రాశి ఫలాలు ఈ రోజు 17 June 2022 | Today Rasi Phalalu In Telugu
Rasi Phalalu Today In Telugu :- జూన్ 17 నా ఈ రోజు ఏ రాశి శుభాలు ఎలా ఉన్నాయి ఎవరికీ మంచి జరుగుతుంది, ఎవరికీ చెడు జరుగుతుంది, నివారణ దోషాలు ఏమిటి ఇలా అన్ని విషయాలు, ఈరోజు రాశి ఫలాలో తెలుసుకొందం. మేష రాశి నుండి మీనా రాశి దాక ఇవాళ ఎలా ఉన్నదీ అని తెలుసుకొందం.
17 జూన్ 2022 రోజు రాశి ఫలాలు | Rasi Phalalu Telugu lo
- మేష రాశి (Aries):- ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది, ఆకస్మిక ధన లాభం వస్తుంది. ప్రయత్న కార్యాలలో విజయం సాధిస్తారు, బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల వారు ఉస్తహనగా ఉంటారు. స్త్రీ లు కాలక్షేపo చేస్తారు.
- వృషభం రాశి(Taurus) :- ఈ రోజు పొడి పరిక్షల ద్వారా ఉద్యోగo కోసం ఎదురుచూస్తూ ఈ రాశి వారు లేదా స్వంతoగా వ్యాపారం చేయాలనుకొన్న వారు నిరంతరం ప్రయత్నం చేయాలి, పని రంగాo లో సహోద్యోగులతో కలిసి పని చేయండి. మీ పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, సామాజిక సమన్వయం, ప్రతిష్ట మెరుగ్గా ఉంటుంది.
- మిధునం రాశి(Gemin) :- ఆటంకాలున్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఇంటా బయటా పనుల ఒత్తిడి ఉంటుంది. జీవితానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటరు. ఆర్థికంగా మేలు జరుగుతుంది, కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి.
- కర్కటక రాశి (Cancer) :- ఆకస్మిత ధన లాభం ఉంటది, కుటుంభంలో ఆనంద ఉస్తాహం కలిగి ఉంటారు. బంధు, మిత్రులను కలుస్తారు, సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారు. ప్రతి విషయం లో అభిరుది లభిస్తుంది,శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
- సింహ రాశి(Leo) :- ఈ రోజు సింహ రాశి వారికి సంపదలు పెరుగుతాయి. మీరు అన్ని రకాల భౌతిక ఆనందాలను అనుభవిస్తారు, కొత్త సముపార్జనలు జరగవచ్చు. మీ బంధువులతో మీ సంబంధం ఉద్రిక్తంగా ఉండవచ్చు, మీరు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగవచ్చు.
- కన్య రాశి(Virgo) :- ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు, నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులకు కళ్లెం వేయాలి, కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
- తుల రాశి(Libra) :- ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి, స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది, పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
- వృశ్చిక రాశి(Scorpio) :– ఈ రోజు వృశ్చిక రాశి వారికి అదృష్టం తోడ్పాటును అందిస్తుంది. కష్టాలు తీరుతాయి, నిలిచిపోయిన పని కదలికలో ఉంటుంది. ఆర్థిక విషయాలలో క్రమబద్ధమైన పని చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్య వ్యక్తిగత సంబంధాలు సుహృద్భావంగా ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
- ధనుస్సు రాశి(Sagittarius) :- ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది. సమయం బాగుంది. మిత్రులకు మీ వల్ల మేలు జరుగుతుంది, పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలు ఎంతగానో కలిసి వస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
- మకర రాశి(Capricorn) :- ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు, నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది మానసిక ఆనందం పొందుతారు.
- కుంభ రాశి(Aquarius) :- ఈ రోజు కుంభ రాశి వారు కొందరు సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. తగు ఆలోచనల తర్వాతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, మీరు సామాజికంగా చురుకుగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పరిచయాలను కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకోవచ్చు.
- మీనా రాశి(Pisces) :- ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. ఆటంకాలు, అవరోధాలు ఉన్నా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
ఇవి కూడా చదవండి :-