దక్షిణాఫ్రికా జట్టును కాపాడేదెవరు?

0

పూణే;భారత్ దక్షిణాఫ్రికా లా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మూడో రోజుకే పరిమితమైంది. శనివారం 36/3 తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు  ఆఖరి సేసన్ లో 275 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.దీంతో మన జట్టు కి 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

మన భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ. డబుల్ సెంచరీ చేయగా, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ చేయడంతో,శుక్రవారం మన జట్టు 601/ 5  పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.అయితే విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా జట్టు ను ఫాలోఆనొ ఆడిస్తాడ,లేక రేపు ఒక సేసన్ పాటు బ్యాటింగ్ చేసి దక్షిణాఫ్రికా జట్టు ముందు ఇంకా భారీ లక్ష్యం నిర్దేశిస్తాడ  అన్న విషయం రేపు తెలుస్తుంది.ఎందుకంటే ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

ఇక దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విషయానికొస్తే, డు ప్లెసిస్[ 64] అర్థ సెంచరీ చేయగా,10 వ స్థానంలో లో బ్యాటింగ్ కు  వచ్చిన కేశవ్ మహారాజ్[ 72] అర్థ సెంచరీతో అదరగొట్టాడు.

దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోకుండా ఉండాలంటే ఏదైనా అద్భుతమే జరగాలి. లేకపోతే వరుణుడు అడ్డుకోవాలి, అంతే తప్ప దక్షిణాఫ్రికా జట్టు ఓటమి మాత్రం ఖాయం గా కనిపిస్తుంది. ఇన్నింగ్స్ ఓటమ, లేక భారీ పరుగులతో ఓడిపోవడమా, రెండు రోజుల్లో తేలనుంది.