత rashmika mandanna డియర్ కామ్రేడ్ మూవీ లో vijay devarakonda తో జతకట్టింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు.
2020 జనవరి 11న సంక్రాంతికి విడుదలైన , మహేష్ బాబుతో కలిసి నటించిన sarileru neekevvaru చిత్రంలో నటనకు బాగా ఆస్కారం ఉన్న పాత్ర చేసింది. నితిన్ తో కలిసి నటించిన భీష్మ, కన్నడలో అర్జున్ మేనల్లుడైన ధ్రువ స్వరాజ్ కలిసి నటించిన పొగరు, అలాగే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా, ఇంకా తమిళంలో సుల్తాన్ అనే సినిమాలు ఈ 2020 లో విడుదలకు రెడీగా ఉన్నాయి.
rashmika mandanna rakshit shetty love story :
తన కెరీర్ లోనే మొట్టమొదటి సినిమా కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే హీరో rakshit shetty తో ప్రేమలో పడిన rashmika, 2018 సెప్టెంబరు లో తన సొంత ఊరిలో విరాజ్ పేటలో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం జరిగిన సంవత్సరం తర్వాత ఏర్పడిన అభిప్రాయ భేదాలతో ఇద్దరూ కూడా విడిపోయారు. అయితే వారి ప్రేమ వైఫల్యం గురించి ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.
అయితే డియర్ కామ్రేడ్ సినిమా ఆడియో ఫంక్షన్లో ఆమె గుండె లోతుల్లో నుంచి మాట్లాడిన మాటలు వింటే జీవితంలో బాగా నమ్మిన వ్యక్తి బాధ పెడితే వచ్చే బాధ లాగానే ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఫైట్ చేయాలి ఈ పోరాటంలో నే జీవితాన్ని నెట్టవలసి ఉంటుంది. అని భావోద్వేగానికి గురి అయినది. అయితే రష్మిక అమ్మగారు సుమన్ మందన గారు మాత్రం రష్మిక నిశ్చితార్థాన్ని రద్దు చేసాము .
మేము చాలా మానసిక వేదనను అనుభవించాము. ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్నాము . ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలి. వేరే వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెడితే మనం ఎన్నాళ్లని సహించ గలం. ఏది ఏమైనాఇప్పుడు మా కుటుంబానికి, హీరో రక్షిత్ శెట్టి కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవు అని ఆమె మాత్రం క్లారిటీ ఇచ్చారు.
ఏమైనా చిన్నవయసులోనే ప్రేమ వైఫల్యం జరిగి నిశ్చితార్థం రద్దు కావడం అనేది చాలా బాధాకరమైన విషయం.
అయితే రష్మిక ఇంతవరకు జరిగిన మానసిక బాధలు గురించి త్వరగా బయట పడి మంచి సినిమాల ద్వారా మరిన్ని విజయాలు అందుకోవాలని అందరం ఆశిద్దాం.