2022 కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికీ ఎలా ఉండబోతోంది ..?

0
Rasi Phalalu 2022 In Telugu
Rasi Phalalu 2022 In Telugu

Rasi Phalalu 2022 In Telugu | రాశి ఫలాలు 2022

2022 ఆంగ్ల నూతన సంవత్సరం లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ? ఎవరికీ ఎలాంటి ఫలితముంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1.మేష రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో నిరాశ చెందాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి జీవితం లో భారీ మార్పులు జరుగుతాయి.

2.వృషభ రాశి

వీరి జీవితంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. కఠినమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైంది. గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఇంట్లో అందరికీ ఆనందం కలుగుతుంది.

3.మిధున రాశి

ఈ సంవత్సరం ప్రారంభ నెలల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆందోళన పెరుగుతుంది. గ్రహాల ప్రతికూల కారణాలవల్ల ముఖ్యమైన పనులలో అడ్డంకులు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆగస్టు నెలాఖరులో గా ఉద్యోగం దొరుకుతుంది. పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

4.కర్కాటక రాశి

ఈ సంవత్సరం ప్రారంభ సమయంలో డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎవరి సపోర్టు ఉండదు. పని గురించి ఎక్కువగా ఆందోళన ఉంటుంది. పార్టనర్ షిప్ బిజినెస్ కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార లావాదేవీలు కూడా తగ్గిపోతాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మీ అదృష్టం మారబోతున్న ది. ముఖ్యంగా మీ కష్టానికి తగ్గ ఫలితం లభించనుంది.

5.సింహరాశి

ఈ రాశి వారికి 2022 సంవత్సరం చాలా ముఖ్యమైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో అన్నీ మంచి పనులు జరుగుతాయి. పిల్లల నుంచి ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యారంగంలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఆందోళన తగ్గుతాయి. ఈ సంవత్సరం చివరి భాగంలో ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి.

6.కన్యారాశి

ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో అన్నీ శుభాలే జరుగుతాయి. ముఖ్య ఆర్థికపరమైన స్థితులు బలపడతాయి. తక్కువ శ్రమతోనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. పనుల్లో ఏదైనా ఆటంకాలు ఉంటే ధైర్యంతో అధిగమిస్తారు. అయితే మీ వ్యక్తిగత జీవితంలో మరియు వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి.

7.తులా రాశి

ఈ సంవత్సరం ఉద్యోగం చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. వీరికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కష్టపడి విజయం సాధించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం మధ్యలో మీ వివాహ జీవితంలో పెద్ద మార్పు జరుగుతుంది. పెళ్లికాని వారికి నవంబర్ తర్వాత వివాహం జరిగే పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఈ రాశి వారికి అన్నీ నూతన అంశాలే జరుగుతాయి.

8.వృశ్చిక రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. సెప్టెంబర్ నెల నుంచి కొంచెం మార్పు ఉంటుంది. సోమరితనం వదిలేసి ఉత్సాహంతో ముందుకు కొనసాగాలి. చిన్న చిన్న విషయాలకు జీవితభాగస్వామితో గొడవలు జరుగుతాయి.

9.ధను రాశి

ఈ రాశి వారికి 2022 సంవత్సరం లో మంచిగా ఉంటుంది. మీ యొక్క ప్రతి ప్రయత్నము విజయం సాధిస్తుంది. మీరు ఒకవేళ విద్యార్థిగా ఉంటే పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల మానసిక ఆందోళన పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ప్రతికూల పరిస్థితులు వాటిల్లుతాయి. అయితే ఈ సంవత్సరం చివరి భాగంలో మీరు పనిచేసే రంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.

10.మకర రాశి

వీరికి జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. శని దేవుని అనుగ్రహంతో మీ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. డబ్బు విషయంలో అజాగ్రత్త ఉండకూడదు. ఇంట్లో వచ్చే సమస్యలను కుటుంబ సభ్యులు సానుకూలంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు జీవిత భాగస్వామి తో కలిసి అనేక పర్యాటక ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది.

11.కుంభరాశి

వీరికి ఈ నూతన సంవత్సరం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పూర్తి లాభాలు కలిసివస్తాయి. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. మే నెల వరకు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కలుగుతాయి. సులువుగా సంపాదన పెరుగుతుంది.

12.మీన రాశి

ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అటుఇటుగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అయినప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈ సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సానుకూల ప్రభావం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :-

  1. బల్లి శాస్త్రం – దోషలేంటి ?
  2. ఆడవారిపై బల్లి పడిందా ? అయితే ఇవి తెలుసుకోండి.
  3. మగవారిపై బల్లి పడితే ఏమ చేయాలో మీకు తెలుసా ?