రేషన్ కార్డు దారులకు మరో షాక్ ఇచ్చిన జగన్ ఇక వీరికి రానట్టే!

0

ration card ap online status

రాష్ట్రంలో అందరికీ బియ్యం కార్డులు జారీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమైనవి.ఇందుకు సంబంధించిన అర్హుల జాబితాను ఇదివరకే విడుదల చేశారు. వైయస్సార్ నవశకం కింద వేరు వేరు పథకాలకు వేర్వేరు కార్డులు జారీ చేసేందుకు, ప్రభుత్వం నిర్ణయించింది. ration card ap online status చెక్ చేయడానికి మనం సచివాలయం దగ్గరకు వెళ్ళాల్సి ఉంటుంది.

ఇప్పటికే తెల్లకార్డు ఉన్న కోటి 47 లక్షల మందికి, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి బియ్యం కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ వరకు అర్హుల జాబితాను రెడీ చేసింది. అర్హుల జాబితాను సచివాలయంలో ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే కొంతమంది అనర్హులకు కూడా అందులో చోటు దక్కిందని వినిపిస్తున్నది.

  • అర్హుల లిస్టు ఆన్లైన్లో చూసుకోవచ్చా? – ration card online ap
  • ఆ లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలి?- ration card list ap name check
  • కొత్తగా మరల రేషన్ కార్డు కి అప్లై చేసుకోవచ్చా? – how to apply new ration card in ap

ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం కార్డు లో ముద్రణ కోసం జగన్ ప్రభుత్వం దాదాపు 20 కోట్ల రూపాయలు కేటాయించింది. వీటి ముద్రణ కోసం టెండర్లను కూడా ఆహ్వానించారు ఈ విషయం అందరికీ తెలిసినదే.
ఇకపోతే త్వరలో ప్రాదేశిక ఎన్నికలు తర్వాత పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం కానున్నాయి. తెల్ల కార్డుకు మరియు ఆరోగ్యశ్రీ కార్డు కు ఉన్న లింకు తొలగించడం వల్ల ఇప్పటికే తెల్లకార్డు లేనప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు పొందే అవకాశం కలిగింది.

ఇప్పటికే జారీచేసిన తెల్లకార్డు లలో చాలా మంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో దాదాపు 20 శాతం వరకు తెల్ల కార్డులు అనర్హులు పొందినట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి బియ్యం కార్డు ఆధారంగా రేషన్ పంపిణీ చేయాలని ఏర్పాట్లు చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో, ఎన్నికల తర్వాతనే పౌరసరఫరాల శాఖ వారు లబ్ధిదారులకు బియ్యం కార్డులను సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అనర్హత ల పేరుతో బియ్యం కార్డుల సంఖ్య తగ్గిస్తే దాని యొక్క ప్రభావం తప్పకుండా ఎన్నికల మీద పడుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. ఇందువల్లే కార్డుల జారీలో మరింత జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. అందుకే గ్రామ వార్డు సచివాలయం లో బియ్యం కార్డుల అర్హుల జాబితాను ప్రకటించడం ఆపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాతనే ప్రకటించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు చేరాయి. ఈ ఆదేశాలు జిల్లా స్థాయి అధికారులకు చేరినట్లు తెలుస్తున్నది.

కొత్తగా బియ్యం కార్డులు జారీచేసే అంతవరకూ వాటి స్థానంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న రేషన్ కార్డుల ద్వారానే రేషన్ పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అయితే దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ వారు ఎలాంటి వెబ్సైట్ ను రూపొందించి లేదని త్వరలోనే అర్హుల జాబితాను రూపొందిస్తున్నారని అందులోనే వారి జాబితా చ సుకోవచ్చని తెలుపుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు కూడా ఇక ఎన్నికలు అయ్యేంత వరకు ఆగాలని అధికారులు చెబుతున్నారు.